Telangana Police: ఆద‌ర్శంగా నిలుస్తోన్న‌ తెలంగాణ పోలీసులు.. ఇంట్లో చికిత్స పొందుతోన్న కోవిడ్ బాధితుల‌కు ఉచితంగా..

Telangana Police: కంటికి క‌నిపించ‌ని ఓ సూక్ష్మ జీవి ప్ర‌పంచ దేశాల‌ను వ‌ణికిస్తోంది. ప్ర‌దేశానికి ఒక ర‌కంగా త‌న రూపాన్ని మార్చుకుంటూ మృత్యు కేళీని కొన‌సాగిస్తోంది. ప్ర‌త్య‌క్షంగా ప‌రోక్షంగా ప్ర‌తీ ఒక్క‌రూ...

Telangana Police: ఆద‌ర్శంగా నిలుస్తోన్న‌ తెలంగాణ పోలీసులు.. ఇంట్లో చికిత్స పొందుతోన్న కోవిడ్ బాధితుల‌కు ఉచితంగా..
Telangana Police
Follow us
Narender Vaitla

|

Updated on: May 07, 2021 | 6:01 AM

Telangana Police: కంటికి క‌నిపించ‌ని ఓ సూక్ష్మ జీవి ప్ర‌పంచ దేశాల‌ను వ‌ణికిస్తోంది. ప్ర‌దేశానికి ఒక ర‌కంగా త‌న రూపాన్ని మార్చుకుంటూ మృత్యు కేళీని కొన‌సాగిస్తోంది. ప్ర‌త్య‌క్షంగా ప‌రోక్షంగా ప్ర‌తీ ఒక్క‌రూ ఈ మ‌హమ్మారి కారణంగా ఏదో ర‌కంగా ప్ర‌భావిత‌మ‌వుతున్నారు. అయితే కాస్త డ‌బ్బులు ఎక్కువ ఉన్న వారు ఏదో ర‌కంగా గండం నుంచి గ‌ట్టెక్కుతున్నారు. కానీ తిన‌డానికి తిండి లేని పేద ప్ర‌జ‌లు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్ర‌మంలోనే పేద ప్ర‌జ‌లకు అండ‌గా నిలుస్తూ తెలంగాణ పోలీసులు ఓ వినూత్న కార్య‌క్రమానికి శ్రీకారం చుట్టారు. స‌మాజ సేవ‌లో ఎప్పుడూ ముందు వ‌రుస‌లో ఉండే తెలంగాణ పోలీసులు తాజాగా కోవిడ్ బాధితుల‌కు అండ‌గా నిలిచారు. క‌రోనా కార‌ణంగా ఇబ్బంది ప‌డుతోన్న వారికి ఉచితంగా మధ్యాహ్న భోజ‌నాన్ని అందించే కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించ‌నున్నారు. ఇంట్లో చికిత్స తీసుకుంటున్న వారికి ఉచితంగా భోజ‌నం అందించ‌నున్నారు. ఈ గొప్ప కార్య‌క్ర‌మాన్ని స‌త్య‌సాయి సేవా సంస్థ‌, ప్ర‌ముఖ ఫుడ్ డెలివ‌రీ సంస్థ స్విగ్గి, బిగ్‌ బాస్కెట్‌, హోప్‌ సంస్థలతో కలిసి ‘సేవా భోజనం’ పేరిట పథకాన్ని ప్రారంభించారు. ఈ ఉచితం భోజ‌నం కోరుకునే వారు ప్ర‌తి రోజూ ఉద‌యం ఏడు గంట‌ల్లోగా 7799616163 వాట్సాప్‌ నంబర్‌ను సంప్రదించాల్సి ఉంటుందని పోలీసులు తెలిపారు. హోం ఐసోలేషన్‌లో ఉన్న పిల్లలు, వృద్ధులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు పోలీసు శాఖ తెలిపింది. తెలంగాణ పోలీసులు తీసుకున్న ఈ నిర్ణ‌యం నిజంగా ఆద‌ర్శ‌నీయం క‌దూ..!

Also Read: Corona Variants: కరోనా వైరస్‌ రూపాంతరాలు… 3 నెలలకో కొత్త రకం! 14 నెలల్లో 4 వైరస్‌లు!!

తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే బస్సులు బంద్‌.. ముందస్తు రిజర్వేషన్ సేవలు రద్దు.. కారణాలు ఇలా ఉన్నాయి..?

South Central Railway: దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన..! 30 రైళ్లు తాత్కాలికంగా రద్దు..