AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tumakuru Matt: తుమకూరు మఠానికి 13 ఏళ్ల బాలుడు మఠాధిపతిగా ఎంపిక.. చదువుతూనే బాధ్యతలు నిర్వహిస్తాడన్న పెద్దలు

Karnataka: 500 ఏళ్ల మఠానికి అధిపతిగా13 ఏళ్ల బాలుడు కర్ణాటకలోని కుప్పూరు గడ్డుగే సంస్థాన మఠాధిపతిగా 13 ఏళ్ల బాలుడ్ని ఎంపిక చేశారు. ఈ మఠం అధిపతిగా వ్యవహరించిన యతీశ్వర శివాచార్య స్వామి ..

Tumakuru Matt: తుమకూరు మఠానికి 13 ఏళ్ల బాలుడు మఠాధిపతిగా ఎంపిక.. చదువుతూనే బాధ్యతలు నిర్వహిస్తాడన్న పెద్దలు
Tumakuru Matt
Follow us
Surya Kala

|

Updated on: Sep 28, 2021 | 12:38 PM

Karnataka-Tumakuru-mattకర్ణాటకలోని 500 సంవత్సరాల చరిత్రగల వీరశైవ మఠానికి నూతన మఠాధిపతి ఎంపికయ్యారు. తుమకూరు జిల్లాలోని కుప్పూరు గడ్డుగే సంస్థాన మఠం నూతన అధిపతిగా 13 ఏళ్ల బాలుడిని ఎంపిక చేశారు. ఈ మఠం అధిపతిగా వ్యవహరించిన యతీశ్వర శివాచార్య స్వామి శనివారం శివైక్యం చెందడంతో ఆయన వారసుడిగా తేజస్ కుమార్‌ను నియమించారు. అయితే యతీశ్వర స్వామి మరణించడానికి ముందే తన వారసుడిగా తనయుడి తేజస్ పేరుని ప్రతిపాదించారు.

ఇదే విషయంపై కర్ణాటక న్యాయ శాఖ మంత్రి జేసీ మధుస్వామి మాట్లాడుతూ.. యతీశ్వర శివాచార్య స్వామి కోరిక మేరకే తేజస్ ను మఠాధిపతిగా నియమించినట్లు తెలిపారు. అంతేకాదు 13 ఏళ్ల తేజస్ ను మఠాధిపతిగా ఇతర మఠాధిపతులు, ఆధ్యాత్మికవేత్తల సమక్షంలో  ప్రకటించారు. ఇక తరువాత ఈ మఠాన్ని తన మేనల్లుడు నడిపిస్తాడని యతీశ్వర శివాచార్య స్వామి చెప్పారని తెలిపారు.  తుముకూరు జిల్లా చిక్కనాయకనహళ్లి తాలూకాలో ఈ మఠం ఉంది. మఠాధిపతి  అంత్యక్రియలు నిర్వహించేందుకు వారసుడు తప్పనిసరి. దీంతో కొత్త వారసుడిగా ఎంపికైన తేజస్ చేతుల మీదుగా యతీంద్ర శివాచార్య  అంత్యక్రియలు నిర్వహించారు.

తేజస్‌ కుమార్‌ 2008, ఏప్రిల్‌ 22న జన్మించారు. ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతున్న తేజస్ మఠాధిపతిగా విధులను నిర్వహిస్తూనే  చదువును కొనసాగించనున్నారు.  మైసూరు సుత్తూరు మఠంలో తన విద్యాభ్యాసాన్ని కొనసాగించే అవకాశముంది. ఈ మఠంలో నివసించే మహేశ్, కాంతామణి దంపతుల బిడ్డ తేజస్. మఠాధిపతిగా బాధ్యతలను స్వీకరించేందుకు తేజస్ అంగీకరించినట్లు మఠం అధికారులు, కుటుంబ సభ్యులు చెప్పారు. 500 ఏళ్ళ నుంచి ఒకే కుటుంబానికి చెందినవారు ఈ మఠానికి అధిపతులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

యతీశ్వర శివాచార్య స్వామి కోవిడ్-19తో బాధపడుతుండగా తుమకూరులోని సిద్ధ గంగ ఆసుపత్రిలో  చికిత్స పొందుతున్నారు. శనివారం రాత్రి గుండెపోటు రావడంతో పరమపదించారు.

Also Read: భారత యువతలో స్వేచ్ఛాకాంక్ష‌ని ర‌గిల్చిన విప్లవ జ్యోతి భగత్ సింగ్ జయంతి నేడు.. యావత్ భారత్ నివాళులు