Arun Jaitley: అరుణ్ జైట్లీ వర్ధంతి నేడు.. దివంగత నేత గురించి మీకు తెలియని ఐదు ఆసక్తికరమైన విషయాలు..
9 ఆగస్టు 2019న శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడగా.. చికిత్స తీసుకుంటూ అర్జున్ జైట్లీ తుదిశ్వాస విడిచారు. నేడు అర్జున్ జైట్లీ మూడవ వర్ధంతి. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన 5 ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం
Arun Jaitley Death Anniversary: మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి , బీజేపీకి చెందిన ప్రముఖ నాయకుడు అరుణ్ జైట్లీ వర్ధంతి నేడు. అరుణ్ జైట్లీ 2019లో 66 ఏళ్ల వయసులో ఆగష్టు 24వ తేదీన ఢిల్లీలో మరణించారు. జైట్లీ మరణవార్త రాజకీయ ప్రపంచంతో పాటు యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మరణానికి కొన్ని నెలల ముందు వరకు రాజకీయాల్లో పూర్తిగా క్రియాశీలకంగా ఉన్నారు. ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలోనే జీఎస్టీని దేశంలో ప్రవేశపెట్టారు. ఆయన తీసుకున్న నిర్ణయాలు ఆశ్చర్యకరమైనవి కావచ్చు. అతని ఇమేజ్ పార్టీకి మరింత బలాన్ని చేకూర్చేది. బీజేపీకి సంబంధించిన ప్రతి వివాదంలోనూ తన మద్దతుని తెలిపేవారు. గ్రాడ్యుయేషన్ నుంచి కాలేజీ రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్న జైట్లీకి .. దేశంలో ఎమర్జెన్సీ విధించిన సమయంలో క్రియాశీలకంగా పనిచేశారు. 1973లో బీహార్‌లో అవినీతి వ్యతిరేక ఉద్యమం ప్రారంభమైనప్పుడు, ఆ ఉద్యమంలోని ముఖ్య నేతలలో జైట్లీ ఒకరు.
90వ దశకం నుండి.. జైట్లీ దేశ క్రియాశీల రాజకీయాల్లో భాగమయ్యారు. బీజేపీ అధికార ప్రతినిధిగా నియమించబడ్డారు. 1999లో వాజ్‌పేయి ప్రభుత్వంలో సమాచార, ప్రసార శాఖ మంత్రిగా నియమితులైన ఆయన 2000లో న్యాయ మంత్రిత్వ శాఖ బాధ్యతలు కూడా చేపట్టారు. ప్రధాని మోడీ ప్రభుత్వంలో జైట్లీ ఆర్థిక మంత్రిగా జీఎస్టీ, నోట్ల రద్దు వంటి నిర్ణయాలు తీసుకున్నారు. జీఎస్‌టీ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసిన ఘనత కూడా ఆయనదే. 2018లో జైట్లీకి కిడ్నీ మార్పిడి జరిగింది. 2019లో సాఫ్ట్ టిష్యూ సార్కోమా అనే అరుదైన వ్యాధి బారిన పడినట్లు నిర్ధారణ అయింది. అమెరికాలో చికిత్స తీసుకుని తిరిగి స్వదేశానికి వచ్చారు. 9 ఆగస్టు 2019న శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడగా.. చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు. నేడు అర్జున్ జైట్లీ మూడవ వర్ధంతి. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన 5 ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం
ఢిల్లీ యూనివర్శిటీలో స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడు :
- మోడీ ప్రభుత్వంలో ఆర్థిక , రక్షణ మంత్రిత్వ శాఖలను నిర్వహించిన జైట్లీ ఢిల్లీ విశ్వవిద్యాలయంలో చదివారు. అఖిల విద్యార్థి పరిషత్ విద్యార్థి నాయకుదుగా 1974లో ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షుడుగా ఎంపికయ్యారు. అఖిల విద్యార్థి పరిషత్ కార్యదర్శిగా కూడా పనిచేశారు.
- ఎమర్జెన్సీ సమయంలో ఆయన 19 నెలలు జైలులో ఉన్నారు. శిక్ష అనుభవించిన తరువాత.. ఆయన జనసంఘ్‌లో చేరారు. 1980లో భారతీయ జనతా పార్టీ స్థాపించినప్పుడు ఢిల్లీ విభాగానికి కార్యదర్శిగా పనిచేశారు.
- న్యాయశాస్త్రం పూర్తి చేసిన తర్వాత జైట్లీ 1977 నుండి సుప్రీంకోర్టు, హైకోర్టులో ప్రాక్టీస్ మొదలు పెట్టారు. తొలిసారిగా ఢిల్లీ హైకోర్టు సీనియర్ న్యాయవాదిగా ఎన్నికయ్యారు. అనంతరం సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కూడా విధులను నిర్వహించారు. న్యాయవాదిగా.. జైట్లీ కోర్టులో పెప్సీ , కోకా-కోలా వంటి ప్రసిద్ధ కంపెనీల కేసులను వాదించారు.
- న్యాయవాదిగా పనిచేస్తున్నప్పుడు అతని క్లయింట్ జాబితాలో చాలా మంది అనుభవజ్ఞుల పేర్లు ఉన్నాయి. వీటిలో శరద్ యాదవ్, మాధవరావ్ సింధియా, ఎల్‌కే అద్వానీ వంటి రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నారు. బోఫోర్స్ స్కాంలో విషయంలో జైట్లీ ఎన్నో అంశాలను పరిశోధించారు.
- 1989లో విశ్వనాథ్‌ప్రతాప్ సింగ్ ప్రభుత్వంలో అదనపు సొలిసిటర్ జనరల్‌గా జైట్లీ నియమించబడ్డారు. రాజకీయ నాయకులతో చాలా కాలంగా అనుబంధం ఉండడంతో జైట్లీకి బీజేపీ నేతలతోనే కాదు.. ప్రతిపక్ష పార్టీ నేతలతో కూడా సత్సంబంధాలు ఉండేవి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..