Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mushrooms: సంప్రదాయవైద్యంలో చైనా, జపాన్‌లో ఇప్పటికీ పుట్ట గొడుగులది అగ్రస్థానమే.. మష్రూమ్స్‌తో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో..

Mushrooms Benefits:  సృష్టిలోని వింతమొక్కల్లో ఒకటి  పుట్టగొడుగు. వీటిని ఇంగ్లీషులో మష్రూమ్స్  అంటారు. ఇవి ఎక్కువగా పుట్టలపై గొడుగు ఆకారంలో పెరుగుతాయి. అందువలన వీటిని పుట్ట..

Mushrooms: సంప్రదాయవైద్యంలో చైనా, జపాన్‌లో ఇప్పటికీ పుట్ట గొడుగులది అగ్రస్థానమే.. మష్రూమ్స్‌తో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో..
Mushroom
Follow us
Surya Kala

|

Updated on: Sep 23, 2021 | 10:02 AM

Mushrooms Benefits:  సృష్టిలోని వింతమొక్కల్లో ఒకటి  పుట్టగొడుగు. వీటిని ఇంగ్లీషులో మష్రూమ్స్  అంటారు. ఇవి ఎక్కువగా పుట్టలపై గొడుగు ఆకారంలో పెరుగుతాయి. అందువలన వీటిని పుట్ట గొడుగులు అంటారు. ఈ పుట్ట గొడుగుల్లో అనేక రకాలు ఉన్నాయి. ఇవి విత్తనాలు లేని మొక్క జాతికి సంబంధించినవి. అయితే వీటిలో ఉన్న పోషక పదార్ధాలు, ఔషదగుణాలు లభ్యతను బట్టి ప్రత్యేక వాతావరణంలో పెంచుతున్నారు . అందరూ తినగల కూర ఆహారము . ఇవి మాంసాహారముతో సమానము . ఆహారప్రియులకు వర్షాకాలము స్పెషల్ పుట్టగొడుగులు . ఆర్టిఫీషయల్ గా సాగయ్యేవి, డ్రైమష్రూమ్‌స్ ఏడాది పొడుగునా లభించినప్పటికీ సహజం గావచ్చే పుట్టగొడుగుల కోసం మాత్రము ముసురు వానలు కురవాల్సిందే . వానాకాలములో పుట్టలమీద మొలిచే ఈ గొడుగులు రుచిలో సాటిలేనివి

అయితే ఇవి ఆరోగ్యానికి మంచిదేనా? అనే సందేహాలు గతంలో ఉన్నాయి. ఇదే విషయంపై  అనేక సంవత్సరాలు ఎన్నో వైద్య పరిశోధనలు జరిగాయి. ఎన్నో పోషక విలువలు కలిగి క్రొవ్వు మరియు పిండి పద్ధారం తక్కువగా ఉండటం, ముఖ్యంగా మాంనసకృత్తులు అధికంగా ఉండటం వలన పోషక లోపముతో బాధపడుతున్న మహిళలకు, చిన్న పిల్లలకు ముఖ్యంగా మధుమేహం వ్యాధిగ్రస్తులకు ఇదొక ప్రత్యామ్న ఆహారంగా సూచిస్తున్నారు. ఇందులోని పొటాషియం పక్షవాతాన్ని నివారిస్తుందట.  వయస్సు-సంబంధిత  న్యూరోడెజెనరేషన్‌కు వ్యతిరేకంగా కొన్ని రకాల పుట్టగొడుగులు ప్రభావవంతంగా పనిచేస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి.  చైనా, జపాన్ లాంటి దేశాలలో ఇప్పటికీ వారి సంప్రదాయ వైద్యంలో పుట్టగొడుగులది అగ్ర స్థానమే.

క్యాన్సర్ నివారణకు: 

ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణాలలో క్యాన్సర్ ఒకటి. కెమోథెరపీ మరియు రేడియేషన్ వంటి క్యాన్సర్ చికిత్సలు ప్రస్తుతం కొనసాగుతున్న అలాగే దీర్ఘకాలిక దుష్ప్రభావాలను కలిగిస్తాయి. అనేక అధ్యయనాలు పుట్టగొడుగులోని యాంటిక్యాన్సర్ లక్షణాలను సూచిస్తాయి. వివిధ రకాల పుట్టగొడుగులు క్యాన్సర్ వ్యాధిపై ప్రభావవంతంగా పని చేస్తాయని మెడికల్ జర్నలిజంలో పేర్కొంది. ప్లూరోటస్ జాతికి చెందిన పుట్టగొడుగు సారాలు పెద్దప్రేగు క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పనిలో చేస్తాయి. అగారికస్ అనే పుట్టగొడుగు రొమ్ము క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పనిచేస్తుంది.

ఊబకాయ నివారణకు: 

పుట్టగొడుగుల్లో  ఉండే ఎరిటాడెనిన్ , బీటా-గ్లూకాన్లు హైపోలిపిడెమిక్ లక్షణాలు ఊబకాయాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. అంతేకాక బీటా-గ్లూకాన్లు కడుపు నిండిన భావనను కలిగించి తక్కువ తినేలా చేస్తాయి. అలాగే ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతాయి.

పుట్టగొడుగుల్లో అనేక ఖనిజాలు, విటమిన్లు, బీటా-గ్లూకాన్ వంటి పోలిసకరైడ్లు ఉన్నందున పుట్టగొడుగులు మంచి పోషకాహారం. ఇవి బరువు తగ్గడానికి సహాయపడతాయి, ఆక్సీకరణ నష్టాన్ని నివారిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి

ఎముకల వ్యాధి నివారణకు: బోలు ఎముకల వ్యాధి వంటి ఎముక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో పుట్టగొడుగులు సహాయపడతాయి.

అయితే అన్నిరకాల పుట్టగొడుగులు ఆహారంగా తీసుకోకూడదు.  వీటిని తినే సమయంలో జాగ్రత్త వహించాలి. కొందరి శరీర తత్వానికి పుట్టగొడుగులు సరిపడవు.. ఇంకా కొన్ని   అడవి రకాల పుట్టగొడుగులు విషపూరితమైనవి. మరికొన్ని రకాల పుట్టగొడుగులు అలెర్జీకి కారణమవుతాయి. కనుక పుట్టగొడుగులను ఆహారంగా తీసుకునే ముందు.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

Also Read:

Ruby Roman Grapes: ప్రపంచ ప్రసిద్ధి చెందిన అత్యంత విలాసవంతమైన, ఖరీదైన ద్రాక్ష.. ఒక గుత్తి ధర వేలల్లో.. ఎక్కంటే..