Health Tips: భోజనం తర్వాత ఈ పనులు చేయొద్దని పెద్దలు పెట్టిన నియమాల వెనుక ఆరోగ్య రహస్యాలు ఏమిటో తెలుసా..
Health Tips: మన పూర్వికులు సంప్రదయం.. ఆచారాల పేరుతో కొన్ని నియమాలు ఏర్పరిచారు. పెద్దవాళ్ళు బయట నుంచి ఇంట్లోకి వచ్చే ముందు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కుని.. బట్టలు మార్చుకుని..
Health Tips: మన పూర్వికులు సంప్రదయం.. ఆచారాల పేరుతో కొన్ని నియమాలు ఏర్పరిచారు. పెద్దవాళ్ళు బయట నుంచి ఇంట్లోకి వచ్చే ముందు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కుని.. బట్టలు మార్చుకుని ఇంట్లోకి రమ్మని చెప్పేవారు.. అంతేకాదు.. భోజనం చేసిన తర్వాత స్నానం చేయకూడదు.. గడపకు రోజు పసుపు రాయాలి.. ఇలా అనేక విషయాలను సంప్రదయం పేరుతో చెప్పినా చేయమన్నా .. అదంతా చాదస్తం, మూఢనమ్మకాలు అంటూ కొట్టిపడేస్తున్నారు. అయితే కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత కొన్ని పద్ధతుల్లో మార్పులు వచ్చాయి. మన పెద్దలు చెప్పినవి చాదస్తంగా కొట్టిపడేసిన పద్దతులను, ఆహారపు అలవాట్లను పాటిస్తున్నారు కూడా. అయితే ఈరోజు మన ఇంట్లో అమ్మమ్మ, తాతయ్యలు ఉంటె.. భోజనము చేసిన తర్వాత ఇవేమి పనులుగా.. ఇవి చేయకూడదు.. మంచి కాదు అంటూ.. ముద్దుగా కాసురుకొనేవారు.. అయితే వారు చెప్పినవి చాదస్తంగా కొట్టిపడే కొంతమంది నేటి జనరేషన్ కోసం.. పెద్దలు ఏర్పరచిన నియమాలు ఆరోగ్యం కోసం ఏర్పరచినవే.. ఈరోజు భోజనం తర్వాత చేయకూడని పనుల గురించి తెలుసుకుందాం..
*కొంతమంది భోజనం చేసిన తర్వాత స్నానం చేస్తారు. అయితే ఈ అలవాటు ఆరోగ్యానికి మంచిదికాదు. భోజనం చేసినవెంటనే స్నానం చేస్తే రక్తం అంతా చేతులకి కళ్ళకి మొత్తం ఒంటికి పాకుతుంది. దీంతో పొట్ట దగ్గర రక్తం తగ్గిపోయి జీర్ణప్రక్రియని నెమ్మదిస్తుంది. దీంతో జీర్ణ వ్యవస్థ సామర్ధ్యం తగ్గిపోతుంది. * ఇక కొంతమంది భోజనం చేసిన వెంటనే టీ తాగుతారు. ఇది కూడా మంచి అలవాటు కాదు.. ఎందుకంటే ఎందుకంటే టీ వలన ఆసిడ్ విడుదలవుతాయి. దీంతో ఆహరం జీర్ణం అవ్వడం కష్టం అవుతుంది. * భోజనం తర్వాత సిగరెట్ తాగేవారికి కాన్సెర్ వచ్చే అవకాశాలు ఎక్కువని వైద్యులు హెచ్చరిస్తున్నారు. * కొంతమంది భోజనం చేసిన వెంటనే పళ్ళు తింటారు.. ఇది కూడా ఆరోగ్యానికి మంచిది కాదు.. అందుకని పళ్ళు తినాలనుకునేవారు భోజనానికి రెండు గంటలు ముందు కానీ తరువాతగాని తింటే మంచిది. *భోజనం చేసిన వెంటనే కొంతమంది మంచం ఎక్కేస్తారు. ఇలా నిద్రపోయే అలవాటు ఉన్నారు.. అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందట. భోజనం చేసిన వెంటనే నిద్రపోతే ఆహరం సరిగ్గా జీర్ణం కాదు. దీంతో గ్యాస్ ప్రాబ్లంతో పాటు ఇతర సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ.
కనుక భోజనం చేసిన తర్వాత ఈ నియమాలను గుర్తుపెట్టుకుని పాటించండి.. ఆరోగ్యంగా జీవించండి..
Also Read: Mushrooms: సంప్రదాయవైద్యంలో చైనా, జపాన్‌లో ఇప్పటికీ పుట్ట గొడుగులది అగ్రస్థానమే.. మష్రూమ్స్‌తో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో..