Puducherry CM N Rangasamy: పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా రంగసామి ప్రమాణ స్వీకారం..

AINRC president N Rangasamy: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి ముఖ్య‌మంత్రిగా ఆలిండియా ఎన్ఆర్ కాంగ్రెస్ (ఏఐఎన్ఆర్‌సీ) అధినేత ఎన్. రంగ‌సామి

Puducherry CM N Rangasamy: పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా రంగసామి ప్రమాణ స్వీకారం..
Puducherry Cm N Rangasamy
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 07, 2021 | 2:39 PM

AINRC president N Rangasamy: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి ముఖ్య‌మంత్రిగా ఆలిండియా ఎన్ఆర్ కాంగ్రెస్ (ఏఐఎన్ఆర్‌సీ) అధినేత ఎన్. రంగ‌సామి ప్ర‌మాణ‌ స్వీకారం చేశారు. ఇన్‌ఛార్జ్ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్.. రంగసామితో ప్ర‌మాణ‌స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా రంగసామి తమిళంలో.. దైవసాక్షిగా ప్రమాణం చేశారు. పుదుచ్చేరి రాజ్‌భ‌వ‌న్‌లో ఘనంగా జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి కొద్ది మందిని మాత్ర‌మే అనుమతించారు. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా ప్ర‌మాణ‌స్వీకార కార్య‌క్ర‌మాన్ని నిర్వహించారు. పుదుచ్చేరి సీఎంగా ప్ర‌మాణం చేసిన రంగ‌సామికి లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసైతో పాటు ప‌లువురు ప్రముఖులు శుభాకాంక్ష‌లు తెలియజేశారు.

ఏప్రిల్‌ 6న జరిగిన ఎన్నికల్లో ఆలిండియా ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ 10 స్థానాలను గెలుచుకుంది. ఎన్ఆర్ కాంగ్రెస్ మిత్ర‌ప‌క్షం బీజేపీ 6చోట్ల విజయం సాధించింది. పుదుచ్చేరిలో మొత్తం 30 అసెంబ్లీ స్థానాలుండగా.. ఎన్డీయే కూటమి 16 స్థానాలు సాధించింది. మరో ఆరుగురు స్వతంత్రులు సభకు ఎన్నికవగా.. వారంతా రంగసామి మద్దతుదారులే కావడం విశేషం. డీఎంకే 13 స్థానాల్లో పోటీ చేయగా ఆరు, కాంగ్రెస్‌ 14 స్థానాల్లో పోటీ చేయగా.. రెండింట విజయం సాధించింది.

కాగా.. అంతకుముందు రంగసామి 2001లో మొదటిసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. ఆ తర్వాత 2006లో రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం మంత్రివర్గ సహచరులతో భేదాభిప్రాయాలు రావడంతో 2008లో రాజీనామా చేశారు. అనంతరం రంగసామి.. 2011లో కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ పేరుతో సొంత పార్టీ ఏర్పాటు చేశారు.

Also Read:

MK Stalin Swearing-in ceremony: తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎంకే స్టాలిన్ ప్రమాణ స్వీకారం.. మంత్రివర్గంలో గాంధీ, నెహ్రు..

Municipal Elections: తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికల చివరి ఘట్టం.. మేయర్..చైర్మన్..వైస్ చైర్మన్ ఎన్నిక ఈరోజు!