Bhagat Singh Jayanti: భారత యువతలో స్వేచ్ఛాకాంక్ష‌ని ర‌గిల్చిన విప్లవ జ్యోతి భగత్ సింగ్ జయంతి నేడు.. యావత్ భారత్ నివాళులు

Bhagat Singh Jayanti Today: మనుష్యులను చంపగలరేమో కానీ వారిలో ఉండే ఆశయాలను కాదు అని చాటి చెప్పిన వీరుడు.. ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు భ‌ర‌త‌మాత ప్రియపుత్రుడు భగత్ సింగ్ 114 వ జయంతి.. 

Bhagat Singh Jayanti: భారత యువతలో స్వేచ్ఛాకాంక్ష‌ని ర‌గిల్చిన విప్లవ జ్యోతి భగత్ సింగ్ జయంతి నేడు.. యావత్ భారత్ నివాళులు
Bhagat Singh
Follow us
Surya Kala

|

Updated on: Sep 28, 2021 | 11:58 AM

Bhagat Singh Jayanti Today: మనుష్యులను చంపగలరేమో కానీ వారిలో ఉండే ఆశయాలను కాదు అని చాటి చెప్పిన వీరుడు.. ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు భ‌ర‌త‌మాత ప్రియపుత్రుడు భగత్ సింగ్ 114 వ జయంతి  నేడు. ఇంక్విలాబ్ జిందాబాద్ నినాదంతో స్వేచ్ఛాకాంక్ష‌ని ర‌గిల్చి, స్వ‌రాజ్య‌సాధ‌న పోరాటంలో చిరు ప్రాయంలోనే ప్రాణాలను ఒదిలిన భగత్ సింగ్ కు యావత్ భారతం ఘన నివాళులర్పిస్తుంది. యువ‌త‌కి స్పూర్తి-నిత్య చైత‌న్య దీప్తి విప్ల‌వ జ్యోతిని గుర్తు చేసుకుంటూ ప్రధాని మోడీ, ప్రముఖులతో సహా అనేక మంది సోషల్ మీడియా వేదికగా జోహార్లు అర్పిస్తున్నారు. భగత్ సింగ్ ఈ పేరు వింటే చాలు.. యావత్ భారతీయుల రక్తం గర్వంతో ఉప్పొంగుతుంది. ఆయన ఆశయాలు, ఆలోచనలు, ఆవేశం ఎంతోమంది యువతలో స్ఫూర్తి నింపింది. గొప్ప విప్లవకారుడిగా, స్వాతంత్య్ర సమరయోధుడిగా చరిత్రలో నిలిచిపోయిన వీరుడు.  భగత్ సింగ్.. మండే అగ్ని గోళం. జ్వలించే నిప్పుకణిక. రెపరెపలాడే విప్లవ పతాక. భగత్ సింగ్ పేరు వింటేనే ప్రతి భారతీయుడి రోమాలు నిక్కబొడుచుకుంటాయి.

భగత్ సింగ్ ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్న పంజాబ్ ప్రాంతంలోని  ఖత్కర్ కలాన్ అనే గ్రామంలో కిషన్ సింగ్, విద్యావతి దంపతులకు 1907, సెప్టెంబరు 27న జన్మించారు. భగత్ సింగ్ తాత అర్జున్ సింగ్ స్వామి దయానంద సరస్వతికి అనుచరులు. అలాగే హిందూ సంస్కరణ ఉద్యమంలోనూ పాల్గొన్నాడు. దీంతో తాతగారి ప్రభావం భగత్‌పై బాగా ఉండేది. 13 ఏళ్ల వయసులో మహాత్మాగాంధీ సహాయ నిరాకరణోద్యమం భగత్ పై విపరీత ప్రభావం చూపింది. ప్రత్యక్షంగా ఆ స్వాతంత్య్ర పోరాటంలో మొదటిసారి పాల్గొన్నారు. ప్రభుత్వ పుస్తకాలను, దుస్తులను తగులబెట్టారు.  1919లో జరిగిన జలియన్ వాలా బాగ్ దురంతం భగత్ సింగ్ స్వాతంత్య కాంక్షను మరింత రగిలించింది. అయితే గాంధీ అహింసా మార్గం కంటే హింసకు హింసే సమాధానం అని నమ్మరు.  ఇంతలో లాహోర్‌లోని నేషనల్ కాలేజీలో చేరిన భగత్ సింగ్ కు పెళ్లి చేసేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. దీంతో భగత్ ఓ ఉత్తరం రాసి ఇంటి నుంచి పారిపోయారు. ఆ ఉత్తరంలో నా జీవితం దేశానికి అంకితం చేయాలనుకుంటున్నాను. నాకు ఇంకే కోరిక లేదు అని రాసి ఇంటి నుంచి వెళ్ళిపోయి ‘నవ జవాన్ భారత సభ ‘అనే సంఘం లో చేరారు. అప్పుడే  భగత్ సింగ్ కు సుఖ్ దేవ్ పరిచయమయ్యారు.

గాంధేయవాదంపై భగత్ సింగ్‌కు నమ్మకం లేదు. గాంధేయవాద రాజకీయాల వల్ల స్వార్థపరులు పుట్టుకొస్తూనే ఉంటారని ఆయన అభిప్రాయం. బ్లడ్ స్ప్రింక్లెడ్ ఆన్ ది డే ఆఫ్ హోలీ బాబర్ అకాలిస్ ఆన్ ది క్రుకిఫిక్స్” వంటి రచనలు ధరమ్ సింగ్ హయత్‌పూర్‌‌ పోరాటం తో భగత్ ప్రభావితమయ్యారు అదే సమయంలో సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా దేశంలో సైమన్ గో బ్యాక్ ఉద్యమం జరుగుతున్న సమయంలో లాహోర్‌లో లాలా లజపతి రాయ్ బ్రిటిష్ సాయుధ బలగాలను ఎదురొడ్డి నిలిచారు.  అప్పుడు బ్రిటిష్ వారి దాడిలో  పంజాబ్ కేసరి నేల కొరిగారు. దీంతో భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురులలో ఆగ్రహాన్ని నింపింది. చెమర్చిన కళ్లతోనే సాండర్స్ అంతు చూశారు. కసి తీరా కాల్చి చంపారు. ఆ హత్యకు కారణమైన వారిని ఉరితీయాలని బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయించింది. అనంతరం 1929లో అసెంబ్లీపై బాంబులు విసిరారు. ఆ సంఘటనలో ఎవరూ గాయపడలేదు. అనంతరం ముగ్గురు లొంగిపోయారు. దేశం నుంచి బహిష్కరణకు గురయ్యారు. అనంతరం వారిపై బ్రిటిష్ ప్రభుత్వం సాండర్స్ హత్యా నేరం మోపింది. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్‌దేవ్‌లు నేరాన్ని ఒప్పుకున్నారు. కోర్టులో బ్రిటిష్ వ్యతిరేక నినాదాలు చేశారు. కోర్టు వారికి ఉరిశిక్ష విధించింది.

భగత్ సింగ్ జైలులో ఉన్న సమయంలోనే 404 పేజీల డైరీని రాశారు. తల్లిదండ్రులు బ్రిటిష్ ప్రభుత్వాన్ని క్షమాభిక్ష కోరుతుంటే అంగీకరించని భగత్ సింగ్ 23 ఏళ్ల వయసులోనే దేశ స్వాతంత్య్రం కోసం పోరాడి ఉరి కొయ్యను ముద్దాడాడు. మార్చి 23, 1931 రాత్రి 7.30 గంటలకి తన స్నేహితులయిన విప్లవ యోధులు సుఖ్ దేవ్, రాజ్ గురులతో పాటు అసువులు బాశాడు. నిరంకుశ బ్రిటిష్ ప్రభుత్వం వారి ముగ్గురినీ వరుసగా నిల్చోబెట్టి ఉరి తీసింది. ఉరి కొయ్య ముందు నిల్చుని కూడా ఆ ముగ్గురూ ఏ మాత్రం భయపడలేదు. ఉరికొయ్యను ముద్దాడే ముందు ఉరి కొయ్యని ముద్దాడే ముందు చివరిసారి ఇచ్చిన నినాదం ఇంక్విలాబ్ జిందాబాద.  ఆ ధైర్యమే ప్రవాహంలా మారి తరువాతి తరాలకు చేరింది.

Also Read:

Lata Mangeshkar Birthday: 91వ జన్మదినాన్ని జరుపుకుంటున్న గానకోకిల లతా మంగేష్కర్.. జీవితంలో కొన్ని ముఖ్య విషయాలు..