వ్యాక్సినేషన్ విధుల్లో ఇక పోలింగ్ బూత్ ఆఫీసర్లు….ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయం.. వార్డుల వారీగా టీకామందుల కార్యక్రమం
ఢిల్లీలో 45 ఏళ్ళ వయస్సు పైబడినవారికి వ్యాక్సిన్ వేయించేందుకు ఇక పోలింగ్ బూత్ ఆఫీసర్ల సేవలను వినియోగించుకుంటామని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.
ఢిల్లీలో 45 ఏళ్ళ వయస్సు పైబడినవారికి వ్యాక్సిన్ వేయించేందుకు ఇక పోలింగ్ బూత్ ఆఫీసర్ల సేవలను వినియోగించుకుంటామని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. వ్యాక్సిన్ కొరత లేకపోతే ఈ వయస్సువారికందరికీ నాలుగు వారాల్లోగా టీకామందులు ఇవ్వవచ్చునన్నారు. ఈ ఏజ్ గ్రూపు వారు నగరంలో 57 లక్షల మంది ఉన్నారని, వీరిలో 27 లక్షల మంది తొలి డోసు తీసుకున్నారని ఆయన చెప్పారు. పోలింగ్ బూత్ అధికారులు తమ వార్డుల్లోని ప్రతి ఇంటికి వెళ్లి ఈ కార్యక్రమాన్ని చేపడతారని, లేదా ప్రజలు తమ సమీప పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లి టీకామందు తీసుకోవచ్చునని ఆయన చెప్పారు. మొదట నగరంలోని 70 వార్డుల్లో మంగళవారం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. ఢిల్లీలో మొత్తం 280 వార్డులు ఉన్నాయి. ప్రతి వారం 70 వార్డుల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఉంటుందని కేజ్రీవాల్ చెప్పారు. పోలింగ్ బూత్ లు చాలావరకు ప్రజల ఇళ్ల సమీపంలోనే ఉంటాయని, అందువల్ల సమస్య తలెత్తబోదన్నారు.ఇంతేకాదు..ఇళ్ల నుంచి ప్రజలను పోలింగ్ కేంద్రాల వద్దకు తీసుకువెళ్లేందుకు ఈ-రిక్షాలను కూడా వినియోగిస్తామని ఆయన వివరించారు.
రెండు డోసుల వ్యాక్సిన్ కి ఈ ప్రాసెస్ రెండు రౌండ్లుగా రిపీట్ అవుతుంది. దీనివల్ల ఇటు పోలింగ్ అధికారులకు, అటు ప్రజలకు ఇది ఎంతో సౌలభ్యంగా ఉంటుంది అని ఆయన పేర్కొన్నారు. వ్యాక్సిన్ కొరత తీరితే 18-44 ఏళ్ళ మధ్య వయస్కులకు కూడా ఈ విధానాన్ని అమలు చేస్తామన్నారు. ఇప్పటివరకు వ్యాక్సినేషన్ డ్రైవ్ లో పోలింగ్ అధికారుల సేవలను ఏ రాష్ట్రమూ వినియోగించుకొలేదని ఆయన చెప్పారు. ఇక టీకామందుల కొరతను అధిగమించేందుకు తమ ప్రభుత్వం ఇంకా ఉత్పత్తిదారులతో చర్చలు జరుపుతోందని ఆయన వెల్లడించారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Brain Boosting Food For Kids: మీ పిల్లల మెదడు చురుగ్గా పనిచేయాలంటే ఈ ఆహారం తినిపించాలి.. నిపుణుల సూచనలు..
Coronavirus: అక్కడ మాస్క్ పెట్టుకుంటే ఫైన్.. ఎందుకు ఈ నిబంధన పెట్టారంటే