Shilpa Shetty: ఆ ప్రశ్న అడిగినందుకు రిపోర్టర్‌కు ఇచ్చిపడేసిన శిల్పాశెట్టి.. ఆ వీడియోలో నిజమెంత?
Shilpa Shetty: పోర్నోగ్రఫీ కేసులో అరెస్టైన బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా..ఇటీవల బెయిల్‌పై విడుదల కావడం తెలిసిందే. ఈ కేసులో రాజ్ కుంద్రా 60 రోజులపాటు కారాగార జీవితాన్ని గడిపి.. జైలు నుంచి విడుదలయ్యారు.
Shilpa Shetty: పోర్నోగ్రఫీ కేసులో అరెస్టైన బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా..ఇటీవల బెయిల్‌పై విడుదల కావడం తెలిసిందే. ఈ కేసులో రాజ్ కుంద్రా 60 రోజులపాటు కారాగార జీవితాన్ని గడిపి.. జైలు నుంచి విడుదలయ్యారు. రాజ్ కుంద్రా కారణంగా తన పేరుప్రతిష్టలకు తీవ్ర భంగం కలిగినట్లు శిల్పా శెట్టి భావిస్తున్నట్లు గతంలో ప్రచారం జరిగింది. పోర్నోగ్రఫీ కేసు కారణంగా భర్త రాజ్ కుంద్రాను శిల్పా శెట్టి దూరంగా పెట్టే అవకాశముందని బాలీవుడ్ మీడియా వర్గాల్లో కథనాలు వెలువడ్డాయి. అయితే జైలు నుంచి బయటకొచ్చిన తర్వాత శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా కలిసే ఉంటుండటంతో ఈ ప్రచారంలో వాస్తవం లేదని తేలిపోయింది.
తాజాగా శిల్పా శెట్టికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందులో రాజ్ కుంద్రా గురించి ఏడో ప్రశ్న అడిగిన రిపోర్టర్‌కు శిల్పా శెట్టి ఇచ్చిపడేశారు. ‘నేను రాజ్ కుంద్రానా? నన్ను చూస్తే రాజ్ కుంద్రలా కనిపిస్తున్నానా? నేను ఎవరు?’ అంటూ శిల్పా శెట్టి వ్యాఖ్యలు చేస్తున్నారు. పోరోగ్రఫీ కేసు గురించి మీడియా ప్రతినిధి ప్రశ్నిస్తే శిల్పా శెట్టి ఇలా ఫైర్ అయ్యారంటూ ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు.
అయితే గోల్డ్ కేసులో నటుడు సచిన్ జోషి, రాజ్ కుంద్రాకు మధ్య వివాదంపై మీడియా ప్రశ్నించినప్పుడు శిల్పా శెట్టి ఇలా స్పందించినట్లు తెలుస్తోంది. ఆ వీడియోను ఇప్పుడు రాజ్ కుంద్రా పోర్న్ కేసుకు ముడిపెట్టి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..
I just liked “”Main Raj Kundra lagti hu kya? Do I look like him?” Shilpa Shetty reacts” on #Vimeo: https://t.co/ACFLcEnDn4
— Anthony Davis (@AnthonyDavis529) September 25, 2021
Also Read..
Viral Video: వారెవ్వా.. ఈ రైతు తెలివికి ఫిదా అవ్వాల్సిందే.. అసలు ఏం చేస్తున్నాడో చూడండి…