Raj Kundra Case: అంతా షెర్లిన్ చోప్రానే చేసింది.. రాజ్ కుంద్రాకు బాసటగా నటి గెహనా వశిష్ట సంచలన వ్యాఖ్యలు
Raj Kundra Case: పోర్నోగ్రఫీ కేసులో శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాను నటి గెహనా వశిష్ట మరోసారి వెనకేసుకొచ్చారు. ఈ కేసులో నిందితురాలైన ఆమె.. నటిషెర్లిన్ చోప్రాపై సంచలన ఆరోపణలు చేశారు.
Raj Kundra Case: పోర్నోగ్రఫీ కేసులో శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాను నటి గెహనా వశిష్ట మరోసారి వెనకేసుకొచ్చారు. ఈ కేసులో నిందితురాలైన ఆమె.. నటిషెర్లిన్ చోప్రాపై సంచలన ఆరోపణలు చేశారు. వ్యాపారవేత్త అయిన రాజ్ కుంద్రాను బోల్డ్ కంటెంట్ ఊబిలోకి లాగింది షెర్లిన్ చోప్రానే అంటూ ఆరోపించారు. కేవలం మీడియా, ప్రజల దృష్టిని ఆకర్షించేందుకే శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాల పరువు ప్రతిష్టలకు షెర్లిన్ చోప్రా భంగం కలిగిస్తోందని ఓ ఇంటర్వ్యూలో ఆరోపించారు. నిత్యం వార్తల్లో నిలిచేందుకు, ఉచిత ప్రచారం పొందేందుకే షెర్లిన్ ఇదంతా చేస్తున్నారని అన్నారు. రాజ్ కుంద్రా జైలు నుంచి వచ్చాక షెర్లిన్ చోప్రాను అందరూ మర్చిపోయారని.. అందుకే వార్తల్లో నిలిచేందుకు ఆమె శిల్పా శెట్టిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. రాజ్ కుంద్రా పోర్న్ కేసులో గెహనా వశిష్ట నిందితురాలిగా ఉన్నారు. సుప్రీంకోర్టు నుంచి ఆమె మధ్యంతర బెయిల్ పొందారు.
పోర్నోగ్రఫీ కేసు మొత్తం షెర్లిన్ చోప్రా ప్రచార స్టంట్‌గా గెహనా అభివర్ణించారు. ఈ కేసులో తాను నిందితురాలు కాకూడదనే రాజ్ కుంద్రాపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ప్రచారం కోసమే శిల్పా శెట్టిపై కూడా షెర్లిన్ ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. అయితే షెర్లిన్ వ్యాఖ్యలను ఏ మాత్రం పట్టించుకోని శిల్పా శెట్టి.. ఆమెపై పరువునష్టం దావా వేసేందుకు కూడా సుముఖంగా లేరని వ్యాఖ్యానించారు.
షెర్లిన్ చోప్రా కోట్లాది రూపాయలు ఆర్జించేందుకు రాజ్ కుంద్రా సాయపడ్డారని గెహనా వశిష్ట చెప్పారు. శిల్పా శెట్టి భర్త కారణంగానే షెర్లిన్ చోప్రా ఆర్థికంగా నేడు ఈ స్థాయికి ఎదిగారని వ్యాఖ్యానించారు. రాజ్ కుంద్రాకు షెర్లిన్ చోప్రా కృతజ్ఞతగా ఉండాలన్నారు. బోల్డ్ కంటెంట్ క్రియేషన్‌లోకి రాజ్ కుంద్రాను షెర్లిన్ చోప్రానే తీసుకొచ్చారనిన్న గెహనా.. 2012 నుంచి షెర్లిన్ చోప్రా పోర్న్ కంటెంట్ చేస్తున్నారని ఆరోపించారు. రెండున్నరేళ్ల క్రితమే షెర్లిన్ చోప్రా.. రాజ్ కుంద్రాను కలిశారని అన్నారు.
Also Read..
Samantha: సమంతను ఏదైనా ప్రశ్నించాలనుకుంటున్నారా..? అయితే ఈ రోజు సాయంత్రం రెడీగా ఉండండి.