Bandaru Dattatreya: హర్యానా 18వ గవర్నర్‌గా బండారు దత్తాత్రేయ ప్రమాణ స్వీకారం.. వీడియో
Haryana Governor Bandaru Dattatreya: హర్యానా 18వ గవర్నర్‌గా బండారు దత్తాత్రేయ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి.. దత్తాత్రేయతో ప్రమాణం చేయించారు. కాగా హిమాచల్ ప్రదేశ్
Haryana Governor Bandaru Dattatreya: హర్యానా 18వ గవర్నర్‌గా బండారు దత్తాత్రేయ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి.. దత్తాత్రేయతో ప్రమాణం చేయించారు. కాగా హిమాచల్ ప్రదేశ్ నుంచి హర్యానా గవర్నర్‌గా ఉన్న దత్తాత్రేయ ఇటీవలనే హర్యానాకు బదిలీ అయ్యారు. చండీఘడ్‌లో జరిగిన బండారు దత్తాత్రేయ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్, డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా హాజరయ్యారు. బండారు దత్తాత్రేయ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1991, 98, 99,2014లలో సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందారు. రెండుసార్లు కేంద్రమంత్రిగా సేవలందించారు. అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో రైల్వే మంత్రిగా, నరేంద్ర మోదీ ప్రభుత్వంలో కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2019లో కేంద్రం ఆయన్ను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియమించింది. దత్తాత్రేయ ప్రమాణ స్వీకారం.. వీడియో..
हरियाणा के नव नियुक्त राज्यपाल श्री @Dattatreya जी का शपथ ग्रहण समारोह। https://t.co/eBfINeKLpo
— CMO Haryana (@cmohry) July 15, 2021
కేంద్ర ప్రభుత్వం ఇటీవల మొత్తం 8 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా ఉన్న బండారు దత్తాత్రేయకు స్థాన చలనం కలిగింది. హిమాచల్ ప్రదేశ్ నుంచి హర్యానా గవర్నర్‌గా నియమితులయ్యారు. దీంతోపాటు ఏపీ బీజేపీ నేత కంభంపాటి హరిబాబుకు గవర్నర్ పదవి వరించింది. మిజోరం గవర్నర్‌గా కంభంపాటి హరిబాబును నియమితులయ్యారు.
Former Himachal Pradesh Governor Bandaru Dattatreya takes oath as Governor of Haryana in Chandigarh pic.twitter.com/krRgfGBDxg
— ANI (@ANI) July 15, 2021
Also Read: