Greta E Scooters: బడ్జెట్ ధరల్లో గ్రేటా ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే వంద కిలోమీటర్లు..!(వీడియో)
భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. పోటా పోటీగా వాహన తయారీదారులు తమ కొత్త మోడళ్లను పరిచయం చేస్తున్నాయి. ఇక ఎలక్ట్రిక్ వాహనాల్లో కొత్త స్టార్టప్ కంపెనీలు సైతం ఈ సెగ్మెంట్‌లోకి వేగంగా ప్రవేశిస్తున్నాయి.
భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. పోటా పోటీగా వాహన తయారీదారులు తమ కొత్త మోడళ్లను పరిచయం చేస్తున్నాయి. ఇక ఎలక్ట్రిక్ వాహనాల్లో కొత్త స్టార్టప్ కంపెనీలు సైతం ఈ సెగ్మెంట్‌లోకి వేగంగా ప్రవేశిస్తున్నాయి. తాజాగా గుజరాత్‌కు చెందిన గుజరాత్ ఎలక్ట్రోమోటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్ గ్రేటా బ్రాండ్‌తో లేటెస్ట్ మోడల్ ఎలక్ట్రిక్ స్కూటర్లను పరిచయం చేసింది.గుజరాత్‌కు చెందిన ఈ స్టార్టప్ గ్రేటా బ్రాండ్ పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేస్తోంది. కంపెనీ తాజాగా మార్కెట్లో 4 కొత్త మోడళ్లను ప్రవేశపెట్టింది. ఇందులో హార్పర్, ఎవెస్పా, గ్లైడ్, హార్పర్ ZX ఉన్నాయి. ఈ స్కూటర్లను కొత్త ఆకర్షణీయమైన రంగులు, అత్యాధునిక డిజైన్లు, పెద్ద స్టోరేజ్ స్పేస్‌తో పరిచయం చేశారు. ఈ స్కూటర్లు ధరలో తక్కువగా ఉండటమే కాకుండా మెరుగైన డ్రైవింగ్ రేంజ్‌ను అందిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ స్కూటర్లలో కంపెనీ 48-వోల్ట్ నుంచి 60-వోల్ట్ కెపాసిటీ గల లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌లను ఉపయోగించింది. ఈ స్కూటర్లు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 70 నుంచి 100 కిమీల డ్రైవింగ్ రేంజ్ ఇస్తాయని కంపెనీ తెలిపింది.
మరిన్ని చూడండి ఇక్కడ:
jr.NTR in RRR: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తారక్ లుక్స్ అండ్ పోస్టర్స్..
ఏపీ-ఒడిశా సరిహద్దులో కొత్త జలపాతం.. నెట్టింట వైరల్
2,400 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం!
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు

