Hijab: హిజాబ్ పై ఆందోళనలు వద్దు.. కోర్టులో న్యాయపోరాటం చేద్దామన్న ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు..

ముస్లిం మహిళలకు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు విజ్ఞప్తి చేసింది. ముస్లిం ఎవరు ధర్నాలు నిరసనలు చేయకూడదు న్యాయపరంగా పోరాడుదామని హామీ ఇచ్చింది. కర్ణాటక కోర్టులో..

Hijab: హిజాబ్ పై ఆందోళనలు వద్దు.. కోర్టులో న్యాయపోరాటం చేద్దామన్న ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు..
Hijab Row Case
Follow us
Sanjay Kasula

|

Updated on: Feb 18, 2022 | 2:14 PM

ముస్లిం మహిళలకు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు విజ్ఞప్తి చేసింది. ముస్లిం ఎవరు ధర్నాలు నిరసనలు చేయకూడదు న్యాయపరంగా పోరాడుదామని హామీ ఇచ్చింది. కర్ణాటక కోర్టులో పోరాడుతున్న వ్యక్తులకు మద్దతుగా నిలబడదామంటూ పిలుపునిచ్చింది. అవసరం అనుకుంటే సుప్రీంకోర్టు వెళ్దామంటూ ఓ ప్రకటనను విడుదల చేసింది. బోర్డు అనుమతి లేకుండా బోర్డుకు సంబంధించిన వ్యక్తులు ఎవరు ధర్నాలో నిరసనలో మీడియా డిబేట్స్ లో వెళ్ళకూడదని సూచించింది. కర్ణాటకలో హిజాబ్‌ ఇష్యూ దుమారం కంటిన్యూ అవుతూన్న సంగతి తెలిసిందే.. అయితే ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు విడుదల చేసిన ప్రకటనతో గొడవలు తగ్గే అవకాశం ఉంది.

విద్యాసంస్థల్లో ఏ మతానికి సంబంధించిన డ్రెస్సులకు అనుమతి లేదని తేల్చిచెప్పింది కర్నాటక ప్రభుత్వం. అయినా సరే విద్యార్థులు హిజాబ్‌ తమకు రాజ్యాంగం కల్పించిన హక్కంటూ నినాదాలు చేస్తున్నారు. హిజాబ్‌ ధరించిన విద్యార్ధులను కాలేజ్‌ యాజమాన్యం అడ్డుకోవడంతో పలు చోట్ల ఆందోళనలు నిర్వహిస్తున్నారు.

మరోవైపు హిజాబ్‌ వివాదంపై కర్నాటక హైకోర్టులో ఎడతెగని వాదనలు జరుగుతున్నాయి. కనీసం శుక్రవారం రోజైనా హిజాబ్‌ ధరించేందుకు అనుమతి ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్‌ దాఖలయ్యింది. ప్రభుత్వం నుంచి తనకు ఇంకా మరింత సమాచారం రావాల్సి ఉందని , వాదనలు విన్పించడానికి మరింత సమయం కావాలని అడ్వకేట్‌ జనరల్‌ కోరడంతో విచారణను ఇవాల్టికి వాయిదా వేసింది హైకోర్టు.

ఇవి కూడా చదవండి: Petrol Diesel Price: రష్యా-ఉక్రెయిన్ రచ్చ కారణంగా పెరిగిన ముడి చమురు ధరలు.. మన దేశంలో మాత్రం పెట్రోల్-డీజిల్ ధరలు ఇలా..

CM Jagan: గుంటూరు జిల్లాలో ఇస్కాన్ అక్షయపాత్ర.. ప్రారంభించనున్న సీఎం జగన్..