పంజాబ్ కాంగ్రెస్ లో సంక్షోభం ముగిసినట్టే !..సీఎంగా అమరేందర్ కొనసాగితే సిద్దుకి రాష్ట్ర పార్టీ చీఫ్ పదవి !
పంజాబ్ కాంగ్రెస్ లో తలెత్తిన సంక్షోభం ముగిసినట్టే కనిపిస్తోంది. రాష్ట్ర సీఎంగా కెప్టెన్ అమరేందర్ సింగ్ కొనసాగుతారని, నవజ్యోత్ సింగ్ సిద్దు రాష్ర కాంగ్రెస్ చీఫ్ గా నియమితులవుతారని ఓ రాజీ సూత్రాన్ని పార్టీ అధిష్టానం రూపొందించింది.
పంజాబ్ కాంగ్రెస్ లో తలెత్తిన సంక్షోభం ముగిసినట్టే కనిపిస్తోంది. రాష్ట్ర సీఎంగా కెప్టెన్ అమరేందర్ సింగ్ కొనసాగుతారని, నవజ్యోత్ సింగ్ సిద్దు రాష్ర కాంగ్రెస్ చీఫ్ గా నియమితులవుతారని ఓ రాజీ సూత్రాన్ని పార్టీ అధిష్టానం రూపొందించింది. దీన్ని వీరు అంగీకరించారని తెలిసింది. సిద్దుకు ఏదో ఒక పదవినిస్తారని కొన్నాళ్లుగా ఊహాగానాలు సాగుతున్న విషయం గమనార్హం. ఇక వీరితో బాటు హిందూ, దళిత వర్గాల నుంచి ఇద్దరు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు కూడా ఉంటారని సమాచారం. అమరేందర్ సింగ్, సిద్దు మధ్య ఏర్పడిన వివాదం ముగిసినట్టేనని పంజాబ్ కాంగ్రెస్ ఇన్-ఛార్జ్ హరీష్ రావత్ తెలిపారు. మరో రెండు, మూడు రోజుల్లో తాజా పరిష్కారం గురించి పార్టీ ప్రకటిస్తుందని ఆయన చెప్పారు. పార్టీ తీసుకున్న నిర్ణయానికి అమరేందర్ సింగ్ కట్టుబడి ఉంటారన్నారు.త్వరలో జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సింగ్, సిద్దు ఇద్దరూ కలిసి పని చేస్తారని ఆయన చెప్పారు.
సిద్దు ఇక రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడని, తాను ఏం చేయాలో, ఏ నిర్ణయాలు తీసుకోవాలో ..ఏది చేయాలన్నా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని హరీష్ రావత్ వ్యాఖ్యానించారు. మొదట నవజ్యోత్ సింగ్ సిద్దుకు డిప్యూటీ సీఎం పదవి లేదా రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ పదవినిచ్చినా తాను అంగీకరించబోమని బీష్మించిన అమరేందర్ సింగ్ ఆ తరువాత ఢిల్లీకిరాగానే చల్లబడిపోయారు. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతోను, రాహుల్ గాంధీతోను సమావేశమైన అనంతరం ఆయన పంథాయే మారిపోయింది. మరీ పట్టుబడితే తన పదవికే ఎసరు వస్తుందేమోనని ఆయన కామ్ అయిపోయారు. కాగా ఇక ఈ కొత్త ఫార్ములాకు సిద్దు పూర్తి అంగీకారం తెలిపారా లేదా అన్నది ఇంకా స్పష్టం కావలసి ఉంది.
మరిన్ని ఇక్కడ చూడండి : రామయ్య నువ్వు రావాలయ్యా..!క్లిష్ట పరిస్థితుల్లో రామయ్యె రామబాణం అంటూ ఫ్యాన్స్ స్వాగతం.:Jr.NTR ReEntry Politics Live Video.
భారీ వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం..! జలమయంగా మారిన మహానగరం..:Heavy Rains Live Video.