AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేంద్రం బెదిరింపులతో ఇండియా వదిలి బ్రిటన్ వెళ్లిన ఆదార్ పూనావాలా….మహారాష్ట్ర మంత్రి సంచలన వ్యాఖ్య

సీరం సంస్థ సీఈఓ ఆదార్ పూనావాలాపై మహారాష్ట్రలో ఎన్సీపీకి చెందిన మంత్రి ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. జూన్ నెలలో మహారాష్ట్రకు 1.5 కోట్ల డోసుల వ్యాక్సిన్ ఇస్తామని ఆదార్ నేతృత్వంలోని సీరం కంపెనీ హామీ ఇచ్చిందని

కేంద్రం బెదిరింపులతో  ఇండియా వదిలి బ్రిటన్  వెళ్లిన  ఆదార్ పూనావాలా....మహారాష్ట్ర మంత్రి సంచలన వ్యాఖ్య
Adar Poonawalla
Umakanth Rao
| Edited By: Phani CH|

Updated on: Jun 07, 2021 | 2:44 PM

Share

సీరం సంస్థ సీఈఓ ఆదార్ పూనావాలాపై మహారాష్ట్రలో ఎన్సీపీకి చెందిన మంత్రి ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. జూన్ నెలలో మహారాష్ట్రకు 1.5 కోట్ల డోసుల వ్యాక్సిన్ ఇస్తామని ఆదార్ నేతృత్వంలోని సీరం కంపెనీ హామీ ఇచ్చిందని, కానీ కేంద్రం హెచ్చరికతో వెనుకంజ వేసిందని హసన్ ముష్రిఫ్ అనే ఈ మంత్రి చెప్పారు. మహారాష్ట్రతో మీ ‘డీల్’ ఏమిటంటూ కేంద్రం ఆదార్ పూనావాలాను గట్టిగా నిలదీయడంతో ఆయన భయంతో ఇండియా వదిలి లండన్ వెళ్లిపోయారని ముష్రిఫ్ తెలిపారు. తమ సంస్థ ఉత్పత్తి చేస్తున్న కోవీషీల్డ్ వ్యాక్సిన్ ఎక్కువగా కావాలంటూ ఇండియాలోని ‘పవర్ ఫుల్’ వ్యక్తుల నుంచి తనకు ఫోన్ కాల్స్ వచ్చాయని ఆదార్ గతనెలలో వెల్లడించిన విషయం ఈ సందర్భంగా గమనార్హం వ్యాక్సిన్ తయారీ అన్నదిక్లిష్టమైనదని, ఒక్క రాత్రిలో ఉత్పత్తిని పెంచజాలమని ఆయన నాడు అన్నారు. పైగా దేశంలో జనాభా చాలా ఎక్కువని, అందరికీ టీకామందులు ఒకేసారి అసాధ్యమని కూడా ఆయన వ్యాఖ్యానించారు. గతంలో లండన్ వెళ్లి అక్కడ కొన్ని వారాలు గడిపారు. ఇండియాలో వ్యాక్సిన్ కొరత తీవ్రంగా ఉన్నప్పుడు ఆయన లండన్ పర్యటన వివాదాస్పదమైంది.

ఇక్కడే ఉండి వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచడానికి బదులు ఆయన లండన్ ఎందుకు వెళ్లారని అనేకమంది రాజకీయ ప్రముఖులు ప్రశ్నించారు. కానీ కొన్ని కారణాల వల్ల తాను తప్పనిసరిగా లండన్ వెళ్లాల్సి వచ్చిందని ఆయన అప్పట్లో పేర్కొన్నారు. టీకామందుల ఉత్పత్తిని పెంచాలని ఎవరూ ఎవరిని శాసించజాలరని కాస్త కటువుగానే పేర్కొన్నారు. కాగా- ఆదార్ యూకే పర్యటనపై మహారాష్ట్ర మంత్రి ఒకరు ఇలా వ్యాఖ్యానించడం ఇదే మొదటిసారి.

మరిన్ని ఇక్కడ చూడండి: వ్యాక్సినేషన్ విధుల్లో ఇక పోలింగ్ బూత్ ఆఫీసర్లు….ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయం.. వార్డుల వారీగా టీకామందుల కార్యక్రమం

Coronavirus Variants: మరో డేంజరస్‌ వేరియంట్‌..ఏడు రోజుల్లో వెయిట్‌ లాస్‌ !..ఇవిగో వివ‌రాలు