Amarnath Yatra 2023: అమర్‌నాథ్ యాత్రకు పూర్తయిన ఏర్పాట్లు.. తొలిసారిగా రంగంలోకి ఐటీబీపీ.. షెడ్యూల్ విడుదల
Amarnath Yatra 2023: అమర్‌నాథ్ యాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరో రెండు రోజుల్లో.. శనివారం (జులై 1) నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అమర్‌నాథ్ యాత్ర ఏర్పాట్లు, భద్రతపై జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్‌సిన్హా సమీక్షించారు.

Amarnath Yatra 2023: అమర్‌నాథ్ యాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరో రెండు రోజుల్లో.. శనివారం (జులై 1) నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అమర్‌నాథ్ యాత్ర ఏర్పాట్లు, భద్రతపై జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్‌సిన్హా సమీక్షించారు. యాత్రికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని, అన్ని ఏర్పాట్లు ముందస్తుగానే పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఇదిలాఉంటే.. అమర్‌నాథ్ తీర్థయాత్ర భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఈ అమర్నాథ్ యాత్రకు సెంట్రల్ రిజర్వు పోలీసు ఫోర్స్ (CISF) భద్రత కల్పించేది.. దీనికి బదులుగా ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) సిబ్బందితో భద్రత కల్పించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మంగళవారం నిర్ణయించింది. అమర్నాథ్ యాత్ర నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆర్మీ అధికారులతో కీలక సమావేశం నిర్వహించింది. ప్రతీ ఏడాది జరిగే అమర్నాథ్ యాత్ర శనివారం నుంచి ప్రారంభమై.. ఆగస్టు 31తో ముగుస్తుంది. ఈ తీర్థయాత్ర జూలై 1 నుంచి ఆగస్టు 31 వరకు.. మొత్తం 62 రోజులపాటు జరుగనుంది. ఈ యాత్రలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటారు.
కాగా, అమర్‌నాథ్ యాత్రకు భద్రత కల్పించేందుకు ఐటీబీపీని మోహరించడం ఇదే తొలిసారని.. అంతకుముందు సీఐఎస్ఎఫ్ ను మోహరించేవారని అధికారులు తెలిపారు. అమర్‌నాథ్ దేవాలయ మండలి, జమ్మూ-కశ్మీరు పోలీసులు ఇచ్చిన సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది జూలై 8న అమర్‌నాథ్‌లో మెరుపు వేగంతో వరదలు వచ్చినపుడు ఐటీబీపీ జవాన్లు అత్యంత సమర్థవంతంగా చాలా మంది భక్తులను కాపాడారని, అందువల్ల ఈసారి భద్రత బాధ్యతను వారికే అప్పగించాలని నిర్ణయించారు.




మరిన్ని జాతీయ వార్తల కోసం..
