AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్లాస్మా దానం నిజంగా కొవిడ్‌ను నయం చేస్తుందా..? ప్లాస్మాను ఎప్పుడు, ఎలా దానం చేయాలో తెలుసుకోండి..

Plasma Donation : దేశంలో కరోనా విలయతాండవం చేస్తుంది. ప్రతిరోజూ అధిక సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.

ప్లాస్మా దానం నిజంగా కొవిడ్‌ను నయం చేస్తుందా..? ప్లాస్మాను ఎప్పుడు, ఎలా దానం చేయాలో తెలుసుకోండి..
Plasma Therapy
uppula Raju
|

Updated on: May 07, 2021 | 2:47 PM

Share

Plasma Donation : దేశంలో కరోనా విలయతాండవం చేస్తుంది. ప్రతిరోజూ అధిక సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా వైరస్‌తో బాధపడుతున్న వారిలో ప్లాస్మాకు డిమాండ్ పెరిగింది. మరోవైపు ప్లాస్మా దానం చేస్తే మళ్లీ కరోనాకు గురవుతారనే అపోహలు హల్‌చల్‌ చేస్తున్నాయి. చాలా మంది వైద్యులు ప్రజలు ముందుకు వచ్చి ప్లాస్మా దానం చేయమని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎందుకంటే ఇది చాలా మంది ప్రాణాలను కాపాడుతుందని చెబుతున్నారు.

ప్లాస్మా థెరపీ అనేది ఒక చికిత్స. కరోనా నుంచి కోలుకున్న వారి నుంచి వీటిని సేకరిస్తారు. ప్లాస్మా అంటే రక్తం నుంచి తొలగించబడిన ద్రవ పదార్థం. ఇందులో తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు, ప్లేట్‌లెట్స్ ఇతర సెల్యులార్ భాగాలు ఉంటాయి. వీటిని కరోనా రోగుల రక్తంలో ప్రవేశపెడతారు. తద్వారా మనిషిని బతికిస్తారు. కరోనా వైరస్ నుంచి కోలుకున్న 30-40 రోజుల తరువాత, ప్లాస్మాను దానం చేయవచ్చు. ఈ సమయానికి కోలుకున్న వైరస్ ఉన్న వ్యక్తి శరీరంలో తగినంత ప్రతిరోధకాలు అభివృద్ధి చెందుతాయి.18 ఏళ్లు పైబడిన వారు, కనీసం 50 కిలోల బరువున్నవారు ప్లాస్మాను దానం చేయవచ్చు.

అమెరికన్ రెడ్ క్రాస్ ప్రకారం.. మీరు సంవత్సరానికి 13 సార్లు ప్లాస్మాను దానం చేయవచ్చు. అయితే కరోనా వైరస్ నుంచి కోలుకున్న వారు ప్రతి రెండు వారాలకు ప్లాస్మాను దానం చేయవచ్చని చాలా మంది వైద్యులు తెలిపారు. ప్లాస్మా థెరపీని నిష్క్రియాత్మక రోగనిరోధక శక్తి అని పిలుస్తారు ఎందుకంటే ఇది కోవిడ్ -19 సోకిన వ్యక్తి శరీరానికి ప్రతిరోధకాలను బదిలీ చేయడానికి సహాయపడుతుంది. హ్యూస్టన్ మెథడిస్ట్ నెట్‌వర్క్ ఆఫ్ హాస్పిటల్స్ ప్రకారం ఇది ప్రభావవంతంగా ఉంటుంది. మరణాలను తగ్గిస్తుంది. ప్లాస్మాతో చికిత్స పొందిన వ్యక్తులు వేగంగా కోలుకుంటారు వారి సొంత ప్రతిరోధకాలను అభివృద్ధి చేయగలరని పరిశోధనలో తేలింది.

Work from Home: ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. ఇకపై ఇంటి నుంచి విధులు నిర్వహించేందుకు కేంద్రం అనుమతి

Puducherry CM N Rangasamy: పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా రంగసామి ప్రమాణ స్వీకారం..