బీజేపీ-శివసేన మధ్య మళ్ళీ చిగురిస్తున్న స్నేహం..రాజకీయ కాక రేపుతున్న దేవేంద్ర ఫడ్నవిస్ వ్యాఖ్యలు

మహారాష్ట్రలో బీజేపీ-శివసేన మధ్య మళ్లీ స్నేహం చిగురిస్తున్న సూచనలు కనబడుతున్నాయి.తమ పార్టీల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ..ఇవి రెండూ శత్రువులు కావని బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ వ్యాఖ్యానించడం చూస్తే అవుననిపిస్తోంది.

బీజేపీ-శివసేన మధ్య మళ్ళీ చిగురిస్తున్న స్నేహం..రాజకీయ కాక రేపుతున్న దేవేంద్ర ఫడ్నవిస్ వ్యాఖ్యలు
Devendra Fadnavis

మహారాష్ట్రలో బీజేపీ-శివసేన మధ్య మళ్లీ స్నేహం చిగురిస్తున్న సూచనలు కనబడుతున్నాయి.తమ పార్టీల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ..ఇవి రెండూ శత్రువులు కావని బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ వ్యాఖ్యానించడం చూస్తే అవుననిపిస్తోంది. రాజకీయాల్లో ‘ఒకవేళ’..’కానీ’..వంటి పదాలు ఉండవని.. ప్రస్తుతమున్న పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు. నిన్న మీడియా సమావేశంలో మాట్లాడిన ఫడ్నవిస్..శివసేనతో కొన్ని విషయాల్లో మాకు విభేదాలు ఉండవచ్చునని..కానీ మేం శత్రువులం కాదని చెప్పారు. నాడు తమతో కలిసి ఆ పార్టీ పోటీ చేసిందని..తరువాత ఫలితాల అనంతరం కాంగ్రెస్, ఎన్సీపీలతో చేతులు కలిపిందని ఆయన అన్నారు. రానున్న రోజుల్లో బీజేపీ, శివసేన మధ్య పొత్తు ఉంటుందా అన్న ప్రశ్నకు ఆయన ఈ సమాధానమిచ్చారు.సేన నేత సంజయ్ రౌత్ ఏ బీజేపీ నేతనెవరినైనా కలిశారో లేదో తనకు తెలియదని, కానీ ఆయన ఉదయం ఒకటి మాట్లాడితే..రాత్రి మరొకటి మాట్లాడుతారని ఫడ్నవిస్ పేర్కొన్నారు.

2019 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ 105 సీట్లు గెలుచుకుని ఏకైక అతి పెద్ద పార్టీగా అవతరించగా శివసేన 56 సీట్లలో, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 స్థానాల్లో గెలుపొందాయి. బీజేపీ- సేన కూటమి పూర్తి మెజారిటీ సాధించినప్పటికీ..సీఎం పదవిపై వివాదం తలెత్తడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. ఆ తరువాత సేన, కాంగ్రెస్, ఎన్సీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే ఇటీవలి కాలంలో సీఎం ఉద్ధవ్ థాకరే ..ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీతో సమావేశమైనప్పటి నుంచీ రాష్ట్రంలో మళ్ళీ సేన-బీజేపీ మధ్య కాస్త స్నేహ భావాలు కనబడుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పాలిటిక్స్ లో ఏదైనా జరగవచ్చు అని వారు వ్యాఖ్యానిస్తున్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Festivals In Week: ఈ వారంలో ఉన్న పండుగలు ఏంటో తెలుసా.. ఆషాడం అమావాస్య ఎప్పుడంటే..

కొత్త బైక్‌ కొనుగోలు చేసేవారికి బంపర్‌ ఆఫర్‌.. రూ.5వేలు కడితే బైక్‌ సొంతం.. నో కాస్ట్‌ ఈఎంఐ

Click on your DTH Provider to Add TV9 Telugu