Yamuna River pollution: ఎన్జీటీ సిఫారసుల మేరకు ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం.. నాణ్యతలేని సబ్బులు, డిటెర్జెంట్ల విక్రయాలపై నిషేధం!
బీఐఎస్ పారామీటర్లకు అనుగుణంగా లేని, నాణ్యత లేని సబ్బులు, డిటెర్జెంట్ల విక్రయం, నిల్వ, రవాణ, మార్కెటింగ్ నిషేధిస్తూ కేజ్రీవాల్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.
Delhi bans Soaps, Detergents: యమునా నదిలో కాలుష్యాన్ని అరికట్టేందుకు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. బీఐఎస్ పారామీటర్లకు అనుగుణంగా లేని, నాణ్యత లేని సబ్బులు, డిటెర్జెంట్ల విక్రయం, నిల్వ, రవాణ, మార్కెటింగ్ నిషేధిస్తూ కేజ్రీవాల్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. యమునా నదిలో కాలుష్యాన్ని నివారించడానికి నాణ్యత లేని సబ్బులు, డిటర్జెంట్లే కారణమని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యమున మానిటరింగ్ కమిటీ నిర్ధారించింది.
దేశ రాజధాని ఢిల్లీలోని యమునా నది కాలుష్యానికి పరిశ్రమలు వెదల్లే రసాయనాలతో పాటు, నాణ్యత లేని సబ్బులు, డిటర్జెంట్లు కూడా నీరు విషతుల్యానికి కారణమవుతున్నాయి. వీటి విక్రయాలను నిషేధించాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యమున మానిటరింగ్ కమిటీ ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఎన్జీటీ కమిటీ సిఫారసు మేర ఢిల్లీ సర్కారు నాణ్యత లేని సబ్బులపై నిషేధాస్త్రం విధించింది. వీటిని కలిగి ఉన్నా, విక్రయించిన, రవాణా చేసిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కేజ్రీవాల్ ప్రభుత్వం హెచ్చరించింది. నాణ్యత లేని సబ్బులు, డిటర్జెంట్ల వినియోగించడం వల్ల కలిగే హానికరమైన ప్రభావం గురించి అవగాహన కార్యక్రమాలు ప్రారంభించాలని ఎన్జీటీ ఢిల్లీ సర్కారును ఆదేశించింది.
నాణ్యత లేని సబ్బుల నిషేధాన్ని అమలు పర్చేలా స్థానిక సంస్థలు, పౌరసరఫరా విభాగం, జిల్లా పరిపాలన అధికారులు తనిఖీుల చేయాలని సర్కారు ఆదేశాలు జారీ చేసింది. యమునా నదిలో పైన తేలియాడుతున్న విషపూరిత మైన నురుగు సోషల్ మీడియాలో వెలుగుచూసింది. అధిక ఫాస్పేట్ కంటెంట్ ఉన్న రంగు పరిశ్రమలు, ధోబీ ఘాట్లు, గృహాల్లో ఉపయోగించే సబ్బులు, డిటర్జెంట్ల వల్ల యమునా నది నీటిలో విషపూరిత నురుగు ఏర్పడిందని తేలింది. ఎన్‌జిటికి సమర్పించిన తన నివేదికలో సబ్బులు, డిటర్జెంట్‌ల తయారీదారులందరూ ఉత్పత్తికి వాడిన పదార్థాలను బహిర్గతం చేసి ప్యాకేజీపై ప్రదర్శించాలని సూచించారు.