Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ఇంతలా నిరుత్సాహపరిచే వీడియో ఇంతవరకు చూడలేదు.. ఆనంద్ మహింద్రా ట్వీట్ వైరల్

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాలో చురుకుగా కనిపించే ఆయన వినూత్న వీడియోలు షేర్ చేస్తూ అందర్ని ఆశ్చర్యపరుస్తుంటారు. ఆ వీడియోలు సందేశాలు, వినోదాత్మకంగా ఉండటమే కాకుండా విజ్ఞానాన్ని పెంచేలా ఉంటాయి.

Watch Video: ఇంతలా నిరుత్సాహపరిచే వీడియో ఇంతవరకు చూడలేదు.. ఆనంద్ మహింద్రా ట్వీట్ వైరల్
Anandh Mahindra
Follow us
Aravind B

|

Updated on: May 04, 2023 | 4:03 PM

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాలో చురుకుగా కనిపించే ఆయన వినూత్న వీడియోలు షేర్ చేస్తూ అందర్ని ఆశ్చర్యపరుస్తుంటారు. ఆ వీడియోలు సందేశాలు, వినోదాత్మకంగా ఉండటమే కాకుండా విజ్ఞానాన్ని పెంచేలా ఉంటాయి. ఏదైన కొత్తగా, వింతగా కనిపిస్తే చాలు.. తన అభిప్రాయాన్ని నెటీజన్లతో పంచుకుంటారు ఆనంద్ మహింద్రా. తాజాగా ఆయన షేర్ చేసిన ఓ వీడియో అందర్ని ఆకట్టుకుంటోంది. ఓ అమ్మాయి విలాసవంతంగా చేసే ట్రైన్ జర్నీ ఆ వీడియోల కనిపిస్తోంది.

దీనిపై స్పందించిన ఆనంద్ మహింద్రా ఈ వీడియో క్లిప్ తన వద్దకు పలుమార్లు వచ్చిందంటూ తెలిపారు. ఆధునిక ప్రపంచంలో రైలు ప్రయాణంలో ఉన్న సౌకర్యాలను.. అనేక ఉత్పత్తులు మన ప్రయాణాన్ని ఎలా విలాసవంతంగా, పరిశుభ్రంగా చేస్తాయో చూపించేలా ఈ వీడియో ఉన్నట్లు పేర్కొన్నారు. వెల్లడిచేస్తున్నట్లు కనిపిస్తోంది. ఆ నా జీవితంలో వ్యక్తిగతంగా ఇంతగా నిరుత్సాహపరిచే వీడియో ఎప్పుడూ చూడలేదన్నారు. ఆధునిక జీవన విధానంలో అనవసర వస్తువుల అతివినియోగాన్ని ఇది చూపిస్తోందని తెలిపారు. పెరుగుతున్న ఈ అవసవరపు వస్తువులు భూగ్రహంపై ఉన్న చెత్తగుట్టలను మాత్రమే మరింత పెంచుతాయంటూ రాసుకొచ్చారు.చిన్నచిన్న వస్తువులతో ఓ యువతి రైలులో విలాసవంతంగా ప్రయాణించడం ఆ వీడియోలో కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..