Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC Alert: మీకు ఇలాంటి కాల్స్ వస్తే.. తస్మాత్ జాగ్రత్త..! హెచ్చరించిన ఐఆర్‌సీటీసీ..

Alert Rail Passengers: అలర్ట్ పేరుతో సైబర్ మోసాలకు తెరలేపుతున్నారు. మాయ మాటలతో మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీ చేస్తున్నారు. రైలు ప్రయాణికులు..

IRCTC Alert: మీకు ఇలాంటి కాల్స్ వస్తే.. తస్మాత్ జాగ్రత్త..! హెచ్చరించిన ఐఆర్‌సీటీసీ..
Alert Railway Passengers
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 21, 2022 | 7:37 AM

ఇటీవల కాలంలో మోసాగాళ్లు కొత్త పుంతలు తొక్కుతున్నారు. కొత్త దారులను ఎంచుకుంటున్నారు. అలర్ట్ పేరుతో సైబర్ మోసాలకు తెరలేపుతున్నారు. మాయ మాటలతో మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీ చేస్తున్నారు. రైలు ప్రయాణికులు అప్రమత్తం! టికెట్ వాపసు ప్రక్రియ పేరుతో జరిగే మోసాలను గుర్తించాలని పదే పదే హెచ్చరిస్తోంది భారతీయ రైల్వే. ఎలాంటి అనుమానాస్పద కాల్స్ లేదా లింక్‌లు వచ్చినా స్పందించవద్దని రైల్వే అధికారులు ప్రయాణికులను హెచ్చరిస్తున్నారు. ఇది ఆర్థిక మోసానికి దారితీసే అవకాశం ఉందని అలర్ట్ చేస్తున్నారు. ఆన్‌లైన్ టికెటింగ్ వినియోగం, UPI హ్యాండిల్ ద్వారా చెల్లింపులు పెరగడంతో IRCTC టిక్కెట్ రీఫండ్ ప్రక్రియలో మోసం కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.

తాజాగా  ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తూ రైల్వే అధికారుల ఓ ట్వీట్ చేశారు. ప్రయాణీకులకు అవగాహన కల్పించడానికి ప్రయత్నించారు. ఓ వ్యక్తి IRCTC నుంచి కాల్ చేస్తునానంటూ ఎలా ఫ్రాడ్ చేశారో వివరించారు. ఇలా కాల్ చేసిన సైబర్ నేరస్తుడు.. రీఫండ్ అమౌంట్ కోసం బ్యాంక్ వివరాలను అడిగాడు. ముందుగా “UPI ID, రీఫండ్ అమౌంట్ వంటి బ్యాంక్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అయితే IRCTC ఎప్పుడూ ఏ వ్యక్తిగత వివరాలను అడగదని తెలిపారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండాలని ట్విట్టర్‌లో హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

అయితే ఇలా జరిగిన మోసంపై IRCTC అధికారులు దీనిపై తక్షణమే చర్య తీసుకున్నారు. సంప్రదింపు వివరాలతో పాటు అతని PNR నంబర్‌ను షేర్ చేయవలసిందిగా Twitteratiని కోరారు. తరువాత, అధికారులు అతని ఫిర్యాదును తీసుకుని.. అతను ఇచ్చిన లింక్‌తో నేరస్థుడిని ట్రాక్ చేసి సహాయం చేసింది.

రైల్వే సేవా దాని గురించి ట్వీట్‌లో పేర్కొంది. “యూపీఐ హ్యాండిల్స్‌తో కూడిన వినియోగదారులతో ఆర్థిక మోసానికి దారితీయవచ్చు కాబట్టి ఎటువంటి లింక్‌లు లేదా అనుమానాస్పద కాల్‌లకు వెంటనే ప్రతిస్పందించవద్దని రైల్వే ప్రయాణికులను అభ్యర్థించారు. కొంతమంది ట్విట్టర్ ఫాలోవర్లు తమ బుకింగ్, రీఫండ్/టిడిఆర్, టిఎక్స్ఎన్ -ఐఆర్‌సిటిసి అఫీషియల్ గురించి ప్రశ్నను లేవనెత్తిన  ట్విట్టర్‌లోని ఐఆర్‌సిటిసి వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్నారు” అని ట్వీట్ చేశారు.

“అటువంటి వ్యక్తులు వేర్వేరు నంబర్‌ల నుంచి కాల్ చేసి కొన్ని లింక్‌లను పంపుతారు. తిరిగి చెల్లించే ప్రక్రియ పూర్తిగా స్వయంచాలకంగా ఉంటుంది. IRCTC రీఫండ్‌లలో మానవ జోక్యం ఉండదు. దయచేసి అలాంటి లింక్‌లు లేదా కాల్‌లకు ప్రతిస్పందించవద్దు -అధికారిక IRCTC ” అని మరొక ట్వీట్ చేసింది రైల్వే సేవా విభాగం.

మీ వివరాలు తమ సంస్థ ఎప్పుడూ అడగం.. ఖాతాకు సంబంధించిన వివరాలు చెప్పాలని రైల్వే విభాగం ప్రతినిధులుగానీ, తమ అధికారులుగానీ ఎప్పుడూ కోరరని IRCTC చెబుతుంది. గుర్తు తెలియని వ్యక్తుల నెంబర్ల నుంచి వచ్చే లింకులను తెరవడంతోపాటు ఖాతా వివరాలు ఎట్టి పరిస్థితుల్లోను చెప్పొద్దని సూచించింది. కస్టమర్లను మరింత అప్రమత్తం చేయడానికి IRCTC వారి వెబ్‌సైట్‌లో ఈ వివరాలను వెల్లడించింది.

జాతీయ వార్తల కోసం..

నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..
నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..
ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..
ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..
చేపల కోసం వల వేసిన మత్స్యకారులు.. వలలో చిక్కింది చూసి షాక్‌
చేపల కోసం వల వేసిన మత్స్యకారులు.. వలలో చిక్కింది చూసి షాక్‌
వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..
వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..
ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్‌ తింటే అద్భుత లాభాలు మీ సొంతం
ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్‌ తింటే అద్భుత లాభాలు మీ సొంతం
బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..
బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌
కాసులకు కక్కుర్తిపడితే ఊచలు తప్పవు..బెట్టింగ్ బంగార్రాజులకు షాక్
కాసులకు కక్కుర్తిపడితే ఊచలు తప్పవు..బెట్టింగ్ బంగార్రాజులకు షాక్
38 గంటలు కదలకుండా నిలబడ్డ యూట్యూబర్.. బుగ్గ గిల్లినా వీడియో
38 గంటలు కదలకుండా నిలబడ్డ యూట్యూబర్.. బుగ్గ గిల్లినా వీడియో