Auto Driver: ఆయన ఆటోలో కరోనా పేషెంట్లకు ఉచిత ప్రయాణం.. ఓ ఆటో డ్రైవర్‌ ఔదార్యం.. జనాల ప్రశంసలు

Covid-19 Pandemic: సాధారణంగా కరోనా రోగులను ఎక్కించుకోవడానికి ఆటో డ్రైవర్లు భయపడుతుంటారు. కానీ అతను మాత్రం కరోనా పేషెంట్లను ఉచితంగా తీసుకెళ్తూ అందరికి..

Auto Driver: ఆయన ఆటోలో కరోనా పేషెంట్లకు ఉచిత ప్రయాణం.. ఓ ఆటో డ్రైవర్‌ ఔదార్యం.. జనాల ప్రశంసలు
Auto Driver
Follow us

|

Updated on: Apr 25, 2021 | 7:32 PM

Covid-19 Pandemic: సాధారణంగా కరోనా రోగులను ఎక్కించుకోవడానికి ఆటో డ్రైవర్లు భయపడుతుంటారు. కానీ అతను మాత్రం కరోనా పేషెంట్లను ఉచితంగా తీసుకెళ్తూ అందరికి ప్రశంసలు అందుకుంటున్నాడు ఈ ఆటో డ్రైవర్‌. ఎంతో మంది కరోనా రోగులను ఆటో డ్రైవర్లు ఎక్కించుకోకపోవడంతో నరకయాతన పడుతుండటం పై జార్ఖండ్‌లోని రాంచీలో ఆటో డ్రైవర్‌ రవి అగర్వాల్‌ కళ్లరా చూశాడు. ఈ సమాజంలో మార్పు రావాలి అనుకున్నాడు. అందుకే తాను ముందుగా అడుగు వేయాలని నిర్ణయించుకున్నాడు. కరోనా పేషెంట్లకు ప్రయాణం ఉచితం అంటూ బోర్డు పెట్టాడు. దాంతో చాలా మంది కరోనా పేషెంట్ల అతని ఆటోలో ఆస్పత్రికి వెళ్లి ప్రాణాలు కాపాడుకుంటున్నారు. ఏప్రిల్‌ 15 నుంచి రవి అగర్వాల్‌  ‘ఫ్రీ ఎమర్జెన్సీ సర్వీసెస్’ అనే బోర్డ్  ఏర్పాటు చేసి నడుపుతున్నాడు. ముందుగా ఓ మహిళ కరోనాతో బాధపడుతూ ఆటో స్టాండ్‌ దగ్గరకు వచ్చి అడిగితే ఆమెను ఎక్కించుకోవడానికి ఎవరు ముందుకు రాలేదు. ఆ మహిళ ఎంత డబ్బైనా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నా ..ఎవరు కూడా పట్టించుకోలేదు. నేను ఆమెను తీసుకెళ్లి డ్రాప్‌ చేశాను. ఆమె కరోనా పేషెంటో కాదో నాకు తెలియదు. డబ్బు మాత్రం వద్దన్నాను అని రవి తెలిపాడు.

ప్రస్తుతం జార్ఖండ్‌లో రోజుకు 5 వేలకుపైదా కరోనా కొత్త కేసులు నమోదు అవుతుండగా, పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. వారిలో కొంత మంది ఆస్పత్రులకు వెళ్లి చనిపోతున్నారు. ఇక రవి మాత్రం చాలా మంది ప్రాణాలు కాపాడుతున్నాడు. అంతేకాదు ఎవరికైనా ఫ్రీ ఆటో కావాలంటే తనకు కాల్‌ చేయాలని కోరుతున్నాడు. కాల్‌ చేసిన వెంటనే వచ్చి పేషెంట్‌ను ఆటోలో ఎక్కించుకుని ఆస్పత్రికి తీసుకెళ్తున్నాడు. ఈ రోజుల్లో ఇలా సేవ చేస్తున్న రవి అగర్వాల్‌పై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నాడు.

కాగా, కరోనా వచ్చిన వారిని ప్రతి ఒక్కరు ఏదో రకంగా చూస్తున్నారు. ఎవరికైనా కరోనా వచ్చిందంటే చాలా వారి వైపు ఎవ్వరు కూడా వెళ్లని పరిస్థితి ఉంది. సొంతింటివారే వారికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. కరోనాతో చనిపోయిన వారిని కడసారి చూపును సైతం చూడని పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితిల్లో కరోనా వచ్చిందంటే చాలు వారిని దారుణంగా చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో వారి పట్ల మానత్వం చాటే వారు చాలా తక్కువ. అలాంటిది రవి అగర్వాల్‌ కరోనా పేషెంట్ల పట్ల ముందుకు రావడం చాలా గొప్ప విషయమని పలువురు కొనియాడుతున్నారు.

ఇవీ చదవండి:

India Coronavirus: దేశంలో కరోనా అల్లకల్లోలం.. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు

Coronavirus: కరోనాతో భారత్‌లో పరిస్థితి దారుణంగా ఉంది.. ఆందోళన వ్యక్తం చేసిన డబ్ల్యూహెచ్‌వో

భారత్‌లో సెకండ్‌వేవ్‌ కరోనా వ్యాప్తిపై అంతర్జాతీయ మీడియా విశ్లేషణ.. కరోనా వ్యాప్తికి గల కారణాలేంటో తెలిపిన విదేశీ పత్రికలు