AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Work from Home: ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. ఇకపై ఇంటి నుంచి విధులు నిర్వహించేందుకు కేంద్రం అనుమతి

కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడిలో భాగంగా వీలు ఉన్న అన్ని శాఖల ఉద్యోగులు పూర్తిగా ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటు కల్పించింది.

Work from Home: ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. ఇకపై ఇంటి నుంచి విధులు నిర్వహించేందుకు కేంద్రం అనుమతి
Central Govt Allows More Employees To Work From Home
Balaraju Goud
|

Updated on: May 07, 2021 | 2:42 PM

Share

Govt. Employees To Work From Home: దేశవ్యాప్తం కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడిలో భాగంగా వీలు ఉన్న అన్ని శాఖల ఉద్యోగులు పూర్తిగా ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటు కల్పించింది. గర్భిణీ స్త్రీలు, వికలాంగ ఉద్యోగులు పూర్తిగా ఇంటి నుంచే పని చేసే అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ-డీఓపీటీ ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యంగా కంటైన్‌మెంట్ జోన్‌లో నివసించే ఉద్యోగులు, అధికారులు కూడా ఇంటి నుంచే పనిచేసేందుకు అనుమతినిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో విధులకు హాజరయ్యే అధికారులు, ఉద్యోగులు కోవిడ్ నిబంధనలను తప్పక పాటించాలని సూచించింది. మే 31 వరకు ఈ ఉత్తర్వులు అమలులో ఉంటాయని పేర్కొంది. ఇందుకు అనుగుణంగా కొత్తగా మార్గదర్శకాలను జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం.

ఇప్పటికే కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఉన్న 50 శాతం మంది ఉద్యోగులు ఇంటి నుంచే బాధ్యతలు నిర్వర్తించేందుకు అనుమతినిచ్చింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్‌ 19న ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని మరింత విస్తరిస్తూ తాజా ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సంస్థలలో పనిచేసే గ్రూప్‌ బీ, గ్రూప్‌ సీ స్థాయి ఉద్యోగులకు వర్తిస్తాయి. కాగా, గ్రూప్‌ ఏ స్థాయి అధికారులకు పనిగంటల్లో వెసులుబాటు లభిస్తోంది.

Read Also… .బాలకృష్ణకు జోడీగా పవన్ హీరోయిన్.. మరోసారి లక్కీ హీరోయిన్‏కే ఛాన్స్ ఇవ్వనున్న డైరెక్టర్..