Lata Mangeshkar Birthday: 91వ జన్మదినాన్ని జరుపుకుంటున్న గానకోకిల లతా మంగేష్కర్.. జీవితంలో కొన్ని ముఖ్య విషయాలు
Lata Mangeshkar Birth Day:భారతీయ నైటింగేల్ లతా మంగేష్కర్ నేడు 91 వ వసంతంలోకి అడుగుపెట్టారు. సినీ నేపధ్య గాయనిగా భారతీయ చలన చిత్ర పరిశ్రమలో చెరగని ముద్రవేశారు లతామంగేష్కర్..
Lata Mangeshkar Birth Day: భారతీయ నైటింగేల్ లతా మంగేష్కర్ నేడు 91 వ వసంతంలోకి అడుగుపెట్టారు. సినీ నేపధ్య గాయనిగా భారతీయ చలన చిత్ర పరిశ్రమలో చెరగని ముద్రవేశారు లతామంగేష్కర్. ఈ లెజెండరీ సింగర్ గా 13 ఏళ్ళ వయసులో గాయనిగా సినీ జర్నీని ప్రారంభించారు. సుమారు 78 సంవత్సరాల పాటు నేపధ్యగాయనిగా 980 సినిమాలకు పాటలను పాడారు. 1942లో మరాఠీ చిత్రంలో హీరోయిన్ చెల్లెలుగా నటించి రెండు పాటలు పాటలను పాడారు. ఆయెగా ఆయెగా ఆయెగా ఆనేవాలా పాటతో మొదలైన లతా మంగేష్కర్ కళాప్రయాణంలో దాదాపు 20 భాషలలో 50 వేలకు పైగా పాట వరకూ సాగింది. ఈరోజు లతా మంగేష్కర్ పుట్టిన రోజు సందర్భంగా లెజెండరీ సింగర్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం..
1) తండ్రి దీనానాథ్ మంగేష్కర్ కు లతా మంగేష్కర్ తల్లి రెండో భార్య. తండ్రి సుప్రసిద్ధ సంగీతకారుడు.
2) ఈ దంపతులకు లత 1929 సెప్టెంబరు 28 న జన్మించారు. లతా మంగేష్కర్ కు మీనా, ఆశా భోంస్లే, ఉషా, హృదయనాథ్ అనే నలుగురు తోబుట్టువులు. ఆశా భోంస్లే కూడా ప్రముఖ నేపధ్య గాయని.
3) లత తండ్రి, దీనానాథ్ థియేటర్ ఆర్టిస్ట్ అంతేకాదు మంచి క్లాసికల్ సింగర్. దీంతో చిన్నతనం నుంచి తండ్రిని అనుసరిస్తూ లత పడేవారు అలా సంగీతాన్ని నేర్చుకున్నారు.
4) నిజానికి లత పుట్టిన సమయంలో పెట్టిన పేరు హేమ.. అయితే తండ్రి నటిస్తున్న “భవ బంధన్” నాటకంలో లతిక అనే పాత్రలో నటించారు. అప్పటి నుంచి హేమ పేరు లత గా మారిపోయింది. లతా మంగేష్కర్ గా ప్రఖ్యాతి గాంచారు.
5) లత తన ఐదేళ్ల వయసు నుంచే నాటకాల్లో నటించడం.. పాటలు పాడడం మొదలు పెట్టారు.
6) మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో జన్మించిన లత అక్కడ 16 ఏళ్లుమాత్రమే ఉన్నారు. లత జీవితంలో ఎక్కువకాలం ముంబైలో గడిపారు.
7) 1942 లో మరాఠీ చిత్రం కిటి హసల్ సినిమాలో లత మొదటి పాటను పాడారు. అయితే ఆ పాట సినిమా నుంచి కట్ చేశారు. దీంతో ఇప్పటికీ ఆ పాట రిలీజ్ కాలేదు.
8) లతా మంగేష్కర్.. ఆనంద్ఘన్ అనే పేరుతో కొన్ని మరాఠీ చిత్రాలకు సంగీతం అందించారు.
9) జనవరి 27, 1963 న న్యూఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో లతా పాడిన “ఏ మేరే వతన్ కే లోగాన్” దేశభక్తి గీతం వింటూ అప్పటి ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ కంటతడి పెట్టారు. ఈ పాట 1962 యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు అంకితం చేశారు.
10) గాయకుడు సంగీత దర్శకుడు గులామ్ హైదర్‌ను తన గాడ్ ఫాదర్‌గా భావిస్తారు. లతా సంగీత ప్రతిభపై విశ్వాసం చూపించడమే కాదు.. ఎన్నో అవకాశాలు ఇచ్చారు.
11) లతా బాల్యం కష్టాలు కన్నీళ్ళతో గడిచిపోయింది. అయిదవ ఏటనే తండ్రివద్ద సంగీత శిక్షణ ప్రారంభించిన లతకు సంగీతాన్ని వినడం, పాడడంతప్ప మరోలోకం లేదు. తాను చదువుకోలేకపోయినా తన తర్వాతివారైనా పెద్దచదువులు చదవాలనుకొంది. అయితే వారుకూడా చదువుకన్నా సంగీతంపైనే ఎక్కువ మక్కువ చూపడంతో వారి కుటుంబమంతా సంగీతంలోనే స్థిరపడ్డారు.
12) లతామంగేష్కర్ పుట్టిన రోజుల సందర్భంగా దేశ ప్రధాని మోడీ సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలను చెబుతున్నారు.
91వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న లతా మంగేష్కర్‌కు ప్రధాని నరేంద్ర మోడీ విషెస్ తెలిపారు.
లతా మంగేష్కర్‌కు బర్త్ డే విషెస్ చెబుతూ ప్రధాని ట్వీట్..
Birthday greetings to respected Lata Didi. Her melodious voice reverberates across the world. She is respected for her humility & passion towards Indian culture. Personally, her blessings are a source of great strength. I pray for Lata Didi’s long & healthy life. @mangeshkarlata
— Narendra Modi (@narendramodi) September 28, 2021
జుహీచావ్లా:
A 100 trees for the legendary Lataji on her birthday Radio sun rahi thi , aapke 70’s ke gaane baj rahe the , aapki aawaz ko sunkar aisa laga jaise ,phoolon ki baarish ho rahi hai , jaise Gangaji beh rahi hai with much love and respect . pic.twitter.com/P3n9hro1BA
— Juhi Chawla (@iam_juhi) September 28, 2021
మధుర్ బండార్కర్:
A 100 trees for the legendary Lataji on her birthday Radio sun rahi thi , aapke 70’s ke gaane baj rahe the , aapki aawaz ko sunkar aisa laga jaise ,phoolon ki baarish ho rahi hai , jaise Gangaji beh rahi hai with much love and respect . pic.twitter.com/P3n9hro1BA
— Juhi Chawla (@iam_juhi) September 28, 2021
Also Read: హిందూపురాణాల్లో వీరులు ఎన్ని రకాలో తెలుసా! అతిరథ మహారథులు ఏకకాలంలో ఎంతమందితో యుద్ధం చేస్తారంటే..
Viral Photo: ఒకే ఫేమ్‌లో కృష్ణంరాజు, ప్రభాస్‌ల ‘ఉప్పలపాటి’వారి ఫ్యామిలీ.. సోషల్ మీడియాలో ఫోటో వైరల్..