Babul Supriyo: కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియోకి రెండోసారి కరోనా పాజిటివ్..
Second Time Covid-19 positive: దేశంలో కరోనావైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. నిత్యం లక్షలాది మంది కరోనా బారిన పడుతుండగా.. వేలాది మంది మరణిస్తున్నారు. సాధారణ
Second Time Covid-19 positive: దేశంలో కరోనావైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. నిత్యం లక్షలాది మంది కరోనా బారిన పడుతుండగా.. వేలాది మంది మరణిస్తున్నారు. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు.. రాజకీయ నాయకులు ప్రతిఒక్కరూ కోవిడ్ మహమ్మారి బారిన పడుతున్నారు. ఈ క్రమంలో ఆందోళన కలిగించే విషయం ఎమిటంటే.. కరోనా సోకిన వారికి కూడా మరలా సోకుతోంది. తాజగా ఓ కేంద్ర మంత్రికి రెండోసారి కూడా కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియోకు రెండోసారి కరోనా సోకింది. తనతోపాటు తన భార్యకు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని ఆదివారం బాబుల్ సుప్రియో ట్విట్ చేశారు. తనకు రెండోసారి కరోనా సోకిందని.. ఈ నేపథ్యంలో సోమవారం అసన్‌సోల్‌లో ఓటు వేయడం లేదని పేర్కొన్నారు. అయితే మానసికంగా బీజేపీ అభ్యర్థుల పక్షానే ఉంటానని, ఇంటి నుంచే ఓటింగ్ తీరును పరిశీలిస్తానని బాబుల్ సుప్రియో వెల్లడించారు.
కాగా, బాబుల్ సుప్రియో అసన్‌సోల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎంపీగా గెలిచారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఆయన తాజాగా టోలీగంజ్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. కాగా పశ్చిమ బెంగాల్‌లో ఇప్పటివరకూ 6 విడతల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. ఇంకా రెండు విడతల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. రేపు ఏడో విడతలో భాగంగా మరో 36 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగనుంది. అయితే.. పశ్చిమ బెంగాల్‌లో కరోనావైరస్ ఉధృతి భారీగా పెరుగుతోంది. నిత్యం వెలల్లో కేసులు నమోదవుతున్నాయి.
కరోనా వ్యాప్తి దృష్ట్యా పలువురు ప్రముఖులు ఎన్నికల ప్రచారాలను కూడా రద్దు చేసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కాంగ్రెస్ నేత రాహుల్ గంధీ ఎన్నికల ర్యాలీలను విరమించుకున్నారు. కాగా పశ్చిమ బెంగాల్‌తోపాటు మరో నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మే 2న వెల్లడి కానున్నాయి.
Also Read: