Ginger-Garlic Tea: రోగనిరోధక శక్తిని పెంచే ‘అల్లం వెల్లుల్లి టీ’తో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో..
Ginger-Garlic Tea: ప్రపంచంలో ప్రజల జీవితాలను.. కరోనాకి ముందు.. తర్వాత అని చెప్పుకోలేమో.. అవును కరోనా వైరస్ వెలుగులోకి వచ్చి.. ప్రపంచ దేశాల్లో సృష్టించిన కల్లోలంతో మనిషి జీవితంలో..
Ginger-Garlic Tea: ప్రపంచంలో ప్రజల జీవితాలను.. కరోనాకి ముందు.. తర్వాత అని చెప్పుకోలేమో.. అవును కరోనా వైరస్ వెలుగులోకి వచ్చి.. ప్రపంచ దేశాల్లో సృష్టించిన కల్లోలంతో మనిషి జీవితంలో అనేక మార్పులు వచ్చాయి. వాటిల్లో ముఖ్యంగా ఆహారం నియమాలను మార్పు చేసుకున్నాడు. కరోనాకి ముందు.. రోగనిరోధక శక్తికి కానీ.. అందుకు అవసరమైన ఫుడ్ కానీ తినడానికి పెద్దగా ప్రిఫరెన్స్ ఇవ్వని వారు సైతం.. ఇప్పుడు తప్పనిసరిగా ఇమ్యూనిటీని పెంచే ఆహారం తీసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. డ్రైఫ్రూట్స్, అల్లం , వెల్లుల్లి, పసుపు వంటి అనేకవాటిని రోజువారీ ఆహారంగా చేసుకున్నాడు. ఎందుకంటే కోవిడ్ మహమ్మారి.. రోగనిరోధక శక్తి ఉన్నవారి దరిచేరదని ఆరోగ్య నిపుణుల హెచ్చరికతో తినే ఆహారానికి కూడా అత్యంత ప్రధాన్యతను ఇస్తున్నాడు. రోజుకో రకమైన వేరియంట్ గా మారుతూ.. మనిషి జీవితాన్ని ప్రభవిసతం చేస్తున్న కరోనాకు చెక్ పెట్టడానికి.. ప్రతి ఒక్కరూ రోగనిరోధక శక్తిని పెంచుకోవాల్సిందే.. అందుకు ప్రతి ఒక్కరూ తినే ఆహారంలో అనేక ఆరోగ్యకరమైన, వైద్యపరమైన పదార్థాలను జోడించాలి. ఈరోజు రోగనిరోధక వ్యవస్థ కోసం పెంచే సామర్థ్యం గల “టీ” తయారీ.. ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..
అల్లం, వెల్లుల్లి టీ తయారీ:
ఒక గిన్నె లో నీరు వేసి మరిగించాలి. వెల్లుల్లి, తురిమిన అల్లం జోడించండి. తక్కువ వేడి మీద బాగా మరిగించండి. ఇలా మరిగిన నీటిలో కొంచెం నిమ్మరసం, తేనె జోడించండి. మీరు తాగగలిగిన వేడితో ఈ అల్లం, వెల్లుల్లిని టి ని తాగండి.
ఆరోగ్య ప్రయోజనాలు:
అల్లం, వెల్లుల్లి టీ ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రోజూ ఒక కప్పు అల్లం-వెల్లుల్లి టీ తాగడం వల్ల రోగనిరోథక శక్తి పెరుగుతుంది. అందుకనే టీ అలవాటు ఉన్నవారు ఉదయం సమయంలో అల్లం-వెల్లుల్లి టీ తాగడానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నారు. ఈ టీని ఉదయం అల్ఫాహారానికి ముందు తాగవచ్చు. అల్లం . వెల్లుల్లి శ్వాస సంబంధిత సమస్యలను నివారిస్తుంది. మహిళలు రుతుస్రావం నొప్పితో బాధపడుతుంటే మంచి ఉపశమనం కలిగిస్తుంది. యాంటీఆక్సిడెంట్‌లతో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది. బరువుని తగ్గిస్తుంది. అల్లం-వెల్లుల్లి టీ తాగడం వల్ల మీ జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. గొంతు నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. అల్లంలో అస్థిర నూనెలు ఉన్నాయి. అవి శరీరం యొక్క రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి ఉత్తమంగా పనిచేస్తాయి. ఇక వెల్లుల్లిలో సల్ఫర్ అధికంగా ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది.
Also Read: Ratnam Ball Pen: గాంధీ పిలుపుతో స్వదేశంలో తయారై.. విదేశాల్లో సైతం ఖ్యాతిగాంచిన రత్నం పెన్స్ గురించి మీకు తెలుసా..