Selfie Death: చుట్టపు చూపుగా వచ్చి మృత్యు ఒడిలోకి.. సరదా సెల్పీ.. ఆ ముగ్గురి ప్రాణం తీసింది..!

ఆదివారం సెలవురోజు కావడంతో సరదగా గడుపుదామని పంటపొలాల వైపు వెళ్లడమే వారి పాలిట శాపమైంది. సెల్పీ మోజు ముగ్గురు విద్యార్థుల నిండు ప్రాణాన్ని బలిగొంది.

Selfie Death: చుట్టపు చూపుగా వచ్చి మృత్యు ఒడిలోకి.. సరదా సెల్పీ.. ఆ ముగ్గురి ప్రాణం తీసింది..!
Suspected Death In Nirmal
Follow us
Balaraju Goud

|

Updated on: Jul 05, 2021 | 12:43 PM

Three Girls Selfie Death in Nirmal district: సెల్పీ మోజు ముగ్గురు విద్యార్థుల నిండు ప్రాణాన్ని బలిగొంది. ఆన్‌లైన్ క్లాస్‌లతో బిజిగా ఉండాల్సిన విద్యార్థులు ఆదివారం సెలవురోజు కావడంతో సరదగా గడుపుదామని పంటపొలాల వైపు వెళ్లడమే వారి పాలిట శాపమైంది. సమీప బందువుతో కలిసి చెరువు గట్టుపై సరదాగా సెల్పీలు దిగితూ ప్రమాదవశాత్తు జారిపడ్డారు. ఎవరు గుర్తించకపోవడంతో చెరువులో మునిగి చనిపోయారు. ఈ ఘటన నిర్మల్ జిల్లా తానూర్ మండలం సింగన్‌గావ్ గ్రామంలో చోటు చేసుకుంది. చుట్టపుచూపుగా వచ్చిన బందువును‌ కూడా చెరువు మింగేయడంతో సింగన్‌గావ్ లో విషాదఛాయలు అలుముకున్నాయి.

నిర్మల్ జిల్లా తానూర్ మండలం సింగన్‌గావ్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామ శివారులో గల చెరువులో పడి ముగ్గురు బాలికలు మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. ఇందులో ఇద్దరు అమ్మాయిలు సొంత అక్కా చెల్లెలు కాగా మరొక బాలిక వారి సమీప బంధువు. ఆదివారం కావడంతో సరదగా గడిపేందుకు బందువుల ఇంటికి వచ్చిన అంజలి.. వరుసకు‌ మరదల్లు అయ్యే సునీత అలియాస్ అస్మిత, వైశాలిలతో కలిసి పంటపొలానికి వెళ్లింది. మద్యాహ్నం వరకు వైశాలీ కుటుంబానికి చెందిన పంటపొలం వద్ద ముగ్గురు సెల్పీలు దిగుతూ జాలిగా గడిపారు. ఆ తరువాత పొలం గట్టున ఉన్న చెరువు వద్దకు వెళ్లి సెల్పీలు తీసుకున్నారు. ఆ తరువాత ఏం జరిగిందో తెలియదు కానీ చెరువులో పడి ముగ్గురు చనిపోయారు.

ఇదిలావుంటే, సాయంత్రం దాటిన తరువాత కూడ ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చి ఆ ముగ్గురి కోసం కుటుంబసభ్యులు గాలింపు చేపట్టారు. పంటపొలాల్లో ఎక్కడ వారికి సంబందించిన ఆచూకి లభించలేదు. ఉదయం చెరువు‌గట్టుకు సమీపంలో ముగ్గురి చెప్పుల కనిపించడంతో అనుమానం వచ్చి చెరువు వైపు వెళ్లి చూశారు. అప్పటికే హస్మిత, వైశాలీ మృతదేహాలు నీళ్లలో తేలియాడుతూ కనిపించాయి. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి‌ చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. గజ ఈతగాళ్ల సాయంతో అంజలి మృతదేహం కోసం చెరువులో గాలింపు చర్యలు చేపట్టడంతో హస్మిత , వైశాలి చనిపోయిన ప్రదేశంలోనే చెరువు అడుగు బాగంలో అంజలి మృతదేహం లభ్యమైంది. ముగ్గురు ఒకే చోట చనిపోయి కనిపించడంతో పలు అనుమానలు వ్యక్తమయ్యాయి.

సీన్‌కట్ చేస్తే.. మద్యాహ్నం వరకు కుటుంబ సభ్యులు , చుట్టు పక్కల రైతులతో సరదగా పోటోలు దిగుతూ గడపడంతో సెల్పీ తీసుకునేందుకు వచ్చి‌చెరువులో ప్రమాదవశాత్తు పడిపోయారని పోలీసులు నిర్దారణకు వచ్చారు. కుటుంబ సభ్యులు సైతం ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయకపోవడంతో సెల్పీ డెత్ గా కేసు‌నమోదు చేసుకున్న పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు. చుట్టపు చూపుగా వచ్చి‌‌న పాపానికి అంజలి సైతం సెల్పీ బలవడం మహారాష్ట్రలోని తన సొంత గ్రామంలో విషాదాన్ని నింపింది‌. ఆన్‌లైన్ క్లాసుల కారణంగా విద్యార్థుల చేతుల్లోకి వచ్చిన సెల్‌పోన్లు బంగారు భవిష్యత్ కు బాటలు వేయాల్సింది పోయి ఇలా భవిష్యత్‌ను అర్థాతరంగా ఆపేసే కారకాలు మారాయని మృతుల కుటుంబ సభ్యులు ఆవేదన‌ వ్యక్తం చేస్తున్నారు.

—- నరేష్, టీవీ 9 ప్రతినిధి, ఆదిలాబాద్.

Read Also…. Girl Kidnaped: నిన్న కనిపించకుండాపోయిన ఆరేళ్ల చిన్నారి.. తీవ్ర గాయాలతో ప్రత్యక్షం..!