Coronavirus: అక్కడ మాస్క్ పెట్టుకుంటే ఫైన్.. ఎందుకు ఈ నిబంధన పెట్టారంటే
ప్రపంచ వ్యాప్తంగా కరోనా టెర్రర్ క్రియేట్ చేస్తోన్న వేళ .. మహమ్మారిని ఎదుర్కునేందుకు మాస్క్ బ్రహ్మస్త్రమని ఆరోగ్య నిపుణులు చెబుతోన్న విషయం తెలిసిందే.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా టెర్రర్ క్రియేట్ చేస్తోన్న వేళ .. మహమ్మారిని ఎదుర్కునేందుకు మాస్క్ బ్రహ్మస్త్రమని ఆరోగ్య నిపుణులు చెబుతోన్న విషయం తెలిసిందే. అందుకే ప్రభుత్వాలు మాస్క్‌ను తప్పనిసరి చేశాయి.. ధరించకపోతే ఫైన్స్ వేస్తున్నాయి. అయితే అమెరికాలో వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. అక్కడ చాలామంది ఇప్పటికే వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ క్రమంలో మాస్క్ ధరించాల్సిన అవసరం లేదని అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో కాలిఫోర్నియాలోని ఫిడిల్‌హెడ్ కెఫే రెస్టారెంట్.. షాకింగ్ రూల్ తీసుకొచ్చింది. రెస్టారెంట్‌లోకి మాస్క్ పెట్టుకుని వస్తే.. 5 డాలర్లు అదనంగా చెల్లించాల్సి వస్తుందని తెలిపింది. అమెరికాలో మాస్క్ అవసరం లేకున్నా.. చాలామంది వాటిని ధరించి రోజువారి తమ పనులు చేసుకుంటున్నారు. అయితే అనూహ్యంగా 5 డాలర్లు అదనంగా కట్టేందుకు సిద్దంగా ఉన్నారు కానీ ఎవరూ మాస్కులు తీసి మాత్రం అక్కడకు రావడం లేదు. దీంతో రెస్టారెంట్‌లో బిల్లులపై అదనంగా 5 డాలర్లు ఓ రేంజ్‌లో వసూలవుతున్నాయి. కాగా అదనంగా వచ్చిన నగదను స్వచ్ఛంద సంస్థలకు ఇస్తున్నట్లు ఆ రెస్టారెంట్ ఓనర్ తెలిపాడు. స్వచ్ఛంద సంస్థకు చేయూత ఇవ్వడం కోసం కస్టమర్ల నుంచి 5 డాలర్లు అదనంగా వసూలు చేయడం తమకు తప్పు అనిపించడంలేదని అతను పేర్కొన్నాడు.
Also Read: ఇంటిలోని చెత్తను ఖాళీ ప్రదేశంలో పడేస్తున్నారా..?.. తిరిగే అదే చెత్త మీ ఇంటి ముందుకు వస్తుంది