Moi Virundhu: కష్టం వస్తే అక్కడ ‘చదివింపుల విందు’.. ఎమ్మెల్యే ఇచ్చిన విందుకు రూ. 12 కోట్లు.. ఎక్కడంటే

తమిళనాడు తంజావూరు జిల్లా పేరావూరని ఎమ్మెల్యే ఇంట్లో చదివింపుల విందు. ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్నవారిని ఆదుకునే ఉద్దేశ్యంతో మొదలైన చదివింపుల విందు.

Moi Virundhu: కష్టం వస్తే అక్కడ 'చదివింపుల విందు'.. ఎమ్మెల్యే ఇచ్చిన విందుకు రూ. 12 కోట్లు.. ఎక్కడంటే
Pudukkottai Moi Virundhu
Follow us

|

Updated on: Aug 25, 2022 | 11:26 AM

Moi Virundhu: ఎవరైనా కష్టంలో ఉంటే ఒక్కరే ఆర్ధికంగా ఆదుకోలేరు.. కానీ పదిమంది కలిస్తే..తప్పనిసరిగా ఆ వ్యక్తి ఆర్ధిక సమస్య తీర్చవచ్చు. అందుకనే భారతీయుల ఇళ్లల్లో పెళ్లిళ్లు, శుభకార్యాలు ఇలా ఏ సందర్భం వచ్చినా.. చదివింపులు కార్యక్రమం ఉంటుంది. అయితే తమిళనాడులో ఇదే పద్దతిని.. మొయ్ విరుందు అనే పేరుతో సాంప్రదాయం కొనసాగిస్తున్నారు. ప్రతియేటా ఈ సీజన్లో తంజావూరు జిల్లాలో విందు సంప్రదాయంగా ఇస్తారు.

తమిళనాడు లో ఎమ్మెల్యే కి భారీగా చదువింపులు వచ్చాయి. ఎంత అంటే అక్షరాలా 12 కోట్లు. తమిళనాడు లో మొయ్ విరుందు అనే సంప్రదాయం ఉంది.. అంటే చదివింపుల విందు అని అర్ధం.. ప్రతియేటా ఈ సీజన్ లో బందువులు, స్నేహితులను పిలిచి విందు భోజనం పెడతారు.. వచ్చినవారు భోజనం చేశాక విందు ఏర్పాటు చేసిన వ్యక్తికి నచ్చిన మొత్తంలో నగదు చదివింపులు గా ఇస్తారు.. అలా అందరూ ఇచ్చిన నగదు తో వ్యాపారం, వ్యవసాయ, పిల్లల చదువులు, పెళ్లిళ్లు లాంటి కార్యక్రమాలకు ఉపయోగించుకుంటారు.. మళ్లీ ఏడాది తిరిగి అవతలి వాళ్ళు విందు ఏర్పాటు చేసినప్పుడు ఇప్పుడు చదివింపులు తీసుకున్న వారు చెల్లిస్తారు.. ఇవి ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్నవారికి మంచి ఆసరాగా నిలుస్తున్న సంప్రదాయం.

తాజాగా తమిళనాడు లోని తంజావూరు జిల్లా పేరావూరని నియోజకవర్గ ఎమ్మెల్యే అశోక్ కుమార్ ఇచ్చిన విందులో భారీగా తరలివచ్చారు. భోజనాల తర్వాత వచ్చిన మొత్తం చదివింపులు 12 కోట్ల వరకు వచ్చాయి. గతంలో ఎప్పుడూ రానంతగా ఎమ్మెల్యే ఇచ్చిన విందులో చదివింపులు రావడం రికార్డ్.. గతంలో 6 కోట్లు మాత్రమే చదివింపులు గా వచ్చాయి.. ఎమ్మెల్యే ఇంట్లో శుభకార్యం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ విందులో 12 కోట్లు నగదు వచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..