Coronavirus Variants: మరో డేంజరస్‌ వేరియంట్‌..ఏడు రోజుల్లో వెయిట్‌ లాస్‌ !..ఇవిగో వివ‌రాలు

కరోనా మహమ్మారి ఎప్పటికప్పుడూ దాని రూపాన్ని మార్చుకుంటూ మ‌రింత ప్ర‌మాద‌కంగా మారుతోంది. ఈ క్రమంలో క‌రోనా కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. తాజాగా...

Coronavirus Variants: మరో డేంజరస్‌ వేరియంట్‌..ఏడు రోజుల్లో వెయిట్‌ లాస్‌ !..ఇవిగో వివ‌రాలు
Corona New Varient
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 07, 2021 | 2:40 PM

కరోనా మహమ్మారి ఎప్పటికప్పుడూ దాని రూపాన్ని మార్చుకుంటూ మ‌రింత ప్ర‌మాద‌కంగా మారుతోంది. ఈ క్రమంలో క‌రోనా కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. తాజాగా భార‌త్‌లో మ‌రో ప్ర‌మాద‌క‌ర క‌రోనా వేరియంట్‌ను గుర్తించారు. ఈ వేరియంట్ బారిన ప‌డిన వారు ఏడు రోజుల్లో తమ బరువు కోల్పోతారు. గ‌తంలో ఈ వేరియంట్‌ను బ్రెజిల్‌లో గుర్తించారు. ఇటీవల కరోనా వైరస్‌కు చెందిన‌ రెండు కొత్త వేరియంట్లు బ్రెజిల్ నుంచి భారతదేశంలోకి ప్ర‌వేశించాయ‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. భార‌త్‌లో క‌నిపించిన ఈ కొత్త వేరియంట్ పేరు B.1.1.28.2. ప్రస్తుత సమాచారం ప్రకారం శాస్త్రవేత్తలు ఈ వేరియంట్‌ను ఎలుకల‌పై పరీక్షించ‌గా పలు షాకింగ్‌ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఈ న్యూ వేరియంట్ సోకితే.. ఏడు రోజుల్లోనే దానిని సులభంగా గుర్తించవచ్చని శాస్త్రవేత్తలు క‌నుగొన్నారు. అలాగే ఇది చాలా ప్రమాదకరమైనద‌ని, బాధితులు కేవలం ఏడు రోజుల్లోనే త‌మ శరీర బరువును చాలా అధికంగా కోల్పోతారని శాస్త్ర‌వేత్త‌లు తెలిపారు. ఈ వేరియంట్ యాంటీబాడీ సామర్థ్యాన్ని కూడా తగ్గిస్తుంద‌ని వెల్లడించారు. దీనిగురించి పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ శాస్త్రవేత్తలు స్పందిస్తూ విదేశాల నుంచి వచ్చిన ఇద్దరు బాధితుల‌లో ఈ కొత్త వేరియంట్ ను కనుగొన్నామ‌న్నారు. అయితే ప్రస్తుతానికి ఇండియాలో ఈ వైర‌స్ కేసులు ఎక్కువ‌గా లేవ‌ని చెప్పారు.

Also Read: మ‌రీ ఇంత అందమా.. కుర్ర‌కారు గుండెల‌ను షేక్ చేస్తోన్న అన‌న్య నాగ‌ళ్ల‌

శంషాబాద్ విమానాశ్రయంలో మహిళ నుంచి 8 కిలోల హెరాయిన్‌ సీజ్.. దాని విలువ తెలిస్తే దిమ్మతిర‌గాల్సిందే