మరో మెడికో విద్యార్థినిపై లైంగిక దాడి.. సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యలపై దుమారం..!
పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌లోని ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం గురించి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వివాదాస్పద ప్రకటన రాజకీయ చర్చకు దారితీసింది. విద్యార్థుల భద్రత బాధ్యత ప్రైవేట్ కాలేజీలదేనని మమతా బెనర్జీ తేల్చి చెప్పారు. ఆ విద్యార్థి అర్ధరాత్రి 12:30 గంటలకు క్యాంపస్ నుండి ఎలా వెళ్లిపోయారని ప్రశ్నించారు.

పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌లోని ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం గురించి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వివాదాస్పద ప్రకటన రాజకీయ చర్చకు దారితీసింది. విద్యార్థుల భద్రత బాధ్యత ప్రైవేట్ కాలేజీలదేనని మమతా బెనర్జీ తేల్చి చెప్పారు. ఆ విద్యార్థి అర్ధరాత్రి 12:30 గంటలకు క్యాంపస్ నుండి ఎలా వెళ్లిపోయారని ప్రశ్నించారు. దీంతో బాధితురాలిపై ముఖ్యమంత్రి నిందలు వేస్తున్నారని ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ ఆరోపించింది.
ఈ సంఘటనను దిగ్భ్రాంతికరమైనదిగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభివర్ణించారు. పోలీసులు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. అయితే “ఆమె ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో చదువుతోంది. ఎవరు బాధ్యత వహిస్తారు? రాత్రి 12:30 గంటలకు ఆమె ఎలా బయటకు వెళ్ళింది?” అని సీఎం మమతా ప్రశ్నించారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీలు తమ విద్యార్థులను జాగ్రత్తగా చూసుకోవాలని, “రాత్రి సంస్కృతి”ని నియంత్రించాలని మమతా అన్నారు. “వారిని బయటకు రానివ్వకూడదు. ఇది అడవి లాంటి ప్రాంతం” అని ముఖ్యమంత్రి మమతా వ్యాఖ్యానించడం రాజకీయ దుమారానికి దారి తీసింది.
మరోవైపు బీజేపీ ఆరోపణలకు స్పందిస్తూ, పొరుగున ఉన్న ఒడిశా బీచ్‌లలో బాలికలపై అత్యాచారాలు జరిగాయి. ఒడిశా ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకుంది?” అని ఆమె ప్రశ్నించారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షిస్తామని అన్నారు. “ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరిగినా ఖండించాలి. మణిపూర్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశాలో అనేక కేసులు ఉన్నాయి. మేము కఠిన చర్యలు తీసుకుంటాము.” అని మమతా స్పష్టం చేశారు.
మమతా బెనర్జీ ప్రకటన సిగ్గుచేటు అని బీజేపీ ఎదురుదాడికి దిగింది. పార్టీ ప్రతినిధి గౌరవ్ భాటియా సోషల్ మీడియా X వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు, “ముఖ్యమంత్రి ఒక మహిళ అయినప్పటికీ, ఆమె బాధితురాలిని నిందించడం. RG కర్, సందేశ్‌ఖలి తర్వాత, ఇప్పుడు ఈ కేసు.. న్యాయం అందించడానికి బదులుగా, బాధితురాలిని అవమానిస్తున్నారు.” “రాత్రిపూట అమ్మాయిలు బయటకు వెళ్లవద్దని సలహా ఇచ్చి, వారి భద్రతను నిర్ధారించని ముఖ్యమంత్రికి పదవిలో ఉండే నైతిక హక్కు లేదు” అని ఆయన పేర్కొన్నారు.
Shameless @MamataOfficial a blot on womanhood, even more for being a CM.
After RG Kar and Sandeshkhali, now this horrific case and instead of justice, she blames the victim!
A Chief Minister who tells girls not to go out at night, rather than ensuring their safety, has no moral… pic.twitter.com/sJlq4mfQLK
— Gaurav Bhatia गौरव भाटिया 🇮🇳 (@gauravbhatiabjp) October 12, 2025
అసలేం జరిగింది..!
ఒడిశాలోని జలేశ్వర్ కు చెందిన విద్యార్థిని రెండో సంవత్సరం ఎంబీబీఎస్ చదువుతోంది. శుక్రవారం (అక్టోబర్ 10) రాత్రి, ఆమె తన స్నేహితుడితో కలిసి బయటకు వెళుతుండగా, కొంతమంది ఆమెను బలవంతంగా నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. చేశారు. బెంగాల్‌లో భద్రత కరువైందని, తన కూతురును ఒడిశాకు తీసుకెళ్తున్నట్లు బాధితురాలి తండ్రి అన్నారు. ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాంఝీ తమను సంప్రదించారని, రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయం అందిస్తోందని అయన తెలిపారు. తన కుమార్తెను ఒడిశాలోని మెడికల్ కాలేజీలో చేర్చాలనుకుంటున్నట్లు వెల్లడించారు.
ఇదిలావుంటే, ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు ముగ్గురు అనుమానితులను అరెస్టు చేశారు. అపు బౌరి (21), ఫిర్దౌస్ షేక్ (23), షేక్ రియాజుద్దీన్ (31). బాధితురాలితో పాటు ఉన్న ఆమె స్నేహితుడిని కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ పోలీసులు సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన చేశారు. “ఈ సంఘటన ఒడిశాను ఎంత బాధపెడిందో, మమ్మల్ని కూడా అంతే బాధపెడుతుంది. నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోము” అని పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




