‘మామిడి పండ్ల దౌత్యం’.. ప్రధాని మోదీకి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి మ్యాంగోస్ పంపిన బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా..ఎన్ని కేజీలంటే…??

'మామిడి పండ్ల దౌత్యం'.. ప్రధాని మోదీకి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి మ్యాంగోస్ పంపిన బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా..ఎన్ని కేజీలంటే...??
Sheikh Hasina

బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ప్రధాని మోదీకి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి 2,600 కేజీల మామిడి పండ్లను పంపారు. హరిభంగ వెరైటీకి చెందిన వీటిని రాంగ్ పూర్ రీజన్ లో 260 బాక్సుల్లో నింపారు.

Umakanth Rao

| Edited By: Phani CH

Jul 05, 2021 | 12:46 PM

బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ప్రధాని మోదీకి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి 2,600 కేజీల మామిడి పండ్లను పంపారు. హరిభంగ వెరైటీకి చెందిన వీటిని రాంగ్ పూర్ రీజన్ లో 260 బాక్సుల్లో నింపారు. భారత-బంగ్లా సరిహద్దుల్లోని బెనాపోల్ చెక్ పాయింట్ వద్ద కస్టమ్స్ అధికారులు తనిఖీ చేసి అక్కడి నుంచి కోల్ కతా లోని బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషన్ ఫస్ట్ సెక్రటరీ కార్యాలయానికి పంపారు. మహమ్మద్ సైముల్ ఖాదర్ అనే ఆయన..వీటిని ఢిల్లీలో ప్రధానికి, కోల్ కతా లో మమతకు పంపినట్టు తెలిసింది. రెండు దేశాల మధ్య సుహృద్భావ సూచనగా ఇలా మామిడి పండ్లను పంపడం ఆనవాయితీగా వస్తోంది.ఆదివారం మధ్యాహ్నం ఈ బాక్సులతో కూడిన ఫలాలు క్లియరెన్స్ అనంతరం ఉభయ దేశాల బోర్డర్స్ ని దాటాయి. ఇంకా తమ దేశ సరిహద్దుల్లోని అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం రాష్ట్రాల సీఎంలకు కూడా బంగ్లాదేశ్ ప్రధాని మామిడి పండ్లను పంపనున్నట్టు తెలిసింది.

గత ఏడాది దుర్గా పూజ (దసరా) ను పురస్కరించుకుని బంగ్లాదేశ్ నుంచి ఇండియాకు 1500 టన్నుల హిల్సా చేపలను పంపడానికి ఆ దేశ ప్రభుత్వం తమ వ్యాపారులకు అనుమతినిచ్చింది. రెండు దేశాల్లోని సరిహద్దుల్లోని వారికి ఈ చేపలతో చేసిన డిష్ చాలా ఇష్టమట.గతంలో పాకిస్తాన్ పాలకులైన జియా వుల్ హక్, పర్వేజ్ ముషార్రఫ్, మాజీ మంత్రి రెహమాన్ మాలిక్ ప్రభృతులు కూడా ఇండియాకు మామిడి పండ్లను పంపుతూ వచ్చారు. అయితే మన దేశం పాక్ కు, బంగ్లాకు ఏ ఫలాలు పంపిందో తెలియడంలేదు.

మరిన్ని ఇక్కడ చూడండి: Jr.NTR: తనయుడితో కలిసి ఎన్టీఆర్‏ను కలిసిన తెలంగాణ మంత్రి.. కారణమేంటంటే..

Selfie Death: చుట్టపు చూపుగా వచ్చి మృత్యు ఒడిలోకి.. సరదా సెల్పీ.. ఆ ముగ్గురి ప్రాణం తీసింది..!

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu