Indian Army: పాక్ ఉగ్రవాది ప్రాణాలు నిలబెట్టేందుకు రక్త దానం చేసిన భారత ఆర్మీ జవాన్లు

Indian Army: ఇండియన్‌ ఆర్మీ మానవత్వానికి ఇదే చక్కటి నిదర్శనం. శత్రువులు కదా అని పగప్రతీకారాలు చూపకుండా కాపాడటంతో ముందుంటారు. పాక్‌-భారత్‌కు మధ్య..

Indian Army: పాక్ ఉగ్రవాది ప్రాణాలు నిలబెట్టేందుకు రక్త దానం చేసిన భారత ఆర్మీ జవాన్లు
Indian Army
Follow us
Subhash Goud

|

Updated on: Aug 25, 2022 | 11:58 AM

Indian Army: ఇండియన్‌ ఆర్మీ మానవత్వానికి ఇదే చక్కటి నిదర్శనం. శత్రువులు కదా అని పగప్రతీకారాలు చూపకుండా కాపాడటంతో ముందుంటారు. పాక్‌-భారత్‌కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంటుందనే విషయం అందరికి తెలిసిందే. భారత్‌పై ఉగ్రవాదుల దాడులను తిప్పికొడుతున్న భారత జవాన్లు.. మానవత్వం చూపడంలో ప్రత్యేక శ్రద్ద కనబరుస్తుంటారు. భారత్‌పై దాడి చేసేందుకు కశ్మీర్‌ సరిహద్దుల్లోకి ప్రవేశించిన పాక్‌ ఉగ్రవాది గాయాలతో ఉండగా, వెంటనే ఆస్పత్రికి తరలించి రక్తదానం చేసి మరీ రక్షించారు. భారత ఆర్మీ జవాన్ల మానవత్వానికి హ్యట్సాప్‌ చెప్పాల్సిందే.

ఒక జమ్మూకశ్మీర్‌లో ప్రతి రోజు ఉగ్రవాదుల కదలికలు ఉండనే ఉంటాయి. ఏదో ఒక ప్రాంతంలో కాల్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. ఇక తాజాగా పాక్‌కు చెందిన ఓ ఉగ్రవాది భారత్‌పై దాడి చేసేందుకు యత్నించి జవాన్లకు పట్టుబడ్డాడు. ఓ పాకిస్తానీ ఉగ్రవాది జమ్మూలోని రాజౌరీ జిల్లాలో చొరబడి పారిపోవడానికి ప్రయత్నించి గాయపడ్డాడు. దీంతో అతన్ని భారత సైన్యం పట్టుకుంది. వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన పాకిస్తానీ ఉగ్రవాదికి ఆర్మీ సిబ్బంది రక్తదానం చేసి కాపాడినట్లు రాజౌరిలోని మిలటరీ ఆస్పత్రి కమాండెంట్‌ బ్రిగేడియర్‌ రాజీవ్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అతడిని తాము టెర్రరిస్టుగా భావించలేదని, అతని ప్రాణాలను కాపాడేందుకు మరే ఇతర పేషెంట్‌లా వ్యవహరించలేదని అన్నారు. భారత్‌పై దాడి చేసేందుకు వచ్చిన పాకిస్తానీ ఉగ్రవాదికి రక్తదానం చేసిన ఘనత భారత ఆర్మీ అధికారులదేనన్నారు.

ఇవి కూడా చదవండి

పాక్‌కు చెందిన ఉగ్రవాది తబారక్ హుస్సేన్ (32) భారత్‌లోకి చొరబడేందుకు యత్నించాడు. దీంతో భారత్‌ ఆర్మీ సిబ్బంది కాల్పులు జరపగా, అతనికి గాయాలయ్యాయి. దీంతో అతన్ని పట్టుకున్నారు. ఆయన తోడ, భుజంలో రెండు బుల్లెట్‌ కాగాయాలు అయ్యాయి. దీంతో ఆయనకు తీవ్ర రక్తస్రావం కావడంతో ఆర్మీ సిబ్బంది వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడేందుకు రక్తదానం చేశారు. ప్రస్తుతం ఆ ఉగ్రవాది ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు మిలటరీ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఆరోగ్యం మెరుగుపడేందుకు కొన్ని వారాల సమయం పట్టవచ్చని తెలిపారు.

భారత ఆర్మీ పోస్టుపై దాడి చేసేందుకు పాకిస్తానీ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీకి చెందిన కల్నల్‌ తనకు రూ.30వేల పాక్‌ రూపాయలు ఇచ్చినట్లు పట్టుబడ్డ పాక్‌ ఉగ్రవాది తెలిపారు. గత ఆరేళ్లలో పాక్‌ సైన్యంలోని ఇంటెలిజెన్స్‌ విభాగంలో పని చేసిన హుస్సేన్‌ సరిహద్దు దాటి ఇటువైపు చొరబడేందుకు ప్రత్నించి అరెస్టు కావడం ఇది రెండోసారి. హుస్సేన్‌ తీవ్రవాదంతో తన సుదీర్ఘ అనుబంధాన్ని ఒప్పుకొన్నాడు. అతను పాకిస్తాన్‌ సైన్యానికి చెందిన మేజర్‌ రజాక్‌ వద్ద శిక్షణ పొందినట్లు చెప్పాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి