AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేంద్ర కేబినెట్ విస్తరణపై ఊహాగానాలు ! ఎంపీలను కలుస్తున్న హోం మంత్రి అమిత్ షా ! ఆశావహుల్లో ఎవరికి ఛాన్స్ ?

కేంద్ర కేబినెట్ ను విస్తరించవచ్చునన్న ఊహాగానాల మధ్య హోం మంత్రి అమిత్ షా పలువురు ఎంపీలతో సమావేశమవుతున్నారు. గత శని, ఆదివారాల్లో ఆయన వివిధ రాష్ట్రాల ఎంపీలతో భేటీ అయ్యారు. యూపీ, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్ మరికొన్ని...

కేంద్ర కేబినెట్ విస్తరణపై ఊహాగానాలు ! ఎంపీలను కలుస్తున్న హోం మంత్రి అమిత్ షా !  ఆశావహుల్లో ఎవరికి  ఛాన్స్ ?
Amit Shah Meets Mps Amid Central Cabinet Expansion
Umakanth Rao
| Edited By: Anil kumar poka|

Updated on: Jun 15, 2021 | 5:24 PM

Share

కేంద్ర కేబినెట్ ను విస్తరించవచ్చునన్న ఊహాగానాల మధ్య హోం మంత్రి అమిత్ షా పలువురు ఎంపీలతో సమావేశమవుతున్నారు. గత శని, ఆదివారాల్లో ఆయన వివిధ రాష్ట్రాల ఎంపీలతో భేటీ అయ్యారు. యూపీ, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్ మరికొన్ని రాష్ట్రాల నుంచి సుమారు 30 మందికి పైగా ఎంపీలు ఆయనను కలిసినవారిలో ఉన్నారు. కొందరు మంత్రులు సైతం ఈ భేటీలో పాల్గొన్నారు. ముఖ్యంగా తమ తమ నియోజకవర్గాల్లో కోవిద్-19 అదుపునకు ఈ ఎంపీలు ఎలాంటి చర్యలు తీసుకున్నారో అమిత్ షా వారి నుంచి తెలుసుకోగోరారని సమాచారం. ఇంకా తమ తమ నియోజకవర్గాల అభివృద్ధికి వారు చేపట్టిన కార్యక్రమాల గురించి కూడా ఆయన వివరంగా తెలుసుకున్నట్టు చెబుతున్నారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్ లో 28 ఖాళీలు ఉన్నాయి. మిత్ర పక్షాలను సంతృప్తి పరచేందుకు, గత రెండేళ్లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన రాష్ట్రాలకు ప్రాధాన్యతనివ్వాలని యోచిస్తున్నారు. బీహార్ నుంచి సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీ-యూ నేతల్లో ఒకరికి, లోక్ జన శక్తి పార్టీ నుంచి ఒకరికి.. అలాగే జ్యోతిరాదిత్య సింధియా వంటి నేతలకు మంత్రి పదవులు దక్కే సూచనలు ఉన్నాయని అంటున్నారు.

ఇటీవలే కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరిన జితిన్ ప్రసాద పేరుకూడా వినబడుతోంది. ఆయన పార్టీలో చేరుతున్నప్పుడు మిమ్మల్ని సంతృప్తి పరుస్తాం అని పార్టీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం. బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ ని కూడా మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దేశంలో కోవిద్ కేసులు అదుపులోకి వస్తున్న నేపథ్యంలో.. ఇక ప్రభుత్వ కార్యక్రమాలను కూడా వేగంగా చేపట్టాలని భావిస్తున్నారు. అనేక రాష్ట్రాల్లో ఆంక్షలను సడలిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అమిత్ షా ఈ ఎంపీలతో సమావేశమయ్యారు. రాబోయే రోజుల్లో మళ్ళీ ఈ విధమైన సమావేశాలను ఆయన నిర్వహిస్తారని తెలుస్తోంది.

మరిన్ని ఇక్కడ చూడండి: రైళ్లో సీటు కోసం ఏకంగా యువకుడు చేసిన తతంగం నవ్వులు పూయిస్తున్న వీడియో : Viral Video.

Rare Photos and videos: ఒకే ఫేమ్ లో టాలీవుడ్ లెజెండరీ హీరోలు.. 33 ఏళ్ళక్రితం ఫోటో వైరల్ వీడియో.

 Dog Viral Video : చెట్టు కొట్టకుండా అడ్డుపడిన కుక్క..ఎందుకంటే!వైరల్ అవుతున్న వీడియో.

యంగ్ హీరో నిఖిల్ ఖాతాలో మరో మూడు సినిమాలు.?బిజీ బిజీ గా యంగ్ హీరో :Nikhil Siddharth Video.