Ratnam Ball Pen: గాంధీ పిలుపుతో స్వదేశంలో తయారై.. విదేశాల్లో సైతం ఖ్యాతిగాంచిన రత్నం పెన్స్ గురించి మీకు తెలుసా..

Ratnam Ball Pen History: ఇప్పుడంటే బాల్ పెన్స్, రెనాల్డ్ పెన్స్ వంటి అనేక రకాలు మనదేశంలో వాడుకలో వచ్చాయి కానీ.. ఒకప్పుడు రత్నం పెన్నులు.. మన దేశంలో తయారైన మొట్ట మొదటి స్వదేశీ..

Ratnam Ball Pen: గాంధీ పిలుపుతో స్వదేశంలో తయారై.. విదేశాల్లో సైతం ఖ్యాతిగాంచిన రత్నం పెన్స్ గురించి మీకు తెలుసా..
Ratnam Pens
Follow us

|

Updated on: Sep 23, 2021 | 12:03 PM

Ratnam Ball Pen History: ఇప్పుడంటే బాల్ పెన్స్, రెనాల్డ్ పెన్స్ వంటి అనేక రకాలు మనదేశంలో వాడుకలో వచ్చాయి కానీ.. ఒకప్పుడు రత్నం పెన్నులు.. మన దేశంలో తయారైన మొట్ట మొదటి స్వదేశీ పెన్ను.. దేశ విదేశాల్లో ఖ్యాతి గాంచింది. స్వాతంత్య కోసం చేసిన ఉద్యమ సమయంలో విదేశీ వస్తు బహిష్కరణ, స్వదేశీ తయారీ లో భాగంగా తయారు చేసిన పెన్నులు రత్నం పెన్నులు. ఈ పెన్నుల తయారీ ద్వారా తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిని ప్రపంచం నలుమూలలా వ్యాప్తి చెందేలా చేసిన రత్నం పెన్స్ అధినేత  కే. వీ. రమణ మూర్తి  రెండు రోజుల క్రితం స్వర్గస్తులయ్యారు. వారికీ నివాళులర్పిస్తూ.. ఒక్కసారి రత్నం పెన్స్ గురించి అందరం తెలుసుకుందాం.

మహాత్మా గాంధీ స్వాతంత్ర ఉద్యమ పర్యటనల్లో భాగంగా ఓసారి తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు వస్తున్నారు. అప్పుడు గాంధీజీ రాజమండ్రి గోదావరి రైల్వే స్టేషన్లో ఆగారు. అప్పుడు గాంధీజీని కలిసిన రత్నం పెన్నుల సంస్థ యజమాని కేవీ రత్నం తాను తయారు చేసిన పెన్నును బహుమతిగా ఇచ్చారు. అప్పుడు తాను 1921లో మిమ్మల్ని కలిసినప్పుడు స్వదేశీ వస్తువు ఏదైనా చేయమని చెప్పిన మాటలే స్ఫూర్తి.. అందుకనే ఈ పెన్నుని తయారు చేశానని రత్నం చెప్పారు. అయితే ఆ పెన్ను పనితనాన్ని చూసి గాంధీ విదేశం నుంచి దిగుమతి అయింది అనుమానించారు. తన సహాయకుడిని కుమారప్ప ని పెన్ను తయారు విధాన్ని పరిశీలన చేయాల్సిందిగా ఆదేశించారు. పెన్నుని కుమారప్ప స్వయంగా పరిశీలించి.. పూర్తి స్వదేశీ తయారీ అని నిర్థరించిన తర్వాత గాంధీ దాన్ని తీసుకున్నారు. ఇక తర్వాత గాంధీజీ మీరు పంపిన పెన్ను వాడుతున్నాను, ఆనందంగా ఉంది” అంటూ 1935లో కేవీ రత్నానికి గాంధీ స్వయంగా లేఖ రాశారు.

అలా మొదలైన రత్నం పెన్ను స్వదేశీ కలాల తయారీలో కలికితురాయిగా మారింది. కె.వి రమణ మూర్తి చిన్నతనం నుండి తండ్రి వద్దనే కలం తయారీలో మెళకువలు అభ్యసిస్తూ 1981లో తండ్రి మరణించిన తర్వాత వారి మీద వున్న వాత్సల్యంతో .. సంస్థ మీద అలాగే స్వదేశీ వస్తువుల తయారీ మీద ఉన్న మమకారంతో ఇదే వృత్తిని కొనసాగిస్తూ జీవనోపాధిని పొందుతూ వచ్చారు. నిజానికి రత్నం 1932లోనే పెన్నుల తయారీని ప్రారంభించినా.. గాంధీజీ లేఖ రాసిన నాటి నుంచి రత్నం పెన్ను అంటే స్వదేశీ పెన్నుగా పేరు ప్రఖ్యాతులు గాంచింది. ఇప్పటికీ గాంధీజీ రాసిన లేఖను అక్కడ చూడవచ్చు

బహుళ ప్రాచుర్యం పొందిన రత్నం కలాలను విదేశాలకు ఎగుమతి చేయడమే కాక పలు సంస్థల నుంచి ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. పెన్నుల తయారీ కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన రబ్బరు వాడుతుంటారు.  అయితే వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా వెండి, బంగారం పెన్నులు కూడా తయారు చేస్తున్నారు. 14 క్యారెట్, 24 క్యారెట్ బంగారం పెన్నులు కూడా రత్నం సంస్థ తయారు చేస్తుంది. అప్పట్లో గాంధీకి అందించిన పెన్ను కూడా 14 క్యారెట్ల బంగారం పాళీతో చేసిందే. ఎందుకంటే పాళీ తయారీలో 24 క్యారెట్ బంగారం కన్నా 14 క్యారెట్ల బంగారమే సౌకర్యవంతంగా ఉంటుందని.. అందుకే ఎక్కువ మంది 14 క్యారెట్ల బంగారంతో తయారయిన వాటికే ప్రాధాన్యమిస్తారు. రత్నం తయారు చేసిన 1.5 గ్రాముల బరువుండే అతి చిన్న పెన్, అతి చిన్న బంగారం పెన్నులు చూస్తే ఆశ్చర్యం కలగకమానదు.

రత్నం పెన్నుల్లో ఎన్నో రకాలున్నాయి. ఖరీదు కూడా దానికి తగ్గట్టుగానే ఉంటుంది. 300 రూపాయల నుంచి 2.5 లక్షల రూపాయల ఖరీదు చేసే పెన్నులను వీరు తయారు చేస్తున్నారు. అందులో ‘సుప్రీం’ అనే మోడల్ కేవలం రాష్ట్రపతి, ప్రధాన మంత్రి వంటి వారి కోసం తయారుచేస్తున్నారు. రత్నం పెన్నులతో రాయడం అలవాటైతే వేరే పెన్నులు వాడాలని అనిపించదంటారు. అందుకనే రాజమండ్రిలో ఓ చిన్న సందులో ఉండే రత్నం షాపు కి పెన్నుల కోసం ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు.

భారత తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ నుంచి ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వరకూ ప్రమాణస్వీకార పత్రాలపై రత్నం పెన్నులతో సంతకాలు చేశారని రత్నం సంస్థ యజమానులు సగర్వంగా చెబుతారు. అంతేకాదు.. అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు నుంచి ప్రస్తుత ప్రధాని మోడీ రత్నం పెన్నులను వాడినట్టు.. కొన్ని మోడల్ పెన్నులు వారికోసమే సిద్ధం చేస్తామని చెప్పారు.  ఇక జవహర్ లాల్ నెహ్రూ స్వయంగా రాజమండ్రిలోని కేవీ రత్నం పెన్స్ తయారీకేంద్రాన్ని సందర్శించారు. ఇక నెహ్రూ వాడిన రత్నం పెన్ నేటికీ అలహాబాద్లోని స్వగృహంలో చూడవచ్చు. మనదేశంలోని ప్రముఖులే కాదు.. అమెరికా, రష్యా దేశాల అధ్యక్షులకు సైతం రత్నం పెన్నులు ఉపయోగిస్తారు.. ఈ విషయాన్నీ గోపాల రత్నం , కేవీ రత్నం సోదరుడు రమణమూర్తి గర్వంగా చెబుతున్నారు. ఇక కే. వీ. రమణ మూర్తికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు.  కొసమెరుపు ఏమిటంటే.. మనవారి ప్రతిభను మనం గుర్తించం.. గుర్తు పెట్టుకోము అనడానికి గుర్తుగా ” మీలో ఎవరు కోటీశ్వరుడు: షోలో ఒకసారి 25 లక్షల ప్రశ్న కింద.. మన దేశంలో మొట్ట మొదటి స్వదేశీ పెన్ను ఎక్కడ తయారయ్యింది.. అనే ప్రశ్నకు జవాబు రాజమండ్రి అని చెప్పలేక ఒకతను క్విజ్ లో ఓడిపోవడం కొస మెరపు.

Also Read: Health Tips: భోజనం తర్వాత ఈ పనులు చేయొద్దని పెద్దలు పెట్టిన నియమాల వెనుక ఆరోగ్య రహస్యాలు ఏమిటో తెలుసా..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో