శంషాబాద్ విమానాశ్రయంలో మహిళ నుంచి 8 కిలోల హెరాయిన్‌ సీజ్.. దాని విలువ తెలిస్తే దిమ్మతిర‌గాల్సిందే

విశ్వనగరం హైదరాబాద్‌ కేంద్రంగా విదేశీ డ్రగ్స్‌ ముఠాలు తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాయి. నిషేధిత మాదక ద్రవ్యాలను అక్రమంగా సరఫరా చేస్తున్నారు...

శంషాబాద్ విమానాశ్రయంలో మహిళ నుంచి 8 కిలోల హెరాయిన్‌ సీజ్.. దాని విలువ తెలిస్తే దిమ్మతిర‌గాల్సిందే
Heroin Seized
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 06, 2021 | 12:46 PM

విశ్వనగరం హైదరాబాద్‌ కేంద్రంగా విదేశీ డ్రగ్స్‌ ముఠాలు తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాయి. నిషేధిత మాదక ద్రవ్యాలను అక్రమంగా సరఫరా చేస్తున్నారు. పబ్బులు, క్లబ్లులే టార్గెట్‌గా డ్రగ్స్‌ విక్రయిస్తున్నారు. దీంతో అనేక మంది యువత డ్రగ్స్‌ విషవలయంలో చిక్కుకొని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తాజగా భారీగా డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. జాంబియాకు చెందిన మహిళ నుంచి పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు డీఆర్‌ఐ అధికారులు. దోహా నుంచి శంషాబాద్‌కు చేరుకున్న మహిళను తనిఖీ చేయగా భారీగా హెరాయిన్‌ పాకెట్లు లభ్యమయ్యాయి. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అనుమానాస్పదంగా కనిపించిన మహిళను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఆమె నుంచి 8 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. దీని మొత్తం విలువ రూ. 53 కోట్ల వరకు ఉంటుందని పేర్కొన్నారు. జాంబియాకు చెందిన నిందితురాలి పేరు ముకుంబా కరోల్‌ అని తెలిపారు. ఆమెను అదుపులోకి తీసుకున్న డీఆర్ఐ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:  పాపం.. స్టంట్ ఫెయిల్ అయ్యింది.. కుర్చీ ముక్క‌ల‌య్యింది.. ఏడుపొక్క‌టే త‌క్కువ‌

 మ‌రీ ఇంత అందమా.. కుర్ర‌కారు గుండెల‌ను షేక్ చేస్తోన్న అన‌న్య నాగ‌ళ్ల‌