Postal Scheme: పోస్టాఫీసులో అద్భుతమైన స్కీమ్.. రూ.100 అన్వెస్ట్ చేస్తే చేతికి రూ.10 లక్షలు..!
Postal Scheme: పోస్టాఫీసులో అనేక రకాల స్కీమ్‌లు అందుబాటులో ఉన్నాయి. తక్కువ మొత్తంలో అన్వెస్ట్ చేస్తూ ఎక్కువ రాబడి పొందే అవకాశాలున్నాయి. ఇప్పటికే పోస్టాఫీసుల్లో..
Postal Scheme: పోస్టాఫీసులో అనేక రకాల స్కీమ్‌లు అందుబాటులో ఉన్నాయి. తక్కువ మొత్తంలో అన్వెస్ట్ చేస్తూ ఎక్కువ రాబడి పొందే అవకాశాలున్నాయి. ఇప్పటికే పోస్టాఫీసుల్లో అనేక రకాల స్కీమ్‌లతో లాభాలు పొందే అవకాశం ఉంది. పోస్టల్ శాఖ కస్టమర్లకు రోజురోజుకు కొత్త కొత్త స్కీమ్‌లను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇక పోస్టాఫీసు అందించే స్కీమ్‌లలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) పీపీఎఫ్ స్కీమ్ కూడా ఒకటి. ప్రస్తుతం ఈ స్కీమ్‌పై 7.1 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. మీరు ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.100 డిపాజిట్ చేసినా సరిపోతుంది. లేదంటే గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు.
ఒక వ్యక్తి కేవలం పీపీఎఫ్ ఖాతా మాత్రమే తెరిచేందుకు అవకాశం ఉంటుంది. ఇందులో డబ్బులు పెడితే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహామింపు ఉంటుంది. మెచ్యూరిటీ సమయంలో తీసుకునే డబ్బులపై ఎలాంటి పన్ను ఉండదు. పీపీఎఫ్ (PPF) మెచ్యూరిటీ కాలం 15 సంవత్సరాలు. అయితే మీరు కావాలనుకుంటే ఇంకా ఐదేళ్ల చొప్పున మెచ్యూరిటీ కాలాన్ని పొడిగించవచ్చు. ఇకపోతే వడ్డీ రేటు ప్రతి మూడు నెలలకు ఒకసారి మారవచ్చు. మీరు రోజుకు రూ.100 పొదుపు చేసి నెల చివరిలో రూ.3 వేలను పీపీఎఫ్ ఖాతాలో డిపాజిట్ చేస్తే.. మీకు మెచ్యూరిటీ కాలంలో దాదాపు రూ.10 లక్షలు వస్తాయి.