Knowledge: సురపానంలోనూ తగ్గేదేలే! ఆ విషయాల్లో మగజాతిని ఓవర్‌టేక్‌ చేసిన మగువలు..

అతివలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. కెరీర్‌తోపాటు చెడు అలవాట్లలోనూ మేమే నెంబర్ వన్‌ అనేలా ఉంది పరిస్థితి చూడబోతే! అవునండీ.. మద్యపానంలోనూ, పొగ తాగడంలోనూ పురుషులను మించి పోయారు..

Knowledge: సురపానంలోనూ తగ్గేదేలే! ఆ విషయాల్లో మగజాతిని ఓవర్‌టేక్‌ చేసిన మగువలు..
Consumption Of Alcohol
Follow us

|

Updated on: Feb 19, 2022 | 6:33 AM

NFHS Report: అతివలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. కెరీర్‌తోపాటు చెడు అలవాట్లలోనూ మేమే నెంబర్ వన్‌ అనేలా ఉంది పరిస్థితి చూడబోతే! అవునండీ.. మద్యపానంలోనూ, పొగ తాగడంలోనూ పురుషులను మించి పోయారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్) ఇటీవల వెల్లడించిన నివేదిక ఈ విషయాన్ని ధృవీకరిస్తోంది. గత 5 ఏళ్లలో మద్యం సేవించే పురుషుల సంఖ్య తగ్గి, మహిళల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు తాజా అధ్యయనాలు తెల్పుతున్నాయి. ఒడిశాకు సంబంధించి NFHS నివేదిక ప్రకారం.. ఆ రాష్ట్రంలో 15 ఏళ్లు పైబడిన మహిళల్లో మద్యం వినియోగం 2015-16లో 2.4 శాతంగా ఉంది. ఇది 2020-21 నాటికి 4.3 శాతానికి పెరిగింది. ఐతే పురుషుల విషయంలో ఈ సంఖ్య 2015-16లో 39.3 శాతంగా ఉండగా, ఇది 28.8 శాతానికి తగ్గింది. పట్టణ ప్రజలు ఎక్కువగా మద్యం సేవిస్తారనే అపోహను కూడా ఈ నివేదిక కొట్టిపారేసింది. ఒడిశాలో పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకన్నా.. గ్రామీణ ప్రాంతాల్లో 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న పురుషులు, మహిళలు ఎక్కువగా మద్యం సేవిస్తున్నారని తాజా సర్వే వెల్లడించింది. ఈ సర్వే ప్రకారం.. గ్రామీణ పురుషుల్లో 30.2 శాతం మంది మద్యం సేవిస్తున్నారు. పట్టణ పురుషుల్లో 22.7 శాతం మంది మాత్రమే మందుబాబులున్నారన్నట్లు పేర్కొంది. ఐతే మహిళల విషయంలో ఈ గణాంకాలు విస్తు పోయేలా ఉన్నాయి. గ్రామీణ, పట్టణాలకు చెందిన మహిళలు వరుసగా 4.9 శాతం,1.4 శాతంగా ఉన్నారు.

ఆశ్చర్యం ఏంటంటే.. గ్రామీణ మహిళల్లో మద్యం వినియోగం 2.6 శాతం నుంచి 4.9 శాతానికి పెరగ్గా, పురుషుల విషయంలో మాత్రం 41.3 శాతం నుంచి 30.2 శాతానికి తగ్గింది. నివేదికలో గమనించదగ్గ మరో అంశం ఏమిటంటే.. గత ఐదేళ్లలో పట్టణ మహిళల మద్యపాన అలవాట్లలో గణనీయమైన మార్పులేమీ చోటుచేసుకోలేదట. ఈ సంఖ్య 1.3 శాతం నుంచి 1.4 శాతానికి మాత్రమే పెరిగినట్లు సర్వే తెల్పుతోంది. మద్యం మాత్రమే కాదు.. పొగ తాగడంలోనూ నారీ మనులు మగజాతిని ఓవర్‌టేక్‌ చేసేశారట. 2015-16లో కేవలం 17.3 శాతం మంది మహిళలకు మాత్రమే పొగాకు అలవాటు ఉండగా, తాజా సర్వే ప్రకారం ఈ సంఖ్య 26 శాతానికి చేరుకున్నట్లు తెలుస్తోంది.

ఇక నగరాల్లో ఐతే 16.6 శాతం మంది మహిళలు పొగాకుకు బానిసలవ్వగా, గ్రామాల్లో 26 శాతం మంది మహిళలు పొగాకును వినియోగిస్తున్నారు. పొగాకు వినియోగించే పురుషుల సంఖ్య 55.9 శాతం నుంచి 51.6 శాతానికి తగ్గింది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ సంఖ్య 58.8 శాతం నుంచి 54.1 శాతానికి, పట్టణ ప్రాంతాల్లో 45.3 శాతం నుంచి 40.5 శాతానికి తగ్గిందని తాజా సర్వే తెల్పుతోంది.

Also Read:

IRCON Recruitment 2022: రూ. లక్షకు పైగా జీతంతో ఇర్కాన్‌లో 40 అసిస్టెంట్‌ మేనేజర్‌ ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..