MK Stalin Swearing-in ceremony: తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎంకే స్టాలిన్ ప్రమాణ స్వీకారం.. మంత్రివర్గంలో గాంధీ, నెహ్రు..
New Tamil Nadu CM 2021 MK Stalin: తమిళనాడు 14వ ముఖ్యమంత్రిగా డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ప్రమాణస్వీకారం చేశారు....
MK Stalin Oath Taking: తమిళనాడు 14వ ముఖ్యమంత్రిగా డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ప్రమాణస్వీకారం చేశారు. స్టాలిన్‌తో గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ ప్రమాణ స్వీకారం చేయించారు. కరోనా తీవ్రత దృష్ట్యా నిరాడంబరంగా ప్రమాణస్వీకారోత్సవం జరిగింది. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, కాంగ్రెస్ కూటమి ఘన విజయం సాధించిన సంగతి విదితమే. 234 స్థానాలకు గానూ డీఎంకే కూటమి 133 సీట్లు గెలిచి బంపర్ విక్టరీ సాధించింది.
మరో 34 మంత్రులు కూడా స్టాలిన్ తో పాటు ప్రమాణం చేశారు. కరుణానిధి మంత్రివర్గంలో పని చేసిన వారికి స్టాలిన్ మరోసారి అవకాశమిచ్చారు. ఆయన మంత్రివర్గంలో ఇద్దరు మహిళలు, ఇద్దరు మైనారిటీలకు స్థానం దక్కింది.
దురైమురుగన్, కెఎన్. నెహ్రూ, ఐ. పెరియస్వామి, పొన్ముడి, వేలు, ఎంఆర్‌కే పన్నీర్‌సెల్వం, కేకేఎస్‌ఆర్ రామచంద్రన్, తంగం తెన్నరసు, రఘుపతి, ముత్తుస్వామి, పెరయకుప్పన్, టీఎం. అన్బరసన్, ఎంపీ స్వామినాథన్, గీతా జీవన్, అనితా రాధాకృష్ణన్, రాజకన్నప్పన్, కె. రామచంద్రన్, చక్రపాణి, వి. సెంథిల్ బాలాజీ, ఆర్. గాంధీ, ఎం సుబ్రమణియన్, పి. మూర్తి, ఎస్‌ఎస్ శివశంకర్, పీకె. శేఖర్‌బాబు, పళనివేల్ త్యాగరాజన్, ఎస్‌ఎం. నాజర్, సెంజి కేఎస్ మస్తాన్, అన్బిల్ మహేష్ పొయ్యామొళి, ఎస్‌వీ గణేశన్, మనో తంగరాజ్, మదివేందన్, కయల్‌విళి సెల్వరాజ్ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు.
LIVE NEWS & UPDATES
-
స్టాలిన్ కు శుభాకాంక్షల వెల్లువ..
తమిళనాడు నూతన ముఖ్యమంత్రి పదవి చేపట్టిన డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌కు సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
-
స్టాలిన్ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న మంత్రులు వీరే
దురైమురుగన్, కెఎన్. నెహ్రూ, ఐ. పెరియస్వామి, పొన్ముడి, వేలు, ఎంఆర్‌కే పన్నీర్‌సెల్వం, కేకేఎస్‌ఆర్ రామచంద్రన్, తంగం తెన్నరసు, రఘుపతి, ముత్తుస్వామి, పెరయకుప్పన్, టీఎం. అన్బరసన్, ఎంపీ స్వామినాథన్, గీతా జీవన్, అనితా రాధాకృష్ణన్, రాజకన్నప్పన్, కె. రామచంద్రన్, చక్రపాణి, వి. సెంథిల్ బాలాజీ, ఆర్. గాంధీ, ఎం సుబ్రమణియన్, పి. మూర్తి, ఎస్‌ఎస్ శివశంకర్, పీకె. శేఖర్‌బాబు, పళనివేల్ త్యాగరాజన్, ఎస్‌ఎం. నాజర్, సెంజి కేఎస్ మస్తాన్, అన్బిల్ మహేష్ పొయ్యామొళి, ఎస్‌వీ గణేశన్, మనో తంగరాజ్, మదివేందన్, కయల్‌విళి సెల్వరాజ్ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు.
-
-
స్టాలిన్ తో పాటు మరో 34 మంత్రులు ప్రమాణం
తమిళనాడు నూతన సీఎంగా ఎంకే స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మరో 34 మంత్రులు కూడా ప్రమాణం చేస్తున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవం రాజ్ భవన్ లో నిరాడంబరంగా జరుగుతోంది.
-
తమిళనాడు కొత్త సీఎంగా స్టాలిన్ ప్రమాణం..
తమిళనాడు రాష్ట్రానికి 14వ ముఖ్యమంత్రిగా ద్రవిడ మున్నేట్ర కళగం(డీఎంకే) అధినేత ఎంకే స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ స్టాలిన్ తో ప్రమాణ స్వీకారం చేయించారు.
-
జర్నలిస్టులు ఇక ఫ్రంట్‌లైన్ వారియర్లు..
తమిళనాడులో వివిధ మాధ్యమాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులను ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా పరిగణిస్తామని కొత్త సీఎం స్టాలిన్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. కరోనా సమయంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న విలేకరుల సేవలను కొనియాడారు. జర్నలిస్టుల హక్కులను కాపాడుతూ తగిన రాయితీలను కల్పిస్తామని హామీ ఇచ్చారు.
-
-
తమిళనాడు కొత్త సీఎంగా ఎంకే స్టాలిన్ ప్రమాణ స్వీకారం..
తమిళనాడు కొత్త సీఎంగా ఎంకే స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించగా.. స్టాలిన్ ప్రభుత్వం 34 మంత్రులతో కొలువు తీరనుంది.
-
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేలోపే.. కరోనా కట్టడికి ఆదేశాలు
డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేలోపే ప్రభుత్వ పాలనలో మునిగిపోయారు. కరోనా పరిస్థితులను తెలుసుకుంటూ తగిన ఆదేశాలు జారీ చేస్తున్నారు. మంగళవారం రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తమిళనాడు ప్రభుత్వాస్పత్రుల్లో కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్న నర్సులు తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని కొంతకాలంగా కోరుతున్నారు. ఇదే డిమాండ్‌పై అనేకసార్లు ఆందోళనలు, ధర్నాలు చేపట్టారు. డీఎంకే అధికారంలోకి వస్తే కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్న నర్సులను క్రమబద్ధీకరిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో స్టాలిన్ హామీ ఇచ్చారు.
-
కాబోయే మంత్రుల పేర్లతో జాబితా ఇదేనా…
డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడుకు కాబోయే ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అదేవిధంగా తన నూతన క్యాబినెట్‌ను కొలువుదీర్చారు. ఈ మేరకు 34 మంది పేర్లతో జాబితా వెల్లడించారు. ఈ 34 మంది కాబోయే మంత్రుల పేర్లతో కూడిన జాబితాకు తమిళనాడు గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ కూడా ఆమోదం తెలిపారు. కొత్త జాబితాలోని వివరాల ప్రకారం.. సీనియర్ నాయకుడు సుబ్రమణ్యానికి ఆరోగ్యశాఖ, మరో సీనియర్ నేత దురై మురుగన్‌కు నీటిపారుదల శాఖ కేటాయించినట్లు సమాచారం.
-
తమిళనాడు సీఎంగా స్టాలిన్ ప్రమాణ స్వీకారం
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ విక్టరీ కొట్టిన డిఎంకే అధినేత స్టాలిన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు రంగం సిద్దమైంది.
Published On - May 07,2021 9:44 AM