Sikkim: సిక్కింలో చిక్కుకున్న పర్యాటకులు.. మరో 300 మంది సురక్షితంగా తరలింపు
దేశంలో పలు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతుండగా మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. సిక్కింలోని ఇటీవల భారీ వర్షాలు కురవడంతో వరదలు రావడం, కొండచరియలు విరిగిపడిపోయిన సంగతి తెలిసిందే. ఈ వరదల ప్రభావానికి దాదాపు 3 వేలకు పైగా పర్యాటకులు ఉత్తర సిక్కిం జిల్లాల్లో చిక్కుకుపోయినట్లు అధికారులు పేర్కొన్నారు.

దేశంలో పలు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతుండగా మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. సిక్కింలోని ఇటీవల భారీ వర్షాలు కురవడంతో వరదలు రావడం, కొండచరియలు విరిగిపడిపోయిన సంగతి తెలిసిందే. ఈ వరదల ప్రభావానికి దాదాపు 3 వేలకు పైగా పర్యాటకులు ఉత్తర సిక్కిం జిల్లాల్లో చిక్కుకుపోయినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇందుకు దేశీయ పర్యాటకులతో పాటు విదేశస్థులు కూడా ఉన్నారు. గురువారం నుంచి ఇక్కడ పలు ప్రాంతాాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీనివల్ల వల్ల పలు ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. లెచెన్, లచుంగ్ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడడంతో అక్కడికి వచ్చిన పర్యాటకులు ఆ ప్రాంతాల్లోనే చిక్కుకుపోయారు.
వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిక్కిం ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఇప్పటికే సహాయక బృందాలు 1500 మంది పర్యాటకుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే తాజాగా లాచెన్స లాచుంగ్ ప్రాంతాల్లో కూడా చిక్కుపోయిన 300 పర్యాటకుల్ని వరద ప్రభావిత ప్రాంతాల నుంచి తరలించారు. ఇందుకోసం సహాయక సిబ్బంది తాత్కాలికంగా ఓ వంతెన ఏర్పాటు చేసి వారిని క్షేమంగా తీసుకెళ్లారు. అలాగే వారికి భోజన సౌకర్యాలు, వైద్య సదుపాయాలు కూడా అందిస్తున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు.




మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..