బెంగళూరులో భారీ పేలుడు.. ముగ్గురు సజీవ దహనం.. ఘటనపై పలు అనుమానాలు.!
కర్ణాటక రాజధాని బెంగళూరులో ఘోర విషాదం చోటు చేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించి ముగ్గురు సజీవ దహనమయ్యారు.
కర్ణాటక రాజధాని బెంగళూరులో విషాదం చోటు చేసుకుంది. చామరాజపేట్ రాయల్ సర్కిల్ పరిధిలోని బాణసంచా పేలిన ఘటనలో ముగ్గురు సజీవ దహనం అయ్యారు. ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు దగ్గరలోని విక్టోరియా హాస్పిటల్‌కు స్థానికులు తరలించారు. ఓ గౌడౌన్‌లో బాణసంచాను తరలిస్తుండగా.. ఈ పేలుడు సంభవించిందని అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు తెలియజేశారు. సుమారు మధ్యాహ్నం 12.10 గంటల సమయంలో ఈ పేలుడు జరిగిందని సమాచారం. ఎక్కువగా రద్దీ ఉండే ప్రదేశంలో ఈ పేలుడు జరగడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.
ఇదిలా ఉంటే.. పేలుడు తీవ్రతకు డెడ్‌బాడీస్ 100 మీటర్ల దూరానికి ఎగిరి పడటమే కాకుండా.. అక్కడున్న వాహనాలు కూడా ధ్వంసం అయ్యాయి. సమాచారం తెలియగానే చామరాజుపేట్ పోలీసులు, వెస్ట్ జోన్ డిప్యూటీ కమిషనర్ సంజీవ్ పటేల్ ఘటనాస్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: ఈ ఫోటోలోని జింకను కనిపెట్టండి.. మీ మెదడుకు మేత వేయండి.. ఈజీగా కనిపెట్టొచ్చు..
గాల్లో ఢీకొన్న రెండు విమానాలు.. దూకేసిన ప్రయాణీకులు.. చివరికి ఏం జరిగిందంటే.!
గజరాజుకు కోపమొస్తే ఇంతేనేమో.. అడవి దున్నను కుమ్మేసిందిగా.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారంతే.!