Municipal Elections: తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికల చివరి ఘట్టం.. మేయర్..చైర్మన్..వైస్ చైర్మన్ ఎన్నిక ఈరోజు!

Telangana Municipal Elections: తెలంగాణాలో ఇటీవల జరిగిన రెండు మున్సిపల్ కార్పోరేషన్, ఐదు మున్సిపాలిటీల మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు పరోక్ష పద్ధతిలో ఈరోజు మధ్యాహ్నం ఎన్నిక జరగనుంది. అయితే, ఈ ఎన్నిక లాంఛనమే కానుంది.

Municipal Elections: తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికల చివరి ఘట్టం.. మేయర్..చైర్మన్..వైస్ చైర్మన్ ఎన్నిక ఈరోజు!
Telangana Municipal Elections
Follow us
KVD Varma

|

Updated on: May 07, 2021 | 9:24 AM

Municipal Elections: తెలంగాణాలో ఇటీవల జరిగిన రెండు మున్సిపల్ కార్పోరేషన్, ఐదు మున్సిపాలిటీల మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు పరోక్ష పద్ధతిలో ఈరోజు మధ్యాహ్నం ఎన్నిక జరగనుంది. అయితే, ఈ ఎన్నిక లాంఛనమే కానుంది. ఈ ఎన్నికలు జరిగిన వరంగల్, ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్లు, సిద్ధిపేట, జడ్చర్ల, అచ్చంపేట, కొత్తూరు, నకిరేకల్ మున్సిపాల్టీల్లో తెలంగాణా రాష్ట్ర సమితి మేజర్ వార్డులు గెలుచుకుంది. దీంతో ఇక్కడ ఇక మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్మన్ లు , వైస్ చైర్మన్లు ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్ధులే ఎంపిక కానున్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పూర్తి మెజార్టీ సాధించినందున ఇతర పార్టీలు, కో ఆప్షన్ సభ్యుల మద్దతు లేకుండానే టీఆర్ఎస్ ఖాతాలో ఈ పదవులు చేరనున్నాయి.

అయినప్పటికీ, ఇబ్బందులు లేకుండా ఉండేందుకు వరంగల్, ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్లతోపాటు సిద్దిపేట, అచ్చం పేట, జడ్చర్ల, నకిరేకల్, కొత్తూరు మున్సిపాలిటీలకు రెండు రోజుల క్రితమే టీఆర్‌ఎస్‌ పరిశీలకులను నియమించింది. ఇక వీరి ఎన్నిక కోసం ఇప్పటికే ఆయా ప్రాంతాల పరిధిలోని మంత్రులు, స్థానిక టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని తీసుకుని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ ఆశావహుల జాబితాను సిద్ధం చేశారు. పేర్లను కూడా సీల్డ్ కవర్లలో పార్టీ పరిశీలకులకు అందచేశారు.

ఈ ఎన్నికలు ఈరోజు (శుక్రవారం) మధ్యాహ్నం 3:30 గంటలకు జరుగుతాయి. పార్టీ కొత్త కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో పరిశీలకులు శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు సమావేశమవుతారు. ఎన్నిక జరిగే తీరుతెన్నులను వివరించడంతోపాటు, సీల్డ్‌ కవర్‌లోని పార్టీ నిర్ణయాన్ని కూడా తెలియచేస్తారు. కాగా, రిజర్వేషన్‌ కేటగిరీ, విధేయత, సీనియారిటీ తదితరాలను ప్రాతిపదికగా తీసుకుని కేసీఆర్‌ మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్‌ చైర్మన్‌ అభ్యర్థుల పేర్లను ఖరారు చేసినట్లు సమాచారం. ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం వరంగల్ కార్పోరేషన్ కు గుండు సుధారాణి, సిద్ధిపేట మున్సిపాలిటీకి కడవేర్గు మంజుల లేదా కొండం కవిత, అచ్చంపేట మున్సిపాలేతీకి నరసింహ గౌడ్ లేదా పొరెడ్డి శైలజ, జడ్చర్ల దోరేపల్లి లక్ష్మి, కొత్తూరు కరుణ లేదా లావణ్య, నకిరేకల్ రాచకొండ శ్రీనివాస్ లేదా కొండ శ్రీను గౌడ్ పేర్లు ఆశావహుల జాబితాలో ఉన్నాయి. వీరి నుంచే ఎంపిక జరిగినట్టు ప్రచారం అవుతోంది.

Also Read: Telangana Police: ఆద‌ర్శంగా నిలుస్తోన్న‌ తెలంగాణ పోలీసులు.. ఇంట్లో చికిత్స పొందుతోన్న కోవిడ్ బాధితుల‌కు ఉచితంగా..

Khammam: కౌన్ బనేగా ఖమ్మం కార్పొరేషన్ మేయర్.. కుస్తీ పడుతున్న ముఖ్యనేతలు.. నేతలను ప్రసన్నం చేసుకుంటున్న కార్పొరేటర్లు