Prince Harry: బ్రిటన్ యువరాజు హ్యారీ, మార్కెల్ దంపతులకు ఆడబిడ్డ.. ఏం పేరు పెట్టారో తెలుసా..?

Meghan Markle and Prince Harry welcome second child: బ్రిటన్‌ యువరాజు హ్యారీ సతీమణి మేఘన్‌ మార్కెల్‌ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. శుక్రవారం రెండవ

Prince Harry: బ్రిటన్ యువరాజు హ్యారీ, మార్కెల్ దంపతులకు ఆడబిడ్డ.. ఏం పేరు పెట్టారో తెలుసా..?
Prince Harry Meghan Markle

Meghan Markle and Prince Harry welcome second child: బ్రిటన్‌ యువరాజు హ్యారీ సతీమణి మేఘన్‌ మార్కెల్‌ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. శుక్రవారం రెండవ సంతానంగా పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చినట్లు హ్యారీ, మార్కెల్ ఆదివారం వెల్లడించారు. ఈ నవజాత శిశువుకు లిలీబెట్‌ డయానా మౌంట్‌బాటన్‌ విండ్సార్‌ అని నామకరణం చేశారు. అమెరికా కాలిఫోర్నియాలోని శాంటా బార్బరా కాటేజ్‌ ఆసుపత్రిలో లిలీబెట్‌ జన్మించినట్లు హ్యారీ, మేఘన్‌ దంపతులు ప్రకటించారు. ఈ దంపతులకు మొదటి సంతానం అబ్బాయి ఆర్చీ వయసు 2 సంవత్సరాలు. కాగా.. బ్రిటన్‌ యువరాజు హ్యారీ, నటి మేఘన్‌ మార్కెల్‌‌ వివాహం 2018లో జరిగింది.

కాగా.. లిలీబెట్‌.. అనేది బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ ముద్దుపేరు. హ్యారీ తల్లి పేరు డయానా. ఆమె 1997లో జరిగిన కారు ప్రమాదంలో మరణించారు. ప్రస్తుతం హ్యారీ, మేఘన్‌ బ్రిటన్‌ రాజకుటుంబం నుంచి తెగదెంపులు చేసుకొని అమెరికాలో నివసిస్తున్నారు. ఇదిలాఉంటే.. హ్యారీ, మేఘన్‌ మార్కెల్‌ దంపతులకు కొడుకు జన్మించిన.. అనంతరం అతని రంగు చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ దంపతులు కుమార్తె ఫొటోను పంచుకోలేదు.

Also Read:

Afghanistan Violence: అఫ్ఘనిస్తాన్‌లో రెచ్చిపోతున్న తాలిబన్లు.. దేశాన్ని హస్తగతం చేసుకునేందుకు వ్యూహం

కేంద్రానికి, ట్విట్టర్ కు మధ్య పోరు..ప్రత్యామ్నాయం ఎదగడానికి ‘కూ’ ప్రయత్నాలు.. ఇప్పటికే నైజీరియాలో అందుబాటులో ఉన్నట్లు ప్రకటన