Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cantonment: కంటోన్మెంట్‌ను ఎందుకు జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలని కోరుతున్నారు? కారణాలేంటి?

వారంతా హైదరాబాద్ నడిబొడ్డునే ఉంటారు. కానీ, స్టేట్ గవర్నమెంట్‌తో వాళ్లకసలు సంబంధమే ఉండదు. వాళ్లదంతా సెపరేట్ పాలన.

Cantonment: కంటోన్మెంట్‌ను ఎందుకు జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలని కోరుతున్నారు? కారణాలేంటి?
Contonment
Follow us
Venkata Narayana

|

Updated on: Sep 23, 2021 | 1:38 PM

Secunderabad Cantonment area: వారంతా హైదరాబాద్ నడిబొడ్డునే ఉంటారు. కానీ, స్టేట్ గవర్నమెంట్‌తో వాళ్లకసలు సంబంధమే ఉండదు. వాళ్లదంతా సెపరేట్ పాలన. ఇదేదో ప్రత్యేక రాజ్యమో లేక రాష్ట్రమో అనుకోకండి. ఇది మన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియానే. మరి, హైదరాబాద్ నడిబొడ్డున ఉండే కంటోన్మెంట్ ఎందుకు రాష్ట్ర పరిధిలో లేదు? అసలా కథేంటి.. హైదరాబాద్ నగర పాలన మొత్తం జీహెచ్‌ఎంసీ కింద సాగుతుంది. పన్నుల వసూళ్లు అయినా, పర్మిషన్స్ అయినా జీహెచ్ఎంసీ ద్వారానే జరుగుతాయ్. కానీ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రజలపై మాత్రం అధికారముండదు. ఆ లెక్కకొస్తే… స్టేట్ గవర్నమెంట్‌కి కూడా సికింద్రాబాద్ కంటోన్మెంట్‌పై అధికారం లేదు.

జీహెచ్‌ఎంసీ ఆధీనంలో లేరు? రాష్ట్ర ప్రభుత్వ అధికారం కింద లేరు? మరి, వీళ్లను పాలిస్తోంది ఎవరు? ఎందుకు వీళ్లు ప్రత్యేక పాలన కింద ఉన్నారు. ఇక్కడి ప్రజలు ఏం కోరుకుంటున్నారు? కేటీఆర్ ట్వీట్‌తో ఈ కంటోన్మెంట్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. అయితే, కేటీఆర్ ట్వీట్ వెనుక పెద్ద కథే ఉంది. కంటోన్మెంట్ జోన్ కేంద్ర రక్షణశాఖ పరిధిలో ఉంటుంది. ఇదే ఇక్కడి ప్రజలకు శాపంగా మారింది.

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రజలైతేమాత్రం.. మాకీ ప్రత్యేక పాలన వద్దు. జీహెచ్‌ఎంసీలో విలీనం చేయండంటూ వేడుకుంటున్నారు. విలీనమే అన్ని సమస్యలకు పరిష్కారమంటున్నారు. కేంద్రం నుంచి నిధులు వస్తేనే సికింద్రాబాద్ కంటోన్మెంట్లో అభివృద్ధి పనులు జరుగుతాయి. కానీ, సెంట్రల్ నుంచి గ్రాంట్స్ రావడం లేదంటున్నారు బోర్డు మాజీ సభ్యుడు.

కంటోన్మెంట్‌ను ఎందుకు జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలని ప్రజలు కోరుతున్నారు? కారణాలేంటి? ప్రజలు ఏమంటున్నారు అన్న విషయానికొస్తే, సికింద్రాబాద్ కంటోన్మెంట్ జోన్ విస్తీర్ణం 9వేల 926 ఎకరాలు. అందులో 6వేల ఎకరాలు పూర్తిగా ఆర్మీ ఆధీనంలో ఉంది. 500 ఎకరాలు రైల్వే, ఎవియేషన్ చేతిలో ఉన్నాయి. 700 ఎకరాల్లో బైసన్ పోలో, జింఖానా గ్రౌండ్స్ ఉన్నాయి. మిగిలిన 2వేల 800 ఎకరాల్లో 350 బస్తీలు, కాలనీలు ఉన్నాయి.

అసలు, ఈ కంటోన్మెంట్ జోన్ అంటే ఏంటి? ఎందుకు ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాం. కంటోన్మెంట్ అంటే మిలటరీ స్థావరం. బ్రిటీష్ హయాంలో మిలటరీ అవసరాల కోసం దేశవ్యాప్తంగా ఈ కంటోన్మెంట్స్ జోన్స్‌ను ఏర్పాటు చేశారు. కంటోన్మెంట్ జోన్‌ను జీహెచ్‌ఎంసీలో విలీనం చేసేందుకు 1999లో అడుగులు పడ్డాయ్. అప్పటి రక్షణశాఖ మంత్రి జార్జ్‌ ఫెర్నాండెజ్ విలీన ప్రక్రియకు ఆదేశించారు. అయితే, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది.

2018లో ఇలాంటి ప్రతిపాదనే మరొకటి తెరపైకి వచ్చింది. రక్షణశాఖ వినియోగిస్తున్న ప్రాంతాన్ని మినహాయించి, కాలనీలను, బస్తీలను విలీనం చేసేందుకు కేంద్రం ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ రిపోర్ట్ రావాల్సి ఉంది. దేశవ్యాప్తంగా ఇలాంటి కంటోన్మెంట్ బోర్డులు 62 ఉన్నాయి. ప్రతి చోటా ఇవే సమస్యలు. అందుకే, కంటోన్మెంట్ జోన్స్‌లో కొత్త చట్టం తేవాలని కేంద్రం భావిస్తోంది. కమిటీ నివేదిక రాగానే, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తుల మేరకు జనావాస ప్రాంతాలను విలీనం చేసే అవకాశం కనిపిస్తోంది.

Read also: Airports: వేల కోట్ల నష్టాలతో ఎయిర్ పోర్ట్స్ అథారిటీ తెరపైకి తెచ్చిన ఫార్ములా.. కేంద్రం దారెటు.?