కాఫీలో ఉప్పు వేస్తే ఆ సమస్యలు తగ్గుతాయా.. ఈ కొత్త ట్రెండ్‌పై నిపుణులు ఏమంటున్నారంటే..?
Salt in Coffee: కాఫీలో చిటికెడు ఉప్పు కలిపే కొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. ఇది కాఫీ చేదును తగ్గించి, రుచిని మృదువుగా చేస్తుంది. కెఫిన్ వల్ల వచ్చే ఆందోళనను తగ్గిస్తుందని కొందరు అనుకున్నా, నిపుణులు అది నిజం కాదని చెబుతున్నారు. ఉప్పు ఆమ్ల స్వభావాన్ని తగ్గించి కడుపుకు హాయినిస్తుంది.

కాఫీ తాగేవారిలో కొత్త ట్రెండ్ మొదలైంది. కాఫీ చేదును తగ్గించడానికి, రుచిని మృదువుగా చేయడానికి ముఖ్యంగా కెఫిన్ వల్ల వచ్చే ఆందోళన, చిరాకును నివారించడానికి కాఫీలో చిటికెడు ఉప్పు కలపడం ఈ మధ్య వైరల్ అవుతున్న పద్ధతి. వైద్యులు చెప్పని విషయాన్ని తాను చెప్తున్నానంటూ రోమ్‌లోని ఒక కాఫీ తయారుచేసే నిపుణుడు రిలీజ్ చేసిన వీడియోతో ఈ విషయం బాగా వైరల్ అవుతోంది. అయితే ఇందులో ఎంత నిజం ఉంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ఉప్పు కలిపే సంప్రదాయం..?
ఇటలీ నుండి టర్కీ, మధ్యప్రాచ్యం వరకు అనేక సంస్కృతులు అప్పుడప్పుడు కాఫీలో ఉప్పు కలుపుతాయనేది నిజం. అయితే ఈ సంప్రదాయం ప్రధానంగా రుచిని పెంచడానికి ఉద్దేశించినదని నిపుణులు అంటున్నారు. ఉప్పు సహజంగా కాఫీలోని చేదును అణిచివేసి.. రుచిని పెంచుతుంది. డాక్టర్లు చెప్పేదాని ప్రకారం.. ఉప్పు కాఫీలోని ఆమ్ల స్వభావాన్ని కొద్దిగా తగ్గిస్తుంది. అందుకే ఉప్పు వేసిన కాఫీ కడుపులో అంత ఇబ్బంది పెట్టకుండా, కొంచెం మృదువుగా అనిపిస్తుంది.
నిపుణులు ఏమంటున్నారు?
ఉప్పు కాఫీ రుచిని మెరుగుపరుస్తుంది. క్లినికల్ న్యూట్రిషనిస్ట్ వరుషి లునావత్ మాట్లాడుతూ.. కాఫీ చేదును తగ్గించడానికి, దాన్ని మృదువుగా చేయడానికి ఒక చిటికెడు ఉప్పును కలుపుతారు. ఉప్పుకు చేదును అణిచివేసే గుణం ఉంది అని చెప్పారు.
కెఫిన్ టెన్షన్ తగ్గుతుందా..? అది అబద్ధం..?
వైరల్ వీడియోలో ఉప్పు వేస్తే కెఫిన్ వల్ల వచ్చే టెన్షన్, గుండెదడ, ఆందోళన తగ్గుతుందని చెబుతున్నారు. కానీ ఇది పూర్తిగా నిజం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కాఫీలో ఉండే కెఫిన్ మెదడును ఉత్తేజపరుస్తుంది. కార్టిసాల్‌ను పెంచుతుంది. ఉప్పు ఈ ప్రధాన ప్రభావాన్ని ఆపలేదు. అందుకే మీకు ఆందోళన లేదా దడ వచ్చే స్వభావం ఉంటే ఉప్పు వేసినా అది తగ్గకపోవచ్చు. ఉప్పు రుచిని మార్చినా కాఫీలో ఉండే ఆమ్ల స్వభావం మాత్రం మారదు.
మితంగా వాడడం మంచిది..
నిపుణుల సలహా ప్రకారం.. మీరు కాఫీ చేదు తగ్గించాలనుకుంటే, చాలా తక్కువ ఉప్పు మాత్రమే వాడాలి. అధిక రక్తపోటు, గుండె లేదా కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఉప్పును అస్సలు పెంచకూడదు. సోడియం ఎక్కువైతే వారికి ప్రమాదం. కాఫీ తాగేవారు రోజుకు ఒకటి లేదా రెండు కప్పులు మాత్రమే తాగడం ఆరోగ్యకరం. కాఫీలో ఉప్పు కలిపితే రుచి మెరుగై, కడుపుకు కొంచెం హాయిగా ఉంటుంది. కానీ కెఫిన్ ఇచ్చే ఆందోళన లేదా శక్తిని మాత్రం ఉప్పు మాయం చేయలేదు.
View this post on Instagram
మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




