Remdesivir Injection: కేంద్రం కీలక నిర్ణయం.. అతి తక్కువ ధరకే రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్.. ఎలా పొందాలంటే..!
Remdesivir Injection: భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ రావడం.. ఆస్పత్రులకు కోవిడ్ పేషెంట్ల రాక పెరగడం... చాలా మంది డాక్టర్లు ప్రాణాపాయం నుంచి కాపాడేందుకు అంటూ రెమ్‌డెసివిర్.
Remdesivir Injection: భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ రావడం.. ఆస్పత్రులకు కోవిడ్ పేషెంట్ల రాక పెరగడం… చాలా మంది డాక్టర్లు ప్రాణాపాయం నుంచి కాపాడేందుకు అంటూ రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్ (Remdesivir) ఇస్తుండటంతో.. ఇప్పుడు వాటికి విపరీతమైన డిమాండ్ ఉంది. అయితే పేషెంట్ల బంధువులు బ్లాక్‌మార్కెట్‌లో వేలకు వేలు పెట్టి దాన్ని కొంటున్నారు. ఇదో రకమైన బిజినెస్ అయిపోయింది. అయితే చాలా మంది బ్లాక్ మార్కెట్ ద్వారా ఈ ఇంజెక్షన్‌ను కొనుగోలు చేస్తూ నిలువునా మోసపోతున్నారు. దీనిపై బ్లాక్ దందా ఎక్కువైపోవడంతో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ప్రధాన మంత్రి భారతీయ జన ఔషాధి యోజన పథకంలో తక్కువ ధరకే రెమ్‌డెసివిర్ కొనుగోలు చేయవచ్చు. ఎవరికైనా కావాలంటే సదరు లింక్‌ను ఓపెన్ చేసి ఈ వెబ్‌సైట్ ద్వారా రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్‌ను పొందవచ్చు. అయితే భారతదేశంలో దాదాపు ప్రతి నగరంలో ప్రధాన్ మంత్రి జన ఔషాధి కేంద్రాలు ఉన్నాయి. దీని ద్వారా అతి తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి. కేవలం రూ.899లకే లభ్యమయ్యే అవకాశం ఉంది.
పేషెంట్ల హాస్పిటలైజేషన్ పిరియడ్‌ను కొంత వరకు తగ్గించడంలో ఈ రెమ్‌డెసివిర్ ఉపయోగపడుతుందని ఎఫ్‌డీఏ అంచనావేస్తోంది. పేషెంట్ల ప్రాణాలను కాపాడడమే ఇప్పుడు ముఖ్యం కావడంతో డాక్టర్లు రెమ్‌డెసివిర్ మీదే ఆధారపడుతున్నారు. మరొక యాంటి వైరల్ డ్రగ్ లేకపోవడంతో రెమిడెసివిర్‌ను వాడుతున్నారు. దీంతో ఈ మెడిసిన్ డిమాండ్ అమాంతం పెరిగింది. అయితే భారత్‌లో ఈ ఇంజెక్షన్ కొరత లేకుండా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. దీని వల్ల ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది.
కొనుగోలు చేయాలంటే ఇవి తప్పనసరి..
1. పేషెంట్ ఆధార్ 2. కోవిడ్ పాజిటివ్ రిపోర్టు 3. ఒరిజినల్ వైద్యుడి ప్రిస్క్రిప్షన్ 4. ఔషధం పొందే వ్యక్తి ఆధార్ అయితే ఇలా తక్కువ ధరకే రెమిడెసివిర్ ఇంజెక్షన్ కావాలంటే ఇవి తప్పకుండా కావాలి. వెబ్‌సైట్‌లోకి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్ పొందేందుకు లింక్.. http://janaushadhi.gov.in/StoreDetails.aspx