రూ. 21వేల కోట్ల డ్రగ్స్ పట్టుబడ్డ కేసులో రంగంలోకి దిగిన ఈడీ.. గుజరాత్‌లోని పోర్టు సెంట్రిక్‌గా సంచలన విషయాలు

గుజరాత్‌లోని పోర్టులో భారీగా పట్టుబడిన డ్రగ్స్‌ కేసులో ఈడీ రంగంలోకి దిగింది. డ్రగ్స్‌ దందా వెనుక ఎవరున్నారు ? సూత్రధారులు ఎవరు ?

రూ. 21వేల కోట్ల డ్రగ్స్ పట్టుబడ్డ కేసులో రంగంలోకి దిగిన ఈడీ.. గుజరాత్‌లోని పోర్టు సెంట్రిక్‌గా సంచలన విషయాలు
Mudra Port
Follow us
Venkata Narayana

|

Updated on: Sep 23, 2021 | 1:11 PM

Gujarat’s Mundra port case: గుజరాత్‌లోని పోర్టులో భారీగా పట్టుబడిన డ్రగ్స్‌ కేసులో ఈడీ రంగంలోకి దిగింది. డ్రగ్స్‌ దందా వెనుక ఎవరున్నారు ? సూత్రధారులు ఎవరు ? పాత్రధారులు ఎవరు ? అనేది తేల్చే పనిలో పడింది. ఈనెల 13న గుజరాత్‌ ముంద్రా పోర్టులో రెండు కంటైనర్లలో డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకున్నారు డీఆర్‌ఐ అధికారులు. 2,988 కేజీల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అఫ్గనిస్తాన్‌ నుంచి ఇరాన్‌ మీదుగా భారత్‌కు డ్రగ్స్ తరలించినట్టు అధికారులు గుర్తించారు.

టాల్క్‌స్టోన్స్‌, టాల్కం పౌడర్‌గా పేర్కొంటూ డ్రగ్స్‌ని భారత్‌కు రవాణా చేశారు. అయితే డీఆర్‌ఐ విచారణలో నార్కోటిక్‌ డ్రగ్‌ హెరాయిన్‌గా నిర్థారించారు. భారీ ఎత్తన డ్రగ్స్‌ పట్టుబడటంతో ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఆపరేషన్‌ చేపట్టింది డీఆర్‌ఐ. న్యూఢిల్లీ, నోయిడా, చెన్నై, కోయంబత్తూరు, అహ్మదాబాద్‌, మాండ్వి, గాంధీధామ్‌, విజయవాడ ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఢిల్లీలో 16.1 కేజీల హెరాయిన్‌, నోయిడాలోని నివాస ప్రాంతాల్లో 10.2 కేజీల కొకైన్‌, 11 కేజీల హెరాయిన్‌ స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసులో నలుగురు అఫ్గనిస్తాన్‌ దేశస్తులు, ఒక ఉబ్జెకిస్తా్‌న్‌ దేశస్తుడితో పాటు మొత్తం 8 మందిని అరెస్ట్‌ చేశారు డీఆర్‌ఐ అధికారులు. అరెస్టయిన ముగ్గురు భారతీయుల్లో ఒకరికి ఇంపోర్ట్‌, ఎక్స్‌పోర్ట్‌ లైసెన్స్‌ ఉన్నట్టు తెలుస్తోంది. ఆషి ట్రేడింగ్‌ కంపెనీ యాజమాన్యం డీఆర్‌ఐ కస్టడీలో ఉన్నారు. చెన్నైలో ఎం సుధాకర్‌, జి దుర్గాపూర్ణ, వైశాలిని అరెస్ట్‌ చేశారు. వీరిని గుజరాత్‌లోని భుజ్‌ కోర్టులో హాజరు పరిచారు. వీరిని 10 రోజుల పాటు డీఆర్‌ఐ కస్టడీకి అంగీకరించింది న్యాయస్థానం. తాజాగా ఈ కేసులో మనీ లాండరింగ్‌ కోణంలో ఈడీ దర్యాప్తు చేపట్టింది.

Read also:  Cantonment: కంటోన్మెంట్‌ను ఎందుకు జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలని కోరుతున్నారు? కారణాలేంటి?