విమానాశ్రయాల్లో పాటించాల్సిన రూల్స్ ఇవే !

ఈ నెల 25 నుంచి దేశీయ విమానాలను పునరుధ్దరించనున్న నేపథ్యంలో..ప్రయాణికులకు ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కొన్ని ప్రత్యేక సూచనలు చేసింది. గైడ్ లైన్స్ విధించింది.విమానాశ్రయాలకు ట్యాక్సీలు, ప్రజా రవాణా అందుబాటులో ఉండేలా రాష్ట్ర ప్రభుత్వాలు చూడాలి. పార్కింగ్ ప్రదేశాల్లో రద్దీ ఏర్పడకుండా ట్రాఫిక్ పోలీసులు, సీఐఎస్ఎఫ్ వ్యవహరించాలి. ఎయిర్‌లైన్స్ సిబ్బంది, ప్రయాణికులు వ్యక్తిగత వాహనాలు లేదా రిజిస్టర్డ్ ట్యాక్సీలను పరిమిత సీటింగ్‌తో ఉపయోగించాలి. ప్రయాణికులు ప్రయాణ సమయానికి 2 గంటల ముందే విమానాశ్రయం చేరుకోవాలి. […]

విమానాశ్రయాల్లో పాటించాల్సిన రూల్స్ ఇవే !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 21, 2020 | 11:49 AM

ఈ నెల 25 నుంచి దేశీయ విమానాలను పునరుధ్దరించనున్న నేపథ్యంలో..ప్రయాణికులకు ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కొన్ని ప్రత్యేక సూచనలు చేసింది. గైడ్ లైన్స్ విధించింది.విమానాశ్రయాలకు ట్యాక్సీలు, ప్రజా రవాణా అందుబాటులో ఉండేలా రాష్ట్ర ప్రభుత్వాలు చూడాలి. పార్కింగ్ ప్రదేశాల్లో రద్దీ ఏర్పడకుండా ట్రాఫిక్ పోలీసులు, సీఐఎస్ఎఫ్ వ్యవహరించాలి. ఎయిర్‌లైన్స్ సిబ్బంది, ప్రయాణికులు వ్యక్తిగత వాహనాలు లేదా రిజిస్టర్డ్ ట్యాక్సీలను పరిమిత సీటింగ్‌తో ఉపయోగించాలి. ప్రయాణికులు ప్రయాణ సమయానికి 2 గంటల ముందే విమానాశ్రయం చేరుకోవాలి. ప్రయాణికులందరూ తప్పనిసరిగా ఆరోగ్యసేతు యాప్ ఉపయోగించాలి.

14ఏళ్ల లోపు పిల్లలకు మాత్రం ఆరోగ్యసేతు యాప్ నుంచి మినహాయింపు. ప్రయాణికులు టెర్మినల్ భవనంలోకి వెళ్లే ముందు థర్మల్ స్క్రీనింగ్ జోన్ నుంచి నడిచి వెళ్లాలి. అందుకు తగ్గట్టుగా విమానాశ్రయాల్లో థర్మల్ స్క్రీనింగ్ జోన్లను ఏర్పాటు చేయాలి. ఇందుకోసం గుర్తింపు పొందిన పరికరాలను ఉపయోగించాలి. సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వాలి. ఆరోగ్యసేతు యాప్‌లో గ్రీన్ చూపకపోతే ప్రయాణానికి అనుమతి లేదు.