ఆపరేషన్ సింధూర్.. అఖిలపక్ష బృందాలతో ప్రధాని మోదీ డిన్నర్ మీట్..
ఉగ్రవాదంపై పాక్ నిజస్వరూపాన్ని ప్రపంచదేశాలకు వివరించడంలో అఖిలపక్ష బృందాలు అద్భుతంగా పనిచేశాయని ప్రశంసించారు ప్రధాని మోదీ. 33 దేశాల్లో 10 రోజుల పాటు పర్యటించిన ఏడు అఖిలపక్ష బృందాలకు తన నివాసంలో మోదీ విందు ఇచ్చారు. భారత్‌తో పాకిస్తాన్ ఏవిషయంలో కూడా పోటీ పడలేదని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అన్నారు.

ఆపరేషన్ సింధూర్‌పై వాస్తవాలను ప్రపంచానికి వివరించిన అఖిలపక్ష బృందాలతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. 33 దేశాల్లో ఏడు అఖిలపక్ష బృందాలు 10 రోజుల పాటు పర్యటించాయి. అఖిలపక్షం బృందానికి మోదీ డిన్నర్ ఇచ్చారు. పాకిస్తాన్ నిజస్వరూపాన్ని వివరించడంలో అఖిలపక్ష బృందాలు సూపర్ సక్సెస్ అయ్యాయి. ఉగ్రవాదంపై భారత వైఖరిని ప్రపంచదేశాలకు ఈ బృందాలు స్పష్టం చేశాయి. అఖిలపక్ష బృందంలో విపక్ష ఎంపీలు శశిథరూర్ , అసదుద్దీన్ ఒవైసీ హైలైట్‌గా నిలిచారు. వీళ్లతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్‌ఖుర్షీద్ కూడా ప్రభుత్వ వైఖరిని వెళ్లిన ప్రతి చోట సమర్ధించడం అందరి దృష్టిని ఆకర్షించింది. విపక్ష ఎంపీలు కూడా తనకు మద్దతు ఇవ్వడం ప్రధాని మోదీకి అస్త్రంగా మారింది. ఆపరేషన్ సింధూర్‌పై రాహుల్ విమర్శలకు ఆ పార్టీ నేతలే సమాధానం చెప్పారన్న అభిప్రాయంతో మోదీ ఉన్నారు. విజువల్స్
అమెరికా నుంచి తిరిగి వచ్చిన శశిథరూర్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. కాల్పుల విరమణలో మూడో దేశం ప్రమేయం లేదని , పాక్ కాల్పులు ఆపిన తరువాతే భారత్ కాల్పులు ఆపిందన్నారు. అమెరికాలో పాక్ నేత బిలావల్ భుట్టో మిమిక్రీ చేశారని సెటైర్ విసిరారు. ఉగ్రవాదుల స్థావరాల పైనే భారత్ దాడి చేసిందన్నారు. భారత్‌తో పాకిస్తాన్ ఏ విషయంలో కూడా పోటీ పడలేదన్నారు. విజువల్స్
ముస్లిం దేశాల్లో ముఖ్యంగా అరబ్ దేశాల్లో ఒవైసీ భారత్ వైఖరిని గట్టిగా విన్పించారు. ఉగ్రవాదం విషయంలో పాక్ నిజస్వరూపాన్ని బయటపెట్టారు. ఒవైసీ తీరును బీజేపీ నేతలు కూడా ప్రశంసిస్తున్నారు. అయితే పహల్గామ్ దాడి నిఘా సంస్థల వైఫల్యమే అన్నారు ఒవైసీ. ఈ వ్యవహారంపై కేంద్రం పార్లమెంట్‌లో సమాధానం చెప్పాలన్నారు. ప్రధాని మోదీ విందుకు ఒవైసీ హాజరయ్యారు. కువైట్ , యూఏఈ , సౌదీ అరేబియాతో పాటు పలు దేశాల్లో ఒవైసీ బృందం పర్యటించింది.
మే 21 నుంచి జూన్ 1 వరకు అఖిలపక్ష బృందాలులు విదేశాల్లో పర్యటించాయి.పాకిస్తాన్ నిజస్వరూపాన్ని బయటపెట్టడంలో అన్ని పార్టీల ప్రతినిధులు విజయవంతమయ్యారని ప్రశంసించారు మోదీ. పాకిస్తాన్‌తో ఎట్టి పరిస్థితుల్లో చర్చలు ఉండవన్నారు. సింధూ జలాల ఒప్పందం రద్దుపై పునరాలోచన లేదన్నారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ పైనే పాకిస్తాన్‌తో చర్చలు ఉంటాయన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి…