CM KCR: దేశం మార్పు కోరుకుంటోంది.. INDIA.. NDA.. మేము ఏ కూటమిలో లేం.. సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..
Bharat Rashtra Samithi: మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో మీడియాతో మాట్లాడిన కేసీఆర్.. బీఆర్‌ఎస్ ఒక్కటే కాదని, తమకు భాగస్వాములు సైతం ఉన్నారంటూ పేర్కొన్నారు. మహా ప్రతిపక్ష కూటమి- ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ (ఇండియా), కాంగ్రెస్‌పై తెలంగాణ సీఎం పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.. ‘‘ఏమిటి ఈ ఇండియా..? వారు (కాంగ్రెస్) దేశాన్ని 50 ఏళ్లకు పైగా పాలించారు..
కొల్హాపూర్, ఆగస్టు 2: కేంద్రంపై అవిశ్వాస తీర్మానం, ఢిల్లీ సర్వీసెస్ ఆర్డినెన్స్ బిల్లు.. దీంతో ఢిల్లీ రాజకీయాలు గరం గరంగా మారాయి. ఓ వైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ.. మరోవైపు విపక్షాల కూటమి ఇండియా.. ఎవరికి వారు పదునైన వ్యూహాలతో దూకుడు పెంచాయి. ఇప్పటివరకు ఎలాంటి కూటమిలో లేని బీఆర్ఎస్ సైతం కేంద్ర ప్రభుత్వం తీరుపై మొదటినుంచి వ్యతిరేక స్వరం వినిపిస్తోంది. ఈ మేరకు పార్లమెంట్ ఉభయ సభల్లో సైతం కేంద్ర ప్రభుత్వంపై దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో కేంద్రంపై అవిశ్వాస తీర్మానంపై అనుకూలంగా, ఢిల్లీ సర్వీసెస్ ఆర్డినెన్స్ బిల్లుకు వ్యతిరేకంగా విపక్షాలు చేస్తున్న ప్రయత్నాల మధ్య తెలంగాణ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) చీఫ్ కే చంద్రశేఖరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ.. ప్రతిపక్ష కూటమి ఇండియా (INDIA), బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA).. రెండింటితో లేదని పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ప్రకటించారు.
బుధవారం మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో మీడియాతో మాట్లాడిన కేసీఆర్.. బీఆర్‌ఎస్ ఒక్కటే కాదని, తమకు భాగస్వాములు సైతం ఉన్నారంటూ పేర్కొన్నారు. మహా ప్రతిపక్ష కూటమి- ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ (ఇండియా), కాంగ్రెస్‌పై తెలంగాణ సీఎం పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.. ‘‘ఏమిటి ఈ ఇండియా..? వారు (కాంగ్రెస్) దేశాన్ని 50 ఏళ్లకు పైగా పాలించారు.. దేశంలో ఎటువంటి మార్పు తీసుకురాలేకపోయారు. దేశం మార్పు కోసం పిలుపునిస్తోంది..’’ అంటూ కేసీఆర్ పేర్కొన్నారు.
రాష్ట్రంలోని.. దేశంలోని రాజకీయ పరిణామాలతో సీఎం కేసీఆర్.. ప్రతిపక్ష కూటమికి, బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డిఎకి మద్దతు ఇవ్వడం లేదు. అంతకుముందు విపక్ష పార్టీలను ఐక్యం చేసే ప్రయత్నాలలో భాగంగా గత సంవత్సరం ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ (ఎస్‌పి) అధినేత అఖిలేష్ యాదవ్‌ను కలిశారు. అంతేకాకుండా.. పలువురు సీఎంలు, పలు పార్టీల నాయకులతో కూడా వరుసగా భేటీ అయ్యారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో కేసీఆర్.. రెండు కూటములకు దూరంగా ఉండి.. తటస్థ వైఖరిని అవలంభిస్తున్నారు.
#WATCH Telangana CM & BRS President KC Rao on being asked if his party is with I.N.D.I.A alliance or NDA
“We are neither with anyone nor do we want to be with anyone. We aren’t alone & we also have friends as well. What is new India? They were in power for 50 years, there was… pic.twitter.com/uvnmaJWaGE
— ANI (@ANI) August 2, 2023
మహారాష్ట్రపై కేసీఆర్ ఫోకస్..
మహారాష్ట్రపై ఫుల్ ఫోకస్ పెట్టిన BRS అధినేత సీఎం కేసీఆర్.. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. మహారాష్ట్రలో రాజకీయ కార్యకలాపాలపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సీఎం కేసీఆర్ సమాధానమిస్తూ.. “బీఆర్ఎస్ వివిధ స్థాయిలలో (మహారాష్ట్రలో) పార్టీ కమిటీలను ఏర్పాటు చేసే ప్రక్రియలో ఉంది. భారత రాష్ట్ర సమితి ఎన్నికల్లో పోరాడుతుంది.. దీనికోసం ఇప్పటికే కార్యక్రమాలు, కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. మహారాష్ట్రలో పార్టీ కార్యక్రమాలను ప్రారంభించిన నాటినుంచి 14.10 లక్షల మంది కార్యకర్తలను సొంతం చేసుకున్నాం..’’ అంటూ తెలిపారు.
మహారాష్ట్రలో ఇప్పటికే 50 శాతానికి పైగా గ్రౌండ్‌వర్క్ పూర్తయిందని బీఆర్‌ఎస్ సుప్రీమ్ కేసీఆర్ తెలిపారు. ప్రతి గ్రామంలో మిగిలిన పనులు, కార్యకలాపాలను వచ్చే 15 నుంచి 20 రోజుల్లో పూర్తి చేస్తామని తెలిపారు. “మహారాష్ట్ర సహజ వనరుల సమృద్ధితో ఉంది.. ఈ విషయంలో మరే రాష్ట్రం కూడా దీనికి సరితూగదు.. రాష్ట్రానికి ఉద్యోగాలు, సంపద సృష్టిలో కూడా అపారమైన అవకాశాలు ఉన్నాయి. అయితే, ఔరంగాబాద్ నగరం (దీనిని ఛత్రపతి శంభాజీ నగర్‌గా మార్చారు) కానీ.. నీటి సంక్షోభంతో ఇబ్బంది పడుతోంది.. అంటూ పేర్కొన్నారు.
మహారాష్ట్రలో దళితులు అన్యాయాన్ని ఎదుర్కొంటూ నిరంతర పోరాటాలు చేస్తున్నారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. “మహారాష్ట్రలో దళిత సమాజానికి తీవ్ర అన్యాయం జరుగుతోంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కూడా ఆఫ్రికన్ అమెరికన్ (బరాక్ ఒబామా)ని అధ్యక్షుడిగా ఎన్నుకుని వివక్ష లేకుండా చేశారు” అంటూ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..